E-Paper
Advertisement

భర్తతో విడాకులు తీసుకున్న ‘అగ్నిసాక్షి’ హీరోయిన్.. అసలేం జరిగిందంటే..?

భర్తతో విడాకులు తీసుకున్న ‘అగ్నిసాక్షి’ హీరోయిన్.. అసలేం జరిగిందంటే..?
Advertisement

Telugu Serials : తెలుగు ఇండస్ట్రీ లోకి కన్నడ హీరోయిన్ల ఎంట్రీ రోజు రోజుకి ఎక్కువవుతుంది.. ఈమధ్య బుల్లితెరపై ప్రసారమవుతున్న ప్రతి తెలుగు సీరియల్ లోను కన్నడ హీరోయిన్లే ఎక్కువగా కనిపిస్తున్నారు. కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చి తెలుగులో మంచి పాపులారిటీని దక్కించుకున్న సీరియల్ హీరోయిన్లలో ఐశ్వర్య పిస్సే ఒకరు.. తెలుగులో కస్తూరి సీరియల్ ద్వారా బుల్లితెరకు పరిచయమైంది.. ఆ సీరియల్ మంచి హిట్ అవడంతో ఆ తర్వాత వరుసగా సీరియల్స్లలో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. ఈ అమ్మడు నిజజీవితంలో పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. గత కొద్ది రోజులుగా ఈమె విడాకులు తీసుకుంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా మరోసారి ఆ వార్తలు గుప్పుమన్నాయి.. మరి నిజంగానే ఈ బ్యూటీ భర్తతో విడాకులు తీసుకుందా? లేదా? అన్నది వివరంగా తెలుసుకుందాం.

భర్తతో విడాకులు తీసుకున్న ఐశ్వర్య పిస్సే..

కన్నడ సీరియల్స్లలో నటిస్తున్న హీరోయిన్లు తెలుగులోకి కూడా ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే.. ఇప్పటికే ఎంతోమంది హీరోయిన్లు కన్నడ నుంచి తెలుగులోకి వచ్చి ఇక్కడ కూడా స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు. అలాంటి ముద్దుగుమ్మల్లో ఐశ్వర్య పిస్సే ఒకరు. ఈమె తెలుగులో అగ్నిసాక్షి అనే సీరియల్ తో ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. ఆ డైలీ సీరియల్ హిట్ అవ్వడంతో తెలుగులో అవకాశాలు ఆమెకు క్యూ కట్టాయి. తర్వాత కస్తూరి సీరియల్ లో నటించింది. సీరియల్ కూడా పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకోవడంతో ఈమె క్రేజ్ తెలుగులో బాగా పెరిగింది..

Advertisement

అయితే కెరీర్ పీక్స్ లో ఉండగానే ఈమె పెళ్లి చేసుకుంది. ఈమె తెలుగు సీరియల్ హీరోయిన్ నవ్య సామి అన్ననే పెళ్లి చేసుకుంది. పెళ్లయిన కొత్తలో బాగానే ఉన్నారు.. ఇద్దరు కలిసి పలు టీవీ షోలలో కూడా సందడి చేశారు.. అయితే ఇప్పుడు ఈ జంట విడాకులు తీసుకుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.. దీనిపై ఐశ్వర్య ఎక్కడ స్పందించలేదు కానీ.. సోషల్ మీడియాలో మాత్రం వార్త షికారు చేస్తుంది. మరి నిజంగానే ఈమె విడాకులు తీసుకుందా లేదా అన్నది దానిపై క్లారిటీ రావాలి అంటే ఈ అమ్మడు స్పందించేంత వరకు వెయిట్ చేయాల్సిందే..

Also Read :దృశ్యం3లో స్టార్ల రెమ్యూనరేషన్..? బడ్జెట్ ఎన్ని కోట్లో తెలుసా..?

సీరియల్స్ విషయానికొస్తే..

Advertisement

ఈమె చదువుకుంటున్న రోజుల్లోనే మోడల్ గా కెరీర్ ను ప్రారంభించింది. ఆ తర్వాత సీరియల్ అడిషన్స్ రావడంతో ఆమె కన్నడలో రెండు సీరియల్స్ చేసింది. ఓ వైపు నటన కొనసాగిస్తూనే డిగ్రీ పూర్తిచేసింది. రెండు సినిమాల్లో కూడా చిన్న పాత్ర‌లు చేసింది.. సీరియల్స్లలో ఎక్కువగా అవకాశాలు రావడంతో సినిమాలను పక్కన పెట్టేసింది. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన ఈ ముద్దుగుమ్మ వరసగా సీరియల్స్ చేస్తూ బిజీగా మారింది.. ఇక సోషల్ మీడియాలో ఈమె ఎంత యాక్టివ్ గా ఉంటుందో చెప్పనక్కర్లేదు.. తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తుంది. ప్రస్తుతం ఈమె కన్నడ తో పాటుగా తెలుగులో కూడా రెండు సీరియల్స్ చేయబోతుందని తెలుస్తుంది..

Related News

Telugu Tv Serials : బిగ్ బాస్ ఎఫెక్ట్.. ఆ సీరియల్స్ కు శుభం కార్డు పడినట్లే..?

ఒక్కరోజులో మారిపోయిన లెక్కలు..ఆరో వారం ఊహించని ఎలిమినేషన్ ట్విస్ట్..!

Karthika Deepam2 : సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. ఆ క్యారెక్టర్ అవుట్..

Intinti Ramayanam Today Episode: అవనిని కొట్టించిన పల్లవి.. రెచ్చిపోయిన అక్షయ్.. పల్లవికి దిమ్మతిరిగే షాక్..

Illu Illalu Pillalu Today Episodes: వల్లికి విశ్వం వార్నింగ్.. వేధవతికి సీరియస్.. భాగ్యం ప్లాన్ సక్సెస్..

Podarillu Today Episode : జమున దొరుకుతుందా..? శైలు మాటతో షాక్.. నారాయణ దెబ్బకు మైండ్ బ్లాక్..

Karthika Deepam 2 Serial Today Episode October 17th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని ఎదురుగానే జ్యోత్స్న చేయి పట్టుకున్న సూరజ్            

Gundeninda GudiGantalu Today episode: బాలును ఇరికించే ప్లాన్.. దొంగగా రోహిణి.. ఇది కదా అసలు ట్విస్ట్..

Big Stories

Advertisement
×