E-Paper
Advertisement

అరుదైన వ్యాధితో బాధపడుతున్న విశ్వ భార్య.. ట్రోల్స్ పై గట్టి కౌంటర్!

అరుదైన వ్యాధితో బాధపడుతున్న విశ్వ భార్య.. ట్రోల్స్ పై గట్టి కౌంటర్!
Advertisement

Actor Vishwa:ఒకప్పుడు సినిమాలలో నటించి ఆ తర్వాత సీరియల్స్ ద్వారా తన కెరీర్ ను మలుపు తిప్పుకొని.. తెలుగు బిగ్ బాస్ సీజన్ 5లో కంటెస్టెంట్ గా పాటిస్పేట్ చేసి వెలుగులోకి వచ్చారు విశ్వ. అలా ఒకానొక సమయంలో చేతినిండా వరుస సీరియల్స్ తో బిజీగా మారిన సమయంలో అనుకోకుండా అవకాశాలు కోల్పోయారు.. ఇక ఆ సమయంలో ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్న విశ్వ.. ఆఖరికి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కూడా నడిపారు. అంతేకాదు హోటల్లో గిన్నెలు కడిగే స్టేజ్ నుంచి రేషన్ బియ్యం తిన్న రోజులు కూడా ఉన్నట్లు గుర్తు చేసుకున్నారు. ఆ తర్వాత ఒక్కో మెట్టు ఎదుగుతూ 50 కోట్ల విలువ చేసే “విశ్వ ఫిట్నెస్ క్లబ్” ను స్థాపించి ప్రస్తుతం ఫిట్నెస్ ట్రైనర్ గా కెరియర్ ను కొనసాగిస్తున్నారు. అలాంటి ఈయనకు తాజాగా పెద్ది సినిమాలో అవకాశం వచ్చింది. ఈ నేపథ్యంలోనే పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటూ ఎన్నో విషయాలను పంచుకుంటున్నారు. అందులో భాగంగానే తన భార్య శ్రద్ధ పై వచ్చిన ట్రోల్స్ కి గట్టి కౌంటర్ ఇచ్చారు విశ్వ.

ముందు నీ భార్యను సన్నగా చెయ్.. విశ్వ భార్యపై ఊహించని ట్రోల్స్..

ఫిట్నెస్ క్లబ్ ఏర్పాటు చేసిన తర్వాత శ్రద్ధ ఫిట్నెస్ క్లబ్లో డైట్ ప్లాన్, ఫుడ్ ప్రిపేర్ చేస్తూ ఉంటుంది . నేనేమో ఎక్సర్సైజ్ చేయిస్తాను. నేను ఎప్పుడైనా శ్రద్ధతో కలిసి వీడియోలు పెడితే మాత్రం దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. ముందు నీ పెళ్ళాన్ని సన్నగా చేయి.. వేరే వాళ్లకు నీతులు చెప్పడం కాదు.. ఇంట్లో సక్కగా చూసుకో.. వీధిలో సంగతి తర్వాత అని ట్రోల్స్ చేస్తున్నారు. అయితే వాళ్లు అన్న దాంట్లో తప్పులేదు.. కానీ అసలు నిజం తెలియకుండా ట్రోల్స్ చేయడం మమ్మల్ని మరింత బాధకు గురి చేసింది.

Advertisement

also read:ఆ వ్యాధి మళ్లీ వస్తుందని అనుకోలేదు.. మాతృత్వాన్ని అనుభవించలేకపోతున్నా – దీపిక

నా భార్యకు అలాంటి వ్యాధి వచ్చింది – విశ్వ

అయితే నా భార్య సడన్గా బరువు పెరగడానికి కారణం హార్మోన్ల అసమతుల్యత..రెండోసారి కొడుకు పుట్టాక హార్మోన్ల అసమతుల్యత కారణంగా శ్రద్ధ విపరీతంగా బరువు పెరిగిపోయింది. కొన్ని నెలలకు ఎక్సర్సైజ్ మొదలు పెట్టాము. కానీ తనకు కార్పెల్ టన్నెల్ అనే ఒక అరుదైన వ్యాధి వచ్చింది. ఈ వ్యాధి కారణంగా చేతులు బలహీనంగా మారిపోయాయి. ఆఖరికి పిల్లాడికి షర్టు బటన్ కూడా పెట్టే అంత శక్తి శ్రద్ధలో లేకపోయింది . ఇక తన పనులు కూడా తాను చేసుకోలేకపోయింది. ఈ వ్యాధి వల్ల ఎక్సర్సైజ్ ఆపేయాల్సి వచ్చింది. అంటూ తన భార్య ఆరోగ్య పరిస్థితి గురించి చెప్పి కన్నీటి పర్యంతం అయ్యారు విశ్వ. మొత్తానికైతే అసలు నిజం తెలియకుండా ట్రోల్స్ చేసిన వారికి గట్టిగా కౌంటర్ ఇచ్చారు విశ్వ. ప్రస్తుతం ఈయన చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

Related News

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

సలార్‌లో ఛాన్స్ కోసం ఝాన్సీ ఏం చేశారో తెలుసా?

ఆ రోజు షూటింగ్‌లో ఏం జరిగిందంటే.. ఝాన్సీ కన్నీటి కథ!

సుధీర్ కామెడీకి ఫిదా అవ్వాల్సిందే.. ఇస్మార్ట్ బతుకమ్మలో ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్!

జాను లిరి ఒక్క పాటకు ఎంత తీసుకుంటుందో తెలుసా?

యూట్యూబర్ నందనకి కోర్టులో భారీ ఊరట.. సంచలన పోస్ట్ వైరల్!

Telugu Tv Serials : బిగ్ బాస్ ఎఫెక్ట్.. ఆ సీరియల్స్ కు శుభం కార్డు పడినట్లే..?

ఒక్కరోజులో మారిపోయిన లెక్కలు..ఆరో వారం ఊహించని ఎలిమినేషన్ ట్విస్ట్..!

Big Stories

Advertisement
×