Bigg Boss 10 voting: బుల్లితెరపై ఎన్నో ఛానల్స్ ప్రేక్షకులకు మంచి ఎంటర్టైన్మెంట్ అందిస్తుంటే.. అందుకు మించిన ఎంటర్టైన్మెంట్ అగ్నిపరీక్ష , బిగ్ బాస్ షోల ద్వారా ఆడియన్స్ కి లభిస్తోందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.. మొన్నటివరకు అగ్నిపరీక్ష షోతో ప్రేక్షకుడికి అసలైన వినోదం లభించగా.. ఇప్పుడు అంతకుమించి ఈ బిగ్ బాస్ షో ద్వారా లభిస్తోంది. ముఖ్యంగా బిగ్ బాస్ సీజన్ 10 ఎట్టకేలకు ప్రారంభమైంది. 10 మంది సెలబ్రిటీలు, 6 మంది కామనర్స్ తో చాలా గ్రాండ్ గా ప్రారంభమైన ఈ సీజన్లో ఊహించని పరిణామాలు ఆడియన్స్ కి మరింత ఆసక్తిని కలిగిస్తున్నాయి.
బిగ్ బాస్ సీజన్ 10 ప్రారంభమై.. రెండు రోజులు కూడా కాలేదు. అప్పుడే ఊహించని గొడవలు, గ్రూపులు, లవ్ ట్రాక్లు అన్నీ వైరల్ గా మారుతున్నాయి. ఇకపోతే హౌస్ లోకి అడుగుపెట్టిన మొత్తం 16 మంది కంటెస్టెంట్లకు నామినేషన్లతో అసలైన ట్విస్ట్ ఇచ్చాడు బిగ్ బాస్. మొత్తం 16 మందిని నామినేషన్స్ లో పడేశాడు. ఎప్పటిలాగే అగ్నిపరీక్ష ద్వారా తమ ఓటింగ్ స్థానాలను పదిలంగా ఉండేలా చూసుకుంటున్నారు కామనర్స్. ఇక తమకు నచ్చిన కంటెస్టెంట్స్ అదృష్టాన్ని మార్చే బాధ్యత ఇప్పుడు పూర్తిగా ప్రేక్షకుల చేతిలోకి వచ్చేసింది. మొదటిరోజు ఓటింగ్ పద్ధతిని చూస్తే ప్రేక్షకులలో ఎవరికి ఎంత క్రేజ్ ఉందో స్పష్టంగా అర్థమవుతుంది . ముఖ్యంగా ఎవరు ఊహించని కంటెస్టెంట్ టాప్ లోకి వెళ్ళిపోవడం అందరూ అనుకున్న వ్యక్తులు అనూహ్యంగా ఎలిమినేషన్ కి దగ్గరగా రావడం చూస్తుంటే ఓటింగ్లో ఈ ట్విస్ట్ ఏంటి అంటూ ఆడియన్స్ సైతం ఆశ్చర్యపోతున్నారు. మరి ఎలిమినేషన్ కి దగ్గరగా ఉన్న కంటెస్టెంట్స్ ఎవరు ? ఎవరు ఏ స్థానాల్లో ఉన్నారు? అనే విషయం ఎప్పుడు చూద్దాం.
ఇకపోతే ఇప్పటివరకు నమోదైన ఓటింగ్ ను బట్టి చూస్తే తొలివారం నామినేషన్స్ లో పర్ఫామెన్స్ కంటే బయట ఉన్న ఫాలోయింగ్ మాత్రమే ఓట్లు రాబడతాయి. ప్రస్తుతం ఓటింగ్ లెక్కల ప్రకారం బట్టి చూస్తే.. ఓటింగ్లో లాస్ట్ లో ఉన్న యాంకర్ సుధీర్ రెడ్డి (Sudheer Reddy), కామనర్ సృష్టి (Srishti Vyakaranam)లు ఎలిమినేషన్ కి దగ్గరగా డేంజర్ జోన్ లో ఉన్నారు. అయితే వారంలో రాబోయే టాస్కులు, గొడవలు, కంటెస్టెంట్ల బిహేవియర్ ఆధారంగా ఈ లెక్కలు తారుమారయ్యే అవకాశం కనిపిస్తోంది.
also read:బిగ్ బాస్ కి టాలెంట్ అక్కర్లేదా.. రిజెక్ట్ చేయడంతో నిజాలు బయటపెట్టిన రాజకుమారి!
ఇప్పటికే అగ్నిపరీక్ష షోలో తనదైన పెర్ఫామెన్స్ తో మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకున్న రోహిత్ నాయుడు ప్రస్తుతం 20% ఓటింగ్ తో అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. ఇతడికి పోటీగా గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ ముఖేష్ గౌడ ఏకంగా 18 శాతం ఓటింగ్ తో రోహిత్ నాయుడుకి గట్టి పోటీ ఇస్తున్నారు. రాంప్రసాద్ 10% ఓటింగ్ తో మూడవ స్థానంలో నిలవగా.. ఎనిమిది శాతం ఓటింగ్ తో కామనర్ అమన్ మసూద్, ఏడు శాతం ఓటింగ్ తో త్రిగుణ్, కృష్ణుడు, ఏడవ స్థానంలో ఆరు శాతం ఓటింగ్ తో సింగర్ ఝాన్సీ , దేబ్జానీ నిలవగా.. మిగతా స్థానాలలో ఐదు శాతం ఓటింగ్ తో జబర్దస్త్ నరేష్ , యాంకర్ వర్షిణి , నాలుగు శాతం ఓటింగ్ తో టెంపర్ వంశీ, మూడు శాతం ఓటింగ్ తో చరణ్, శాలిని, చైత్ర రాయ్ ఒక్కొక్కరు రెండు శాతం ఓటింగ్ సంపాదించుకున్నారు. ఇక సృష్టి , సుధీర్ అత్యంత తక్కువగా 1% ఓటింగ్ తో అట్టడుగు స్థానంలో నిలిచి ఎలిమినేషన్ కి దగ్గరగా నిలిచారు.