E-Paper
Advertisement

చంద్ర‌బాబు కంట్రోల్‌లో కేబినెట్ లేదా? లీకుల‌పై వార్నింగు ఇచ్చేదాకా ఎందుకు పోయింది??

చంద్ర‌బాబు కంట్రోల్‌లో కేబినెట్ లేదా? లీకుల‌పై వార్నింగు ఇచ్చేదాకా ఎందుకు పోయింది??
Advertisement

చంద్ర‌బాబు నాయుడంటేనే క్ర‌మ‌శిక్ష‌ణ‌కు పేరంటారు. అడ్మినిస్ట్రేష‌న్ విష‌యంలో పార్టీల‌క‌తీతంగా ఎవ‌రిన‌డిగినా అత‌ను నెంబ‌ర్ వ‌న్ అని కితాబునిస్తారు. అంత‌టి సీనియ‌రిటీ బాబు సొంతం. జ‌ర్న‌లిస్టు స‌ర్కిళ్లలో కూడా రెండు తెలుగు రాష్ట్రాల‌కు సంబంధించిన వారు ఎవ‌రైనా మెజారిటీగా బాబు పాల‌న‌, అడ్మినిస్ట్రేష‌న్‌ను భేష్ అని మెచ్చుకోకున్నా… పాస్ మార్కులేస్తారు. ఈ ఫ‌లితాల ద‌రిదాపుల్లోకి కూడా ఇత‌ర నేత‌లు, పాల‌న రాదంటే అతిశ‌యోక‌క్తి కాదు. మ‌రి అలాంటి చంద్ర‌బాబే ఏకంగా త‌న కేబినెట్ బృందానికి లీకుల‌పై వార్నింగ్ ఇచ్చేదాకా వ‌చ్చిదంటే.. ప‌రిస్థితి చేజారుతుంద‌నే అర్థం వ‌స్తుంది.

ప‌రిపాల‌న ప‌రంగా, నాయ‌కులు తీరు, ప్ర‌వ‌ర్త‌న ప‌ట్లా ఆయ‌న క‌ఠినంగానే ఉంటారు. చెప్పేది సూటిగానే ఉంటుంది. స‌మ‌యం, సంద‌ర్భం బ‌ట్టి అది క‌టువుగా కూడా మారుతుంది. లీకుల విష‌యానికొస్తే.. సాధార‌ణంగా కేబినెట్ మీటింగు లీకులుంటాయి. పాజిటివ్ అంశాలు ఎక్కువ‌గా బ‌య‌ట‌కు వ‌స్తుంటాయి. జ‌ర్న‌లిస్టుల‌తో ఎక్కువ సంబంధాలు కలిగిన నేత‌లు త‌రుచూ లీకులు ఇవ్వ‌డం పరిపాటి. ఎలాగో ఈ విష‌యం లేటుగానైనే తెలుస్తుంది క‌దా అని తేలిక‌గా తీసుకునే దోర‌ణి కావొచ్చు.. తాను చెప్ప‌డం మూలంగా ఆ మీడియా స‌ర్కిల్‌లో త‌న‌కు ప్రాధాన్య‌త దొరికుతుంద‌నే అత్యుత్సాహం కావొచ్చు… వారిద్ద‌రి మ‌ధ్య ఉన్న స్నేహ‌బంధం కావొచ్చు. లీకులు జ‌రుగుతాయి.

Advertisement

స‌ర్కార్ కూడా వీటిని పెద్ద‌గా ప‌ట్టించుకోదు. కానీ కీల‌క‌మైన నిర్ణ‌యాలు తీసుకునే క్ర‌మంలో, జీవోల జారీ విష‌యాల్లో స‌ర్కార్ గోప్య‌త పాటిస్తుంది. అలాంటి నిర్ణ‌యాలు క‌త్తికి రెండు వైపులా ప‌దునులా ఉంటాయి. ఈ విష‌యం లీకైతే జ‌నానికి ఎంత మేలు జరుతుంద‌నే విష‌యం క‌న్నా.. స‌ర్కార్‌కు చెడ్డ పేరును ఆపాదించే క్ర‌మంలో ఎలాంటి ఆరోప‌ణ‌లు చేయొచ్చ‌నే విష‌యంలో ప్ర‌తిప‌క్షం ఆలోచిస్తుంది. ప్ర‌తీదీ ఆందోళ‌న చేసి ర‌చ్చ చేసే చాన్స్ లేకున్నా.. ఇదే అల‌వాటుగా మారిన‌ప్పుడు .. చివ‌ర‌కు స‌ర్కార్‌ను ఇబ్బందిపెట్టే విధంగా విధాన‌ప‌ర‌మైన నిర్ణ‌యాల‌ను కూడా బ‌య‌ట‌కు లీక‌వుతాయి.

అట్లాంటి స‌మ‌యంలోనే ప్ర‌భుత్వం ఇబ్బంది ప‌డుతుంది. నిజం గ‌డ‌ప దాట‌క‌ముందే.. అబ‌ద్దం ఊరంతా చుట్టి వ‌చ్చిన‌ట్టు.. వాటిని త‌మ రాజ‌కీయ మైలేజీకి అనుకూలంగా ప్ర‌తిప‌క్షం ఓ అస్త్రంగా ఉప‌యోగించే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి. కొంత ప్ర‌భుత్వంలో స్వేచ్చా ప‌రిధి ఎక్కువైన‌ప్పుడు, కూట‌మి ప్ర‌భుత్వంలో భాగంగా కొంద‌రిని అన్ని ర‌కాలుగా కంట్రోల్‌లో పెట్ట‌డానికి ఇబ్బంది ప‌డిన‌ప్పుడు .. సరైన అవ‌గాహ‌న, అనుభవం లేన‌ప్పుడు అత్యుత్సాహంగా ఇలాంటి లీకులు పెరుగుతాయి.

Advertisement

దీన్ని సీరియ‌స్‌గా కంట్రోల్‌లోకి తీసుకురాక‌పోతే.. త‌ర్వాత కొన్ని ప‌రిస్థితులు చేతులు దాటే ప్ర‌మాద‌మూ ఉంటుంది. రాజ‌కీయంగా న‌ష్ట‌పోయే అవ‌కాశాలూ ఉన్నాయి. అందుకే చంద్ర‌బాబు దీన్ని అంత లైట్‌గా ఏం తీసుకోలేదు. నాడు ఎన్టీఆర్ ఈ లీకుల కార‌ణంగా కేబినెట్‌నే ర‌ద్దు చేసిన విష‌యాన్ని కూడా ప్ర‌స్తావించారంటే ఈ విష‌యాన్ని చంద్ర‌బాబు ఎంత సీరియ‌స్‌గా తీసుకున్నారో అర్థం చేసుకోవ‌చ్చు.

Related News

ఇంకా దాగుడు మూతలు ఎందుకు.. చంద్రబాబు, నారా లోకేష్ పై నిప్పులు చెరిగిన జగన్!

ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌కు షాకిచ్చిన కూటమి సర్కార్.. స్పందిచిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

కూటమి సర్కార్ పై పేర్ని నాని ఫైర్.. డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్!

కొబ్బరి చెట్టుని ఢీ కొట్టిన కారు, స్పాట్ ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

Big Stories

Advertisement
×