E-Paper
Advertisement

ఎవరికీ తెలియని 5 బెస్ట్ కూలర్ బ్రాండ్లు.. ధర తక్కువ, కూలింగ్ ఎక్కువ!

ఎవరికీ తెలియని 5 బెస్ట్ కూలర్ బ్రాండ్లు.. ధర తక్కువ, కూలింగ్ ఎక్కువ!
Advertisement

Budget Coolers: భానుడి భగభగలకు ఇళ్లన్నీ సెగలు గక్కుతున్నాయి. ఈ వేడి నుంచి ఉపశమనం కోసం చాలామంది ఏసీలు, ఎయిర్ కూలర్ల వైపు చూస్తున్నారు. అయితే ఎయిర్ కూలర్ అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేవి సింఫనీ, బజాజ్, ఓల్టాస్ వంటి కొన్ని పాపులర్ బ్రాండ్లు మాత్రమే. కానీ బ్రాండ్ పేరు పెద్దగా వినిపించకపోయినా.. తక్కువ ధరలో అద్భుతమైన కూలింగ్ ఇచ్చే కొన్ని బ్రాండ్లు ఇప్పుడు మార్కెట్లో ట్రెండ్ అవుతున్నాయి. బడ్జెట్‌లో బెస్ట్ కూలింగ్ ఇచ్చే అలాంటి 5 అపరిచిత ఎయిర్ కూలర్ బ్రాండ్ల గురించి ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.

నోవామ్యాక్స్ – కూలింగ్‌లో ‘కింగ్’

ప్రస్తుతం కూలర్ల మార్కెట్లో అత్యంత వేగంగా గుర్తింపు తెచ్చుకుంటున్న బ్రాండ్ ‘నోవామ్యాక్స్’. పెద్ద బ్రాండ్లకు ఏమాత్రం తీసిపోని విధంగా దీని ఎయిర్ త్రో సామర్థ్యం ఉంటుంది. ముఖ్యంగా ఇందులోని హెవీ డ్యూటీ మోటార్లు, పెద్ద ఫ్యాన్లు గాలిని చాలా దూరం వరకు ప్రసారం చేయగలదు. దీని డిజైన్ ట్రెండీగా ఉండటమే కాకుండా.. విద్యుత్ వినియోగాని పరిమితం చేస్తాయి. ఎక్కువ విస్తీర్ణం ఉన్న హాల్స్ లేదా పెద్ద గదులకు ఈ బ్రాండ్ కూలర్లు బెస్ట్ అని చెప్పవచ్చు.

మూన్ ఎయిర్ – బడ్జెట్‌లో ది బెస్ట్

Advertisement

తక్కువ ధరలో ఎక్కువ వాటర్ ట్యాంక్ కెపాసిటీ, ఐస్ చాంబర్ ఫీచర్లు కావాలనుకుంటే ‘మూన్ ఎయిర్’ బెస్ట్ ఆప్షన్. ఈ బ్రాండ్ 40 లీటర్ల నుంచి ఏకంగా 140, 180 లీటర్ల భారీ కమర్షియల్ సైజ్ కూలర్లను కూడా అందిస్తోంది. 3 వే హనీకాంబ్ ప్యాడ్స్, ఇన్వర్టర్ కంపాటబిలిటీ వంటి ఫీచర్లు ఈ బ్రాండ్ కూలర్లలో ఉన్నాయి. తక్కువ బడ్జెట్‌లో ఏసీ లాంటి చల్లదనాన్ని ఇవ్వడంలో మూన్ ఎయిర్ కూలర్లు ముందు వరుసలో ఉంటాయని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి.

హవాయి – పోర్టబుల్ కూలింగ్ స్పెషలిస్ట్

చిన్న గదులు, స్టడీ రూమ్స్ లేదా ఆఫీస్ క్యాబిన్ల కోసం కూలర్ వెతుకుతుంటే ‘హవాయి’ బ్రాండ్ పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది. దీని స్లీక్ అండ్ కాంపాక్ట్ డిజైన్ చూడముచ్చటగా ఉంటుంది. ఇందులోని ఐస్ చాంబర్ టెక్నాలజీ వల్ల నీరు త్వరగా చల్లబడి గదిని నిమిషాల్లో కూల్ చేస్తుంది. ఇవి చాలా చిన్న సైజులో ఉండటం వల్ల తక్కువ స్థలాన్నే ఆక్రమిస్తాయి. ఈ కూలర్లు బ్యాచిలర్స్ కు, చిన్న కుటుంబాలకు సరిగ్గా సరిపోతాయి.

