E-Paper
Advertisement

Gundeninda Gudigantalu Balu : ‘ గుండెనిండా గుడిగంటలు’ సీరియల్ లవర్స్ కు షాక్.. బాలు అవుట్..

Gundeninda Gudigantalu Balu : ‘ గుండెనిండా గుడిగంటలు’ సీరియల్ లవర్స్ కు షాక్.. బాలు అవుట్..
Advertisement

Gundeninda Gudigantalu Balu : బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న టాప్ సీరియల్స్లలో ఒకటి గుండె నిండా గుడి గంటలు. ఈ సీరియల్ లో నటించేవారంతా వేరే ఇండస్ట్రీల నుంచి వచ్చిన వాళ్లే. అయినా కూడా సీరియల్ స్టోరీ బాగా నచ్చడంతో జనాలు ఈ సీరియల్ ని చూసేందుకు ఎగబడుతున్నారు ఈమధ్య ట్విస్టుల మీద ట్విస్టులు ఉండడంతో ఈ సీరియల్ ప్రతిరోజు కూడా మంచి రేటింగ్ ని సొంతం చేసుకుంటుంది. ఇందులో హీరో పాత్రలో తమిళనటుడు విష్ణు కాంత్ నటించారు.. అలాగే హీరోయిన్ పాత్రలో కన్నడ ముద్దుగుమ్మ అమూల్య గౌడ నటించింది. వేర్వేరు ఇండస్ట్రీ నుంచి వచ్చినా కూడా వీళ్ల నటన మాత్రం జనాలని బాగా కట్టిపడేసింది.. వీళ్ళిద్దరూ బయట ఎక్కడ కనిపించినా సరే ఫోటోలు దిగుతూ తమ అభిమానాన్ని చూపిస్తున్నారు. ఈ సీరియల్కు వీళ్లిద్దరే హైలెట్. ఏ ఒక్కరు కూడా లేరు అంటే సీరియల్ ని చూడటానికి జనాలు ఇష్టపడరు.. అయితే తాజాగా సోషల్ మీడియాలో అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సీరియల్ నుంచి హీరో బాలు అలియాస్ విష్ణుకాంత్ తప్పుకుంటున్నట్లు ఓ వార్త షికారు చేస్తుంది.. మంచి ఫేమ్ తెచ్చి పెట్టిన ఈ సీరియల్ నుంచి హీరో తప్పుకోవడం ఏంటి అంటూ సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.. ఈ వార్తలో నిజం ఎంత ఉందో తెలియదు గానీ హీరో బాలు మాత్రం సీరియల్ లో లేకున్నా అంటే కచ్చితంగా దీని రేటింగ్ దారుణంగా పడిపోతుంది అని తెలుస్తుంది. అసలు నిజంగానే బాలు ఎందుకు ఈ సీరియల్ నుంచి బయటికి వెళ్ళాలి అని అనుకుంటున్నాడు అన్నది ఇప్పుడు మనం కాస్త వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం..

‘గుండెనిండా గుడిగంటలు’ నుంచి బాలు అవుట్..

మధ్యతరగతి కుటుంబంలోని మనుషులు తమ పరిస్థితులకు అనుగుణంగా ఉన్న స్టోరీలతో వచ్చేసి సినిమాలకు అలాగే సీరియల్స్ కి బాగా కనెక్ట్ అవుతారు. స్టార్ మా లో ప్రసారమవుతున్న గుండె నిండా గుడి గంటలు సీరియల్ కూడా ఒక మధ్యతరగతి కుటుంబంలో జరిగే సన్నివేశాల ఆధారంగా తెరకెక్కింది.. ఈ సీరియల్ హీరో బాలు తన నేచురల్ నటనతో తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాడు.. ఒక్క మాటలో చెప్పాలంటే సినిమా హీరోని మించిన ఫాలోయింగ్ అతనికి ఉండడానికి కారణం ఆ సీరియలే.. అలాంటి మంచి క్రేజ్ ను అందించిన సీరియల్ నుంచి బాలు బయటికి వచ్చేసాడంటూ ఓ వార్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.. అయితే బాలు కి తెలుగులో మరో సీరియల్స్ రావడంతో పాటుగా తమిళంలో వరసగా సినిమా అవకాశాలు కూడా వచ్చినట్లు తెలుస్తుంది. వాటి కోసమే ఈ సీరియల్ నుంచి తప్పుకున్నట్లు కోలీవుడ్ మీడియా వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై ఒక క్లారిటీ రావాలంటే ఖచ్చితంగా బాలు రెస్పాండ్ అవ్వాల్సిందే.. అసలు నిజాలు ఏంటో ఆయన నోటివెంటే చెప్తే కానీ ఈ కామెంట్స్ అనేవి తగ్గేలా కనిపించడం లేదు..

