E-Paper
Advertisement

Big TV Kissik Talks: నువ్వేంటి నాకు చెప్పేది? అనే వారే కానీ.. శివాజీ కాంట్రవర్సీపై లయ!

Big TV Kissik Talks: నువ్వేంటి నాకు చెప్పేది? అనే వారే కానీ.. శివాజీ కాంట్రవర్సీపై లయ!
Advertisement

Big TV Kissik Talks: ‘మిస్సమ్మ’, ‘అదిరందయ్యా చంద్రం’, ‘టాటా బిర్లా మధ్యలో లైలా’ వంటి క్లాసిక్ ఎంటర్‌టైనర్స్ తర్వాత శివాజీ (Sivaji), లయ (Laya) జంటగా నటించిన సినిమా ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ (Sampradayini Suppini Suddapoosani). కొంత గ్యాప్ తర్వాత మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చిన లయ, రీ ఎంట్రీలో మంచి మంచి పాత్రలను చేస్తూ, తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరవుతున్నారు. తాజాగా ఆమె బిగ్ టీవీ కిస్సిక్ టాక్స్ (Big TV Kissik Talks) కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డ్రస్సింగ్ గురించి, ఇటీవల జరిగిన శివాజీ కాంట్రవర్సీ గురించి ఆమె తనదైన తరహాలో స్పందించారు. ఆమె మాట్లాడుతూ..

Also Read- Swayambhu: స్వయంభూపై OTT షాకింగ్ డిమాండ్.. నిఖిల్ సినిమాకు మరో బాధ!

నువ్వేంటి నాకు చెప్పేది? అనే వారే!

Advertisement

‘‘డ్రస్సింగ్ ఎవరికైనా చాలా ఇంపార్టెంట్. చిన్నప్పుడు అంతగా ఇంపార్టెన్స్ ఇచ్చేదాన్ని కాదు కానీ, ఇప్పుడు చాలా బెటర్. డ్రస్సింగ్ చాలా ఇంపార్టెంట్.. ఎందుకంటే, దానిని బట్టే పీపుల్ జడ్జి చేస్తుంటారు. అకేషన్‌కి తగినట్లుగా, ఇన్సిడెంట్‌కి తగినట్లుగా రెడీ అయితే చాలు. నా గురించి చెబుతున్నప్పుడు.. నేను ఎంత నేచురల్‌గా ఉంటే.. వారు అంతగా కనెక్ట్ అవుతారని నేను నమ్ముతాను. డ్రస్సింగ్ విషయంలో నేను ఎవరికీ అడ్వైజ్ చేయను. నా నేచరే ఇది. ఎందుకంటే, మనం అడ్వైజ్ చేస్తే తీసుకుంటే, దానికో విలువ ఉంటుంది. మనం ఎంత చెప్పినా, వాళ్ల ఓపీనియన్ వాళ్లకి ఉంటుంది. వాళ్లకి ఏం చేయాలో వాళ్లకి తెలుసు. నువ్వేంటి నాకు చెప్పేది? నాకు అన్నీ తెలుసు.. అనే ఫీలింగ్‌లో కొంతమంది ఉంటారు. మనం చెప్పామని ఒక రెస్పెక్ట్‌ఫుల్‌గా అర్థం చేసుకుని, ఆలోచించే మైండ్‌సెట్ చాలా తక్కువ మందికి ఉంది. ఇప్పటి జనరేషన్‌లో పిల్లలకే ఏం చెప్పలేకపోతున్నాం.. గట్టిగా చెప్పకూడదు కూడా. కాబట్టి, ఎవరి ఇష్టం వాళ్లది.

Also Read- Traffic Advisory: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్.. ప్రయాణికులకు అలెర్ట్!

ఇప్పటి వాళ్లకి పేషెన్స్ లేదు

Advertisement

శివాజీ ఇటీవల డ్రస్సింగ్ గురించి మాట్లాడారు. ఆయనతో కలిసి పని చేసినా, ఆ విషయంపై నాతో ఎప్పుడూ మాట్లాడలేదు. వాస్తవానికి, నేను వర్క్ తర్వాత ఎవరితో పెద్దగా మాట్లాడను. ఇంటరాక్ట్ కాను. కానీ, ఎప్పుడు కనిపించినా కూడా హాయ్.. అని పలకరిస్తాను. అంతే తప్ప, పెద్దగా డిస్కషన్స్ అంటూ ఏమీ ఉండవు. ఆ డ్రస్సింగ్ కాంట్రవర్సీలో.. ఆయన ఏం అనుకున్నారో అది చెప్పారు. అది ఎవరికి ఎలా కావాలో అలా తీసుకుంటారు. బేసికల్‌గా ఎవరి సలహాలు తీసుకునే జనరేషన్ కాదిది. మా మదర్, గ్రాండ్ మదర్ మాకు చెప్పినప్పుడు.. మేము విసుక్కున్నా.. వినేవాళ్లం. ఒక్క డ్రస్ అనే కాదు, అన్ని విషయాలు వాళ్లు చెబుతుండేవారు. ఇది మంచిది, ఇది కాదు అని చెప్పేవాళ్లు. వాళ్లు ఎందుకు చెబుతున్నారనేది మాకు అర్థమయ్యేది.. వినేవాళ్లం. ఇప్పటి వాళ్లకి వినడానికి అసలు ఓపికే లేదు..’’ అని చెప్పుకొచ్చారు.

Also Read- Niharika Konidela: ఎప్పుడూ ప్రాధేయపడకూడదు.. ప్రేమపై నిహారిక సంచలన వ్యాఖ్యలు

Related News

చీరకట్టులో శివజ్యోతి..ఆ భారీ హారం చూస్తే మతిపోవాల్సిందే!

ఈశ్వర్ సాయి కేసులో కొత్త ప్రశ్న.. ‘పెళ్లైనోడిని ఎలా నమ్మావ్ మాధురి?’

స్టార్ హీరోల సినిమాల కంటే సీరియల్స్‌కే ఎక్కువ క్రేజ్.. అసలు సీక్రెట్ ఏంటి?

పిచ్చి కుక్కల్లా మొరగండి… ట్రోలర్స్ కు కౌంటర్ ఇచ్చిన శిరీష!

నాని ఫోక్ సాంగ్ తో అదరగొట్టేసిన శ్రీముఖి.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode September 2nd  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పార్థును చంపేందుకు రెడీగా ఉన్న రౌడీలు

Godavari Janu : హాట్ లుక్ లో రెచ్చగొడుతున్న నిత్య.. కుర్రాళ్ళు తట్టుకోలేరమ్మ..!

Gundeninda GudiGantalu Today episode: బాలుకు షాకిచ్చిన నీలకంఠం.. కన్నీళ్లు పెట్టుకున్న మౌనిక.. పాపం బాలు..

Big Stories

Advertisement
×