సమ్మర్‌కూల్ – రఫ్ అండ్ టఫ్ యూసేజ్

Advertisement

ఎక్కువ కాలం మన్నిక వచ్చేలా గట్టి ప్లాస్టిక్ లేదా మెటల్ బాడీతో కూలర్లు కావాలనుకునే వారికి ‘సమ్మర్‌కూల్’ బెస్ట్ ఛాయిస్. ముఖ్యంగా సెమీ అర్బన్, రూరల్ ఏరియాల్లో ఈ బ్రాండ్ కూలర్లకు డిమాండ్ పెరుగుతోంది. వీటిలో ఉండే 16 అంగుళాల శక్తివంతమైన ఫ్యాన్ మోటార్.. వేడి గాలిని క్షణాల్లో బయటకు నెట్టేసి చల్లటి గాలిని ఇస్తుంది. దీని మెయింటెనెన్స్ ఖర్చు కూడా చాలా తక్కువ.

Also Read: విదేశాలకు వెళ్తున్నారా? ‘విఐ’ నుంచి అదిరిపోయే రోమింగ్ ప్లాన్స్.. రూ. 649 నుంచే ప్రారంభం!

ఐబెల్ – స్మార్ట్ ఫీచర్లకు కేరాఫ్

టెక్నాలజీ పరంగా అప్‌డేటెడ్‌గా ఉంటూ.. బడ్జెట్ పరిధిలో లభించే బ్రాండ్ ‘ఐబెల్’. తక్కువ విద్యుత్ వినియోగంతో నడిచే ఈ కూలర్లు.. ఇన్వర్టర్లపై కూడా అద్భుతంగా పనిచేస్తాయి. వీటి ఎయిర్ డిఫ్లెక్షన్ బాగుండటం వల్ల గదిలో ఉక్కపోత అనేదే ఉండదు. ఆన్‌లైన్ మార్కెట్లో ఈ బ్రాండ్‌కు కస్టమర్ల నుంచి మంచి రేటింగ్స్ లభిస్తున్నాయి. మెుత్తంగా బ్రాండ్ ఇమేజ్ చూసి వేల రూపాయలు అదనంగా ఖర్చు పెట్టే కంటే ఇలాంటి ప్రాక్టికల్ బ్రాండ్లను ఎంచుకోవడం వల్ల డబ్బు ఆదా అవ్వడమే కాకుండా పర్ఫెక్ట్ కూలింగ్ కూడా పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

Also Read: జియో రూ.199 ప్లాన్.. బడ్జెట్ ధరలో అపరిమిత బెనిఫిట్స్.. కానీ ఓ మెలిక ఉంది!

Related News

స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు భూకంప హెచ్చరికల సాధనంగా.. గూగుల్ బిగ్ అప్‌డేట్!

యూట్యూబ్ ఛానెల్ పెడుతున్నారా? ఈ కంటెంట్‌తో వీడియోలు చేస్తే మీరే కింగ్.. కనక వర్షం కురవాల్సిందే!

యాపిల్ ప్రియులకు ఊహించని షాక్.. ఆన్‌లైన్ స్టోర్ బంద్, కారణం ఏమిటంటే?

యూట్యూబ్‌లో ఏఐ పాటలకు ప్రత్యేక లేబుల్స్.. అసలు ఇవి ఎలా పనిచేస్తాయంటే?

మెమరీ చిప్‌ల కొరత.. 14 ఏళ్ల కనిష్టానికి పడిపోయిన గ్లోబల్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్!

iPhone 16 తక్కువ ధరకే వస్తోందని కొంటున్నారా? ఈ విషయం తెలిస్తే ప్లాన్ మార్చుకుంటారు!

యాపిల్ వాచ్ సిరీస్ 11పై ఊహించని డిస్కౌంట్.. అమెజాన్ పండుగ సేల్‌లో టాప్-5 డీల్స్ ఇవే!

శీతాకాలం అలర్ట్.. ఏసీ అవుట్ డోర్ యూనిట్‌కు కవర్.. కేవలం రూ.200తో రూ.20 వేల నష్టానికి చెక్!

Big Stories

Advertisement
×