E-Paper
Advertisement

Vande Bharat Food: వందే భారత్ ఫుడ్ బాగాలేదా? రైల్వే అధికారులకు ఎలా కంప్లైంట్ చేయాలంటే?

Vande Bharat Food: వందే భారత్ ఫుడ్ బాగాలేదా? రైల్వే అధికారులకు ఎలా కంప్లైంట్ చేయాలంటే?
Advertisement

Indian Railways Food Safety Alert: వందే భారత్ లాంటి ప్రీమియం రైళ్లలో ప్రయాణం అంటే వేగం, సౌకర్యం మాత్రమే కాదు, మంచి ఆహారం కూడా ఆశిస్తారు ప్రయాణీకులు. కానీ, ఇటీవల కొన్ని సంఘటనలు ప్రయాణికుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. పాట్నా–టాటానగర్ మార్గంలో నడిచే వందేభారత్ రైలులో ఓ ప్రయాణికుడు పెరుగులో పురుగులు కనిపించాయని ఫిర్యాదు చేయడం తీవ్ర దుమారం రేపింది. ఈ ఘటనపై ఐఆర్‌సిటిసి, సంబంధిత ఫుడ్ కాంట్రాకర్ట్ పై రైల్వే శాఖ చర్యలు తీసుకుంది. పెద్ద మొత్తంలో జరిమానా విధించింది.

గతంలోనూ ఫుడ్ క్వాలిటీపై ఫిర్యాదులు

పెరుగులో పురుగులే కాదు, గతంలో కూడా వందే భారత్ రైళ్లలో ఆహార నాణ్యతపై పలు ఫిర్యాదులు వచ్చాయి. ప్రయాణికులు ప్రీమియం రైళ్లలో కూడా ఫుడ్ ఆర్డర్ చేసే ముందు జాగ్రత్తగా ఉండాలని సోషల్ మీడియాలో నెటిజన్లు సూచిస్తున్నారు. అయితే, వందేభారత్ లో  ఆహారం బాగోలేదని అనిపించినప్పుడు ఏం చేయాలి? రైల్వే అధికారులకు ఎలా ఫిర్యాదు చేయాలి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

రైల్వే ఫుడ్ బాగా లేకపోతే ఫిర్యాదు ఎలా చేయాలి?

Advertisement

వందేభారత్ రైల్లో ఫుడ్ బాగాలేకపోతే, ముందుగా రైల్వే హెల్ప్‌ లైన్ నంబర్‌ 139కు కాల్ చేయాలి. ఈ నంబర్‌ కు కాల్ చేయడం ద్వారా లేదంటే SMS పంపడం ద్వారా సమస్యను తెలియజేయవచ్చు. ఇది అత్యంత సులభమైన, వేగవంతమైన మార్గం. అలాకాకుండా ఇంకో ముఖ్యమైన మార్గం రైల్ మదాద్ యాప్. ఈ యాప్‌ ను డౌన్‌లోడ్ చేసి, మీ టికెట్ వివరాలు, సమస్య వివరాలు నమోదు చేస్తే వెంటనే రైల్వే అధికారులు స్పందిస్తారు. రైల్వే ఈ యాప్ ద్వారా వచ్చే ఫిర్యాదులను చాలా సీరియస్‌గా తీసుకుంటాయి.

ఫిర్యాదు చేసే ముందు గుర్తుంచుకోవాల్సిన విషయాలు

ఫిర్యాదు చేసే సమయంలో కొన్ని విషయాలు తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. మీకు అందించిన ఫుడ్ క్వాలిటీ బాగాలేకపోతే, దానికి సంబంధించిన ఫోటో లేదంటే వీడియో తీసుకోవడం మంచిది. ఆహారం చెడిపోయినా, పురుగులు ఉన్నా, వాసన వచ్చినా, వీడియోలో స్పష్టంగా రికార్డ్ చేయాలి. ఇవి మీ ఫిర్యాదుకు ఆధారాలుగా ఉంటాయి. అలాగే, మీరు ఇచ్చే ఫిర్యాదు వివరాలు క్లియర్‌ గా ఉండాలి. ఆహారం బాగోలేదని మాత్రమే చెప్పడం కాకుండా, ఏ సమస్య ఉందో స్పష్టంగా వివరించాలి. పెరుగులో పురుగులు ఉన్నాయి, లేదంటే కూర చెడిపోయింది లాంటి వివరాలు ఇవ్వడం వల్ల అధికారులు త్వరగా చర్యలు తీసుకుంటారు.

Advertisement

వందే భారత్ వంటి ప్రీమియం రైళ్లలో ఆహార నాణ్యతపై సమస్యలు ఎదురైనా, ప్రయాణికులకు ఫిర్యాదు చేసే సరైన మార్గాలు ఉన్నాయి. సరైన సమయంలో స్పందించి, ఆధారాలతో ఫిర్యాదు చేస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటారు.

Read Also:  గంటకు 180 కిలోమీటర్ల వేగం.. భారతీయ రైల్వేలో సరికొత్త శకం ప్రారంభం!

Related News

మొబైల్ నెంబర్‌లో ఒక్క అంకె తప్పు, కన్ఫార్మ్‌డ్ టికెట్ ఉన్నా.. రైలు నుంచి గెంటివేత, చివరికి..

ఇండిగో విమానానికి ప్రమాదం.. శ్రీనగర్ ఎయిర్‌పోర్టులో ఘటన

రైలు సీటులో కూర్చొనే ముందు జాగ్రత్త.. భయంతో వణికిపోతున్న ప్రయాణికుడు

లేడీస్ డ్రైవ్ చేస్తారు.. లేడీసే ప్రయాణిస్తారు.. హైదరాబాద్‌లో ర్యాపిడో అదిరిపోయే Pink Bike సర్వీస్!

తెలుగు రాష్ట్రాల మీదుగా వెళ్లే రైళ్ల వేళలు మార్పు.. చెక్ చేసుకోపోతే ఇక అంతే!

వందే భారత్ రైళ్లలో రొటేటింగ్ సీట్లు తొలగింపు? ఈ 3 సమస్యలే కారణమట!

వందే భారత్ రైలు చక్రాలకు తాళాలు వేసిన లోకో పైలెట్.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 250కి పైగా వందే భారత్ స్లీపర్ రైళ్లు వచ్చేస్తున్నాయ్!

Big Stories

Advertisement
×