Anasuya: నిత్యం కాంట్రవర్సీ మాటలతో తనదైన శైలిలో కౌంటర్ ఇస్తూ.. వరుస వీడియోలతో సోషల్ మీడియాలో బిజీగా మారిన అనసూయ (Anasuya) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. సమాజంలో జరిగే అంశాలపై స్పందిస్తూ.. తన అభిప్రాయాలను కామెంట్ రూపంలో చెప్పుకొస్తూ ఉంటుంది. అయితే ఆమె మాటలను, సిద్ధాంతాలను నమ్మిన కొంత మంది ఆమెకు సపోర్టుగా నిలిస్తే.. ఆమె మాటలను వక్రీకరించే వారు కూడా లేకపోలేదు. ముఖ్యంగా చాలామంది పని గట్టుకొని మరీ తనపై ట్రోల్స్ చేస్తున్నారని, నెగెటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారంటూ అనసూయ ఎన్నో సందర్భాలలో కామెంట్లు చేసిన విషయం తెలిసిందే.
సనాతన ధర్మం, హిందూ దేవుళ్ళు, ఆడవారి ఆచారాలు అంటూ రోజుకు ఒక వీడియోతో సంచలనం సృష్టించిన ఈమె.. ఇప్పుడు మరో వీడియోతో ఆడియన్స్ ముందుకు వచ్చేసింది.. తన వర్కౌట్ కి సంబంధించిన వీడియోతో పాటు మహిళలను మోటివేట్ చేస్తూ షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ముఖ్యంగా” దిష్టి పెట్టకండి.. లావైపోతాను” అంటూ అనసూయ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అనసూయ మాట్లాడుతూ.. “గత కొద్ది రోజులుగా నా వర్కౌట్ కి సంబంధించి కొన్ని కామెంట్స్ వస్తున్నాయి. అందులో కొన్నింటిని నేను ఛాలెంజింగ్ గా తీసుకుంటాను. ఒక ఇద్దరు ముగ్గురు ఏజ్ అయిపోయింది.. ఎంత చేసినా కానీ పొట్ట మాత్రం తగ్గదు.. అంటూ కామెంట్ చేశారు. ఇక దానిని ఇప్పుడు నేను చాలెంజ్గా తీసుకున్నాను.
వారి కోసమే నా ప్రయత్నం..
ఇంకొకరు నీకోసం వర్కౌట్స్ చేసుకో.. వేరే వాళ్ళ కోసం కాదు అని అన్నప్పుడు.. అక్కడే కదా మీరు నన్ను అర్థం చేసుకోవడం.. ఆపేసాను.. ఎందుకంటే మీ బ్రెయిన్ అక్కడి వరకే ఉంది కాబట్టి. నీకోసం మాత్రమే నువ్వు చూసుకో అని అంటుంటే.. నేను నాకోసం చూసుకోవాలనుకుంటే చక్కగా సినిమాలు, షోలు చేసుకుంటూ గవర్నమెంట్ ఉద్యోగస్తురాలి లాగా సెటిల్ అయిపోయేదాన్ని. కానీ ఇప్పుడు నేను నా వాయిస్ రైజ్ చేస్తున్నాను అంటే.. నాకోసం కాదు అందరి కోసం. నేను వర్కౌట్స్ నా కోసం చేస్తాను. నాలాంటి బ్యూటిఫుల్ మహిళల కోసం కూడా చేస్తాను.
also read:బిగ్‌బాస్ ఓటింగ్.. ఎలిమినేషన్ కి దగ్గరగా ఆ ఇద్దరే!
భర్త, పిల్లలు, అత్తా మామ, తల్లిదండ్రులు అంటూ కొంతమంది ఆ ఊబిలో ఇరుక్కుపోయి ఉంటారు. రిలేషన్స్ మంచివే కానీ అదే ఊబిలో ఇరుక్కుపోయి మీ జీవితాన్ని నాశనం చేసుకోకండి. మీరు బాగుంటేనే మిగతావన్నీ చేస్తారు. నిజానికి నా చుట్టూ ఉండే కొంతమంది పర్సనాలిటీస్ కూడా నాకు అర్థం అవుతున్నాయి. ఎవరైతే నేను నా వాళ్ళు అనుకున్నానో .. వాళ్ళు నా వాళ్ళు కాకుండా పోయారు. నా వాళ్ళు కాదు అనుకున్న వాళ్లు నా వాళ్ళు అయ్యారు. నేను కోయిన్సిడెన్స్ ని నమ్మను. ఏదైనా కూడా మన జీవితంలో ఒక ఉద్దేశంతోనే మంచి జరుగుతూ ఉంటుంది.
ఎవరో ఏదో అన్నారని జీవితంలో దాన్నే పట్టుకొని వేలాడకుండా.. ఛాలెంజింగ్ గా తీసుకొని ముందుకు వెళ్లాలి. నేను ఇలాంటి టైపు… అందరికీ చెబుతున్నాను ఎవరైతే నన్ను తక్కువ చేస్తున్నారో వారందరికీ నేను ఏంటో చూపిస్తాను. ఇక నేను దాదాపుగా బరువు తగ్గిపోతున్నాను. దిష్టి పెట్టకండి.. మళ్లీ ఎక్కువ తినేసి లావైపోతాను. అయినా సరే నేను మళ్ళీ వర్క్ అవుట్ చేసి సన్నబడతాను.” అంటూ అనసూయ ఒక వీడియో షేర్ చేసింది . మొత్తానికైతే మోటివేషన్ వీడియో అంటూ విడుదల చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడమే కాకుండా.. తనను టార్గెట్గా చేసుకొని కామెంట్లు చేస్తున్న వారికి గట్టి కౌంటర్ అని చెప్పాలి.