E-Paper
Advertisement

Kissik Talks: కష్టం వచ్చిన ప్రతిసారి.. నన్ను ఏదో శక్తి ప్రొటక్ట్ చేస్తుంది- లయ

Kissik Talks: కష్టం వచ్చిన ప్రతిసారి.. నన్ను ఏదో శక్తి ప్రొటక్ట్ చేస్తుంది- లయ
Advertisement

Kissik Talks: నాకు పెద్ద ఇష్యూస్ అవ్వాల్సినప్పుడు కూడా, అవి అవకుండా ఏదో శక్తి కాపాడుతుందని అన్నారు నటి లయ (Actress Laya). తాజాగా ఆమె బిగ్ టీవీ కిస్సిక్ టాక్స్ (Bigg TV Kissik Talks) పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. లవ్ అని చెప్పి మోసం చేసే వారి గురించే కాకుండా, కర్మ (Fate) ఎలా పని చేస్తుందో, తనకు కష్టం వచ్చిన ప్రతిసారి ఏం జరుగుతుందో.. ఆమె ఈ ఇంటర్వ్యూలో వివరంగా చెప్పారు.

ఆ పొజిషన్‌లో ఎవరూ ఉండొద్దు

‘‘లవ్ చేస్తున్నానని చెప్పి మోసం (cheating) చేసే వారి గురించి చెబుతూ.. ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలి.. ఎదుటివారు ఏం చెబుతున్నారనేది. కొన్ని సార్లు మనం చేతుల్లో ఉండొచ్చు, నిజంగా నమ్మించేయవచ్చు కానీ, ఆ పొజిషన్‌లో ఎవరూ ఉండొద్దని నేను కోరుకుంటున్నాను. చాలా పెయిన్ ఫుల్‌గా ఉంటుంది. చాలా హర్టింగ్‌గా ఉంటుంది. అలాంటిది రాకూడదని అందరికీ విష్ చేస్తున్నాను. ఇలాంటి విషయాలలో ఆడ, మగ ఎవరైనా స్ట్రాంగ్‌గా ఉండాలి.

Advertisement

Also Read- Big TV Kissik Talks: లవ్ ఫెయిల్యూర్ అని ప్రాణాలు తీసుకునే వారికి లయ క్లాస్!

కర్మ.. తప్పకుండా రిటన్ అవుతుంది

వాళ్లు చేస్తుంది తప్పని వాళ్లకి తెలుసు.. చిన్న పిల్లలు కాదు కదా. వాళ్లకి తెలిసి చేస్తున్నప్పుడు ఏం చెప్పాలి. ఇలా చేయకూడదని ఎడ్యుకేట్ కూడా చేయలేం.. చెబితే వినరు. అలా వాళ్లు చేయడానికి కారణం ఏమై ఉంటుందనేది నాకు కూడా తెలియదు. అలా చేసే వాళ్లకి దేవుడు తప్పకుండా శిక్ష వేస్తాడు. వాళ్లకే తగలవచ్చు, లేదంటే వాళ్లు ప్రేమించే వారికి ఎవరికైనా తప్పకుండా తగులుతుంది. కర్మ అనేది ఒకటి ఉంటుంది కదా. కర్మను నేను నమ్ముతాను. మనం ఏదయితే చేస్తామో.. అది మనకు రిటన్ వస్తుంది. ఏదో ఒక రూపంలో కచ్చితంగా వస్తుంది. నేను అదే నమ్ముతాను. అది నేచర్. కర్మ అని మనం పెట్టుకున్నాం కానీ, అది నేచర్ రియాక్షన్.

Advertisement

Also Read- Kissik Talks: చుట్టూ బ్యాడ్ పీపుల్ ఉన్నారు.. మనం తట్టుకోలేని ఇష్యూ ఇది!

ఆ పవరేంటో నాకూ తెలియదు

నేను ఒకరు నాశనం అవ్వాలని ఎప్పుడూ కోరుకోలేదు. నాకు చెడు చేసినా కూడా అది నాకు ఎఫెక్ట్ చూపించలేదు. మా పేరేంట్స్ చేసిన పూజలో, లేదంటే అందరూ మంచిగా ఉండాలని నేను కోరుకోవడం వల్లనో తెలియదు కానీ, ఏదో ఒకటి మాత్రం నన్ను ప్రొటక్ట్ చేస్తూనే ఉంది. నాకు పెద్ద ఇష్యూస్ అవ్వాల్సినప్పుడు కూడా, అవి అవకుండా కాపాడింది. బ్యాడ్ ఎక్స్‌పీరియెన్స్‌లో కూడా నన్ను ఏదో ఒక పవర్ ప్రొటక్ట్ చేసింది. అదేంటనేది నాకు కూడా తెలియదు’’ అని.. తనకు చెడు చేసిన వాళ్లపై కూడా లయ జాలి చూపించారు.

Also Read- Big TV Kissik Talks: నువ్వేంటి నాకు చెప్పేది? అనే వారే కానీ.. శివాజీ కాంట్రవర్సీపై లయ!

Related News

చీరకట్టులో శివజ్యోతి..ఆ భారీ హారం చూస్తే మతిపోవాల్సిందే!

ఈశ్వర్ సాయి కేసులో కొత్త ప్రశ్న.. ‘పెళ్లైనోడిని ఎలా నమ్మావ్ మాధురి?’

స్టార్ హీరోల సినిమాల కంటే సీరియల్స్‌కే ఎక్కువ క్రేజ్.. అసలు సీక్రెట్ ఏంటి?

పిచ్చి కుక్కల్లా మొరగండి… ట్రోలర్స్ కు కౌంటర్ ఇచ్చిన శిరీష!

నాని ఫోక్ సాంగ్ తో అదరగొట్టేసిన శ్రీముఖి.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode September 2nd  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పార్థును చంపేందుకు రెడీగా ఉన్న రౌడీలు

Godavari Janu : హాట్ లుక్ లో రెచ్చగొడుతున్న నిత్య.. కుర్రాళ్ళు తట్టుకోలేరమ్మ..!

Gundeninda GudiGantalu Today episode: బాలుకు షాకిచ్చిన నీలకంఠం.. కన్నీళ్లు పెట్టుకున్న మౌనిక.. పాపం బాలు..

Big Stories

Advertisement
×