E-Paper
Advertisement

OTT Movie: చిన్నప్పుడు చేసిన తప్పుకి శిక్ష.. సన్ నెక్ట్స్‌లో దుమ్మురేపుతోన్న చిన్న చిత్రం!

OTT Movie: చిన్నప్పుడు చేసిన తప్పుకి శిక్ష.. సన్ నెక్ట్స్‌లో దుమ్మురేపుతోన్న చిన్న చిత్రం!
Advertisement

OTT Movie: పెద్ద సినిమాల హడావుడి పక్కన పెడితే, కొన్ని చిన్న చిత్రాలు సైలెంట్‌గా వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేస్తుంటాయి. కంటెంట్ బలంగా ఉంటే ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారని మరోసారి నిరూపిస్తోందిప్పుడో చిన్న చిత్రం. మాస్టర్ మహేంద్రన్ (Master Mahendran) హీరోగా నటించిన ‘నీలకంఠ’ (Nilakanta Movie) చిత్రం.. ప్రస్తుతం సన్ నెక్స్ట్ (Sun NXT) ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతూ మిలియన్ల వ్యూస్‌తో ట్రెండింగ్‌లో ఉంది.

Also Read- Kissik Talks: నా దగ్గర 85 కేజీల బంగారం ఉంది.. అప్పుడు నా భార్య కాళ్లు పట్టుకుంటా! – యాంకర్ రవి

చిన్నతనంలో తెలియక చేసిన ఒక పొరపాటే..

Advertisement

‘నీలకంఠ’ కేవలం ఒక మామూలు గ్రామీణ కథ కాదు. ఇందులో ఎమోషన్స్, ఊరి కట్టుబాట్లు, గతాన్ని వెంటాడే నిజాలు ఉన్నాయి. చిన్నతనంలో తెలియక చేసిన ఒక పొరపాటు హీరో జీవితాన్ని ఎలా ప్రభావితం చేసింది? దానికి అతను అనుభవించిన శిక్ష ఏంటి? అనే పాయింట్ సినిమాకు ఆత్మలా నిలిచింది. తన ప్రేమను గెలిపించుకోవడానికి ఒక సామాన్య యువకుడు వ్యవస్థతో ఎలా పోరాడాడు అనేది హృద్యంగా చూపించారు. చివర్లో సర్పంచ్ పదవి కోసం జరిగే పోటీ, ఆ క్రమంలో వచ్చే ట్విస్టులు సినిమాను నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్లాయి. మాస్టర్ మహేంద్రన్ తన నటనతో మరోసారి ఆకట్టుకున్నాడు. మాస్ లుక్‌లోనూ, ఎమోషనల్ సీన్స్‌లోనూ అనుభవం ఉన్న నటనను కనబరిచాడు. హీరోయిన్లు నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ తమ పాత్రల పరిధి మేరకు మెప్పించారు. ఇక ఈ సినిమాలో రాంకీ పోషించిన పాత్ర సినిమాకే హైలెట్ అని చెప్పాలి. ఆయన పవర్ ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాకు వెయిట్ పెంచింది.

Also Read- Pawan Kalyan: ఆ కుటుంబానికి ప్రతి నెల రూ.12,000 పంపిస్తున్న పవన్ కళ్యాణ్.. నిర్మాత బయటపెట్టిన షాకింగ్ విషయం..!

కొన్ని గంటల్లోనే భారీ వ్యూస్

Advertisement

పల్లెటూరి వాతావరణాన్ని, అక్కడి ఎమోషన్స్‌ను చాలా సహజంగా తెరకెక్కించారు. మరీ ముఖ్యంగా మార్క్ ప్రశాంత్ అందించిన సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమా మూడ్‌ను ఎలివేట్ చేయడంలో కీలక పాత్ర పోషించాయి. ఎం మమత, ఎం రాజరాజేశ్వరి సమర్పణలో నిర్మాతలు మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి ఎక్కడా రాజీ పడకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. థియేటర్లలో మంచి ప్రశంసలు అందుకున్న ఈ చిత్రం, ఇప్పుడు ఓటీటీ ఆడియెన్స్‌ను సైతం కట్టిపడేస్తోంది. స్ట్రీమింగ్ ప్రారంభమైన కొన్ని గంటల్లోనే భారీ వ్యూస్ సాధించి సన్ నెక్స్ట్ టాప్ లిస్టులో చేరిపోయింది. వీకెండ్‌లో ఒక మంచి పల్లెటూరి బ్యాక్‌డ్రాప్ రివెంజ్ డ్రామా చూడాలనుకునే వారికి ‘నీలకంఠ’ బెస్ట్ ఛాయిస్ అని చెప్పొచ్చు.

Also Read- Emmanuel: బిగ్ బాస్ డబ్బులతో వారికి సర్ ప్రైజ్ ఇచ్చిన ఇమ్మానుయేల్.. ఏం చేశాడంటే?

Related News

ఆ ఒక్క రహస్యం బయటపడితే జీవితం నాశనమే… 7.7 రేటింగ్ ఉన్న గ్రిప్పింగ్ సైకలాజికల్ థ్రిల్లర్

హాట్ సీన్స్, లవ్ అండ్ ట్విస్టుల రచ్చ… యూత్‌కి పూనకాలు తెప్పించే బోల్డ్ డ్రామా సిరీస్

చావు అంచుల దాకా తీసుకెళ్లే ప్రమాదకర మిషన్… 1000 కోట్ల భారీ బడ్జెట్ సై-ఫై యాక్షన్ అడ్వెంచర్

కొండల మధ్య అనుమానాస్పద హత్యలు… సీట్ ఎడ్జ్ మిస్టరీ థ్రిల్లర్

19వ శతాబ్దపు ఘాటు ప్రేమ… దారుణమైన పగ… సస్పెన్స్ అండ్ ఎమోషన్‌తో నిండిన పీరియడ్ డ్రామా

9/11 దాడి వెనుక ఉన్న షాకింగ్ నిజాలు బయట పెట్టిన మైండ్ బ్లోయింగ్ సిరీస్

3500 కోట్ల కలెక్షన్లు సాధించిన విజువల్ వండర్… జియోహాట్‌స్టార్‌లో ల్యాండ్ అయిన బిగ్గెస్ట్ సై-ఫై విజువల్ వండర్

ప్రాణాలు దక్కాలంటే పరుగెత్తాల్సిందే… ట్విస్టులతో ఊపిరాడకుండా చేస్తున్న ఇంగ్లీష్ సైకలాజికల్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×