Advertisement

Also Read : ‘పొదరిల్లు’ మహా రియల్ లైఫ్ లవ్ స్టోరీ.. ఇదేం ట్విస్ట్ మావా..

బాలు సీరియల్స్..

తమిళనాడుకు చెందిన నటుడు బాలు అలియాస్ విష్ణుకాంత్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.. తెలుగులో భాష రాకపోయినప్పటికీ ఇక్కడ సీరియల్స్ ద్వారా తెలుగు జనాలకి బాగా కనెక్ట్ అయ్యాడు. తన నటన పెద్దవాళ్ళను ఆకర్షిస్తే, తన స్టైలు అమ్మాయిలను బాగా ఆకట్టుకుంది.. అలాంటి బాలు ఇప్పుడు సీరియల్ నుంచి తప్పుకోవాలి అని అనుకోవడంపై పెద్ద చర్చ జరుగుతుంది.. తమిళంలో వరుసగా సీరియల్స్ చేసి మంచి క్రేజ్ ని సంపాదించుకున్న విష్ణుకాంత్ గుండె నిండా గుడి గంటలు సీరియల్తో తెలుగులోకి ఎంటర్ అయ్యాడు.. దీంతో పాటుగా తెలుగులో జెమినీ టీవీలో ప్రసారమవుతున్న మా ఇంటి దేవత అనే సీరియల్ లో కూడా మంచి క్యారెక్టర్ లో నటిస్తున్నాడు. ఇక సోషల్ మీడియాలో ఈయనకున్న ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. యూట్యూబ్ ఛానల్ తో పాటుగా పలు సోషల్ మీడియా అకౌంట్లో ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. ఏది ఏమైనప్పటికీ.. బాలు ఈ సీరియల్ లో ఇకమీదట కనిపించడు అన్న వార్త ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులకు జీర్ణం కాలేదు.. మరి దీనిపై ఒక క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే..

Related News

పిచ్చి కుక్కల్లా మొరగండి… ట్రోలర్స్ కు కౌంటర్ ఇచ్చిన శిరీష!

నాని ఫోక్ సాంగ్ తో అదరగొట్టేసిన శ్రీముఖి.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode September 2nd  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పార్థును చంపేందుకు రెడీగా ఉన్న రౌడీలు

Godavari Janu : హాట్ లుక్ లో రెచ్చగొడుతున్న నిత్య.. కుర్రాళ్ళు తట్టుకోలేరమ్మ..!

Gundeninda GudiGantalu Today episode: బాలుకు షాకిచ్చిన నీలకంఠం.. కన్నీళ్లు పెట్టుకున్న మౌనిక.. పాపం బాలు..

Podarillu Today Episode : మహా మాటతో ఆది షాక్.. చక్రీ ప్లాన్ సక్సెస్.. మాధవ్ నిజం చెప్తాడా..?

Karthika Deepam 2 Serial Today Episode September 2nd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: దీప, కార్తీక్ లను వెనకేసుకొచ్చిన జ్యోత్స్న       

Illu illaalu Pillalu Prema : ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్.. ప్రేమను తొలగించారా?

Big Stories

Advertisement
×