E-Paper
Advertisement

కొత్త కారు కొన్న యాంకర్ శివజ్యోతి.. ధర ఎంతంటే?

కొత్త కారు కొన్న యాంకర్ శివజ్యోతి.. ధర ఎంతంటే?
Advertisement

Anchor Shiva Jyothi: శివ జ్యోతి (Shiva jyothi).. అలియాస్ తీన్మార్ సావిత్రిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న ఈమె తీన్మార్ వార్తల ద్వారా మరింత పాపులారిటీ అందుకుంది. ఆ తర్వాత బిగ్ బాస్ లోకి వెళ్లిన ఈమె అక్కడ కూడా తెలంగాణ యాసలో బుల్లితెర ఆడియన్స్ కు దగ్గర అయింది. తీన్మార్ వార్తల ద్వారా వచ్చిన గుర్తింపుతోనే కొన్ని సినిమాలలో కూడా నటించిన ఈమె.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది. అలాంటి ఈమె తాజాగా దసరా పండుగ సందర్భంగా తన భర్తతో కలిసి ఫోక్స్ వ్యాగన్ మినీ కూపర్ కారును కొనుగోలు చేసింది. ఈ సందర్భంగా తీసుకున్న వీడియోని అభిమానులతో పంచుకుంటూ స్పెషల్ పోస్ట్ పెట్టింది.

అప్పుచేసి కొత్త కారు కొన్నాను – శివ జ్యోతి

ఫోక్స్ వ్యాగన్ మినీ కూపర్ కారును సొంతం చేసుకున్న ఈమె తన భర్త, కూతురితో కలిసి దిగిన ఫోటోలను, వీడియోలను తన అధికారిక ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తూ.. “వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో.. మీ దయతో కొత్త ప్రయాణం.. నాలుగు సంవత్సరాలయ్యింది అని బీ.ఎమ్.డబ్ల్యూ కార్ ఇచ్చేసి ఇది తీసుకున్నాం బ్రో.. అప్పు చేసి కొన్నాం బ్రో. అస్సలు ఏడవకండి” అంటూ ఈవిల్ ఐ ఎమోజీలను షేర్ చేసింది. ఇకపోతే ఫోక్స్ వ్యాగన్ మినీ కూపర్ కారును కొనుగోలు చేసిన సందర్భంగా పలువురు సెలబ్రిటీలైన ప్రియాంక జైన్, రోహిణి , అన్షు తో పాటు పలువురు సెలబ్రిటీలు యాంకర్ శివజ్యోతికి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఫోక్స్ వ్యాగన్ మినీ కూపర్ కారు ధర ఎంతంటే?

Advertisement

ఇకపోతే తాజాగా వీరు కొనుగోలు చేసిన ఈ మినీ కూపర్ ధర మన ఇండియాలో సుమారుగా రూ.44.45 లక్షల నుండి రూ. 58.9 లక్షల వరకు ఉంటుంది. ముఖ్యంగా మోడల్స్ ని బట్టి ధర కూడా మారుతూ ఉంటుంది . మినీ కూపర్ ఎస్ ఎక్స్ షో రూమ్ ధర రూ.45 లక్షల నుండి ప్రారంభమైతే.. మినీ కూపర్ ఎలక్ట్రిక్ కారు