E-Paper
Advertisement

Pawan : మేం అలా చేస్తే కథ వేరేలా ఉంటుంది..!

Pawan : మేం అలా చేస్తే కథ వేరేలా ఉంటుంది..!
Advertisement

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరోసారి ప్రతిపక్ష వైసీపీ నేతలకు హెచ్చరికలు పంపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వైసీపీ వ్యక్తిగత విమర్శలు చేస్తున్నదని, అభివృద్ధి ఫలాలు అర్హులకు అందేందుకు తమ ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తుంటే తప్పుడు ఆరోపణలు, అబద్ధాలు ప్రచారాలు చేస్తూ కూటమి సర్కారుపై ప్రజల్లో విషబీజాలు నాటుతోందని ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా వైసీపీ సోషల్ మీడియాలో పిచ్చిపిచ్చిగా పోస్టులు పెడుతున్న వారికి సైతం వార్నింగ్ ఇచ్చారు. నిన్న అల్లూరి సీతారామరాజు జిల్లాలో పర్యటించిన పవన్.. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడంతో పాటు గిరిజనులతో ముచ్చటించారు.

కూటమికి ఓటు వేయకున్నా..

గత అసెంబ్లీ ఎన్నికల్లో గిరిజన ప్రాంత నియోజకవర్గాల్లో కూటమి ఎమ్మెల్యేలు పరాజయం పాలయ్యారని డిప్యూటీ సీఎం గుర్తుచేశారు. తమకు ప్రజలు ఓటు వేయకపోయినా అభివృద్ధి ఏజెండాగా పనిచేస్తున్నామని, ఎక్కడా వివక్ష చూపడం లేదని క్లారిటీ ఇచ్చారు. గత వైసీపీ ప్రభుత్వం గిరిజన మారుమూల ప్రాంతాలను పట్టించుకోలేదని,నిధులు సైతం కేటాయించలేదన్నారు. సరైన మౌలిక వసతులు లేక గిరిపుత్రులు పడిన బాధను తాను కళ్లారా చూశానని, అందుకే కొండప్రాంతాల్లో యుద్ధప్రాతిపదికన రోడ్లు వేయిస్తున్నామని ప్రకటించారు. ఇకమీదట అనారోగ్య సమస్యల బారిన పడిన వారిని డోలిల ద్వారా తీసుకురావాల్సిన అవసరం లేకుండా రహదారులను కూటమి సర్కార్ ఏర్పాటు చేస్తున్నదని చెప్పారు.

సంక్షేమం, అభివృద్ధే మాధ్యేయం..

Advertisement

కూటమి సర్కార్‌కు తెలిసిందల్లా అభివృద్ధి,సంక్షేమం మాత్రమే అని పవన్ కళ్యాణ్ అన్నారు. ఎందుకంటే గత ప్రభుత్వం తమను ఎన్ని ఇబ్బందులకు గురిచేసిందో ఏపీ ప్రజలకు తెలుసునని.. అవన్నీ మనసులో పెట్టుకుని ప్రతీకారం తీసుకోవాలంటే కథ వేరేలా ఉండేదని ఏపీ డిప్యూటీ సీఎం హెచ్చరించారు. అలాంటి రాజకీయాలతో నష్టం తప్పా ఎటువంటి ప్రయోజనాలు ఉండవని ఆయన స్పష్టంచేశారు. మంచి చేసిన వారికే ఎన్నికల్లో ఓటు వేయాలని, సంక్షేమం మాటున విధ్వంసం చేసేవారికి తగిన బుద్ది చెప్పాలని గిరిజన ప్రాంత ప్రజలకు పవన్ కళ్యాణ్ సూచించారు. కూటమి సర్కార్ ఏమీ చేయడం లేదని, సిక్స్ గ్యారెంటీస్ పేరిట ప్రజలను మోసిందని వైసీసీ నేతలు చేస్తున్న అబద్ధపు ప్రచారాలను తిప్పికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు.

K Kavitha: హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు కవిత స్ట్రాంగ్ వార్నింగ్.. నిజాలు మాట్లాడితే బద్నాం చేస్తారా?

Advertisement

రాష్ట్రంలో అశాంతిని రగిలించే వారిని చట్టబద్దంగా శిక్షిస్తామని పవన్ కళ్యాణ్ స్పష్టంచేశారు. తమ ప్రభుత్వం ఓపికతో ప్రజలకు మంచి చేసుకుంటూ ముందుకు వెళ్తున్నదని, అలాంటి సమయంలో వ్యక్తిగత దూషణలు, తప్పుడు ఆరోపణలు చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేయొద్దని హితవు పలికారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీని భారీ మెజార్టీతో గెలిపించారని డిప్యూటీ సీఎం పవన్ పిలుపునిచ్చారు. సార్వత్రిక ఎన్నికల్లో కూటమి సర్కార్ అవకతవకలకు పాల్పడిందని వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ప్రజలే స్వచ్ఛంధంగా తిప్పికొట్టాలని పవన్ అన్నారు. తాము కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నామని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారని.. వాటి మీద ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, ఒకవేళ తీసుకుంటే పరిస్థితులు వేరేంగా ఉంటాయని డిప్యూటీ సీఎం పవన్ హెచ్చరించారు.

Related News

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

ఓడిపోతామనే భయం.. కుట్రలకు తెరలేపారు, వైసీపీపై సీఎం చంద్రబాబు ఫైర్

ప్రయాణికుల ఇంటికి ఆర్టీసీ సేవలు.. ఏపీఎస్ఆర్టీసీ వినూత్నంగా

వెలిగొండ ప్రాజెక్టు వాగులో కొట్టుకుపోయిన బొలెరో, అందులో నలుగురు వ్యక్తులు, రంగంలోకి రెస్క్యూ టీమ్

Big Stories

Advertisement
×