E-Paper
Advertisement

Actress Laya: శివాజీ, అనసూయ కాంట్రవర్సీపై లయ షాకింగ్ కామెంట్స్

Actress Laya: శివాజీ, అనసూయ కాంట్రవర్సీపై లయ షాకింగ్ కామెంట్స్
Advertisement

Actress Laya: ‘మిస్సమ్మ’, ‘అదిరందయ్యా చంద్రం’, ‘టాటా బిర్లా మధ్యలో లైలా’ వంటి క్లాసిక్ ఎంటర్‌టైనర్స్ తర్వాత శివాజీ (Sivaji), లయ (Laya) జంటగా నటించిన సినిమా ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ (Sampradayini Suppini Suddapoosani). ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా నటి లయ, బిగ్ టీవీ కిస్సిక్ టాక్స్ (Big TV Kissik Talks) కార్యక్రమంలో పాల్గొన్నారు. సినిమా విషయాలతో పాటు ఇటీవల శివాజీ వ్యాఖ్యలపై జరిగిన కాంట్రవర్సీ గురించి ఆమె షాకింగ్‌గా రియాక్ట్ అయ్యారు. ఇంకా లవ్ ఫెయిల్యూర్స్‌తో ఆత్మహత్యలు చేసుకునే వారికి ఆమె చక్కని అడ్వైజ్ ఇచ్చారు. ముందుగా ‘సంప్రదాయిని సుప్పిని సుద్ధపూసని’ సినిమా గురించి చెబుతూ.. ‘‘ఈ సినిమా ప్యూర్ ఎంటర్‌టైనర్. ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ సీన్ వరకు ఆసక్తికరంగా ఉండే సినిమా ఇది. ఇందులో నేను శివాజీని పెట్టే టార్చర్ చూసి జనాలందరూ చాలా హ్యాపీగా ఫీలవుతారు. మంగపతికే మంగపతిలా ఉండే పాత్ర నాది. తప్పకుండా థియేటర్లలో అందరూ చూసి ఎంజాయ్ చేయండి’’ అని కోరారు.

Also Read- Kissik Talks: తెలుగు ప్రేక్షకులను వదిలివెళ్లను, కానీ.. నటి లయ ప్రామిస్!

చెవిటివాడి ముందు శంఖం ఊదినట్టే

Advertisement

ఇక శివాజీ వ్యాఖ్యలపై అనసూయ, చిన్మయి వంటి వారు ఎలా రియాక్ట్ అయ్యారో, ఆ తర్వాత ఎలాంటి వివాదం నడిచిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ కాంట్రవర్సీపై లయ స్పందిస్తూ.. ‘‘మనం మంచి సలహా ఇస్తే తీసుకునేట్లు అయితే.. దానికో విలువ ఉంటుంది. నువ్వేంటి నాకు చెప్పేది? నాకు ఆల్రెడీ తెలుసు.. అనే ఫీలింగ్‌లో కొంతమంది ఉంటారు. అలాంటి వాళ్లకు చెప్పినా వేస్టే. శివాజీ ఈ విషయంలో ఏమనుకున్నారో అదే చెప్పారు. అందులో మంచి ఉన్నా.. రెస్పెక్ట్‌ఫుల్‌గా మనం చెప్పేది విని, అర్థం చేసుకునే మైండ్‌సెట్ చాలా తక్కువ మందిలో ఉంది’’ అని అన్నారు. నిజమే, పాశ్చాత్య పోకడ బాగా పెరిగిపోయి, కల్చర్‌ని మరిచిపోతున్న రోజులివి. అలాంటి వారికి ఎంత చెప్పినా, చెవిటివాడి ముందు శంఖం ఊదినట్టేనని.. లయ చెప్పుకొచ్చారు.

Also Read- Arjun Kalyan: నువ్వుంటే నా జతగా సీరియల్ ఆగిపోవడానికి అదే కారణమా.. అసలు మ్యాటర్ చెప్పిన అర్జున్!

మనం చేసే మోసం.. కచ్చితంగా రిటన్ వస్తుంది

Advertisement

ఇంకా లవ్ ఫెయిల్యూర్స్‌కి ఆత్మహత్యలు చేసుకునే వారిపై లయ మాట్లాడుతూ.. ‘‘లవ్ ఫెయిల్యూర్ అనేది ఇట్స్ నాట్ ఎండ్ ఆఫ్ ద వరల్డ్. ఈ రిలేషన్ షిప్ నాకు పెయిన్ ఇస్తుందంటే.. గుప్పిట్లో పట్టుకుని కూర్చోవద్దు. వెంటనే వదిలేయండి. నేను ఈ సందర్భంగా ఒకటి చెప్పదలుచుకున్నాను.. తెలిసి మోసం చేసే వారికి చెబుతున్నా.. మనం ఏదైతే మోసం చేస్తామో.. అది మనకు కచ్చితంగా రిటన్ వస్తుంది. నా విషయానికి వస్తే.. నాకు పెద్ద ఇష్యూస్ అవ్వాల్సినప్పుడు కూడా ఏదో ఒక పవర్ నన్ను ప్రొటెక్ట్ చేసింది. ఆ పవర్ ఏంటనేది నాకు కూడా తెలియదు’’ అని తెలిపారు.

Also Read- World Richest Actress: ప్రపంచంలోనే రిచెస్ట్ హీరోయిన్ ఎవరో తెలుసా.. షారుక్ ఖాన్‌ను కూడా దాటేసిన నటి..!

Related News

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి కొత్త టెన్షన్.. చింటును బాలు తెస్తాడా..? గుణ ప్లానేంటి..?

Podarillu Today Episode : నారాయణకు అడ్డంగా దొరికిన జమున.. కన్నా సీరియస్.. ఇదేం ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ మాటతో మీనాక్షి షాక్.. పల్లవికి మైండ్ బ్లాక్.. అరెస్ట్ చేస్తారా..?

Illu Illalu Pillalu Today Episodes: రెచ్చిపోయిన భాగ్యం.. రామరాజు మాస్ వార్నింగ్.. వల్లికి ఇంకో ఛాన్స్..

Sunday TV Movies : ఆదివారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. మస్ట్ వాచ్..

Nindu Noorella Saavasam Serial Today Episode October 18th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి కోల్‌ కతా వెళ్లడానికి వైజయంతి ఒప్పుకుంటుందా..?

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

సలార్‌లో ఛాన్స్ కోసం ఝాన్సీ ఏం చేశారో తెలుసా?

Big Stories

Advertisement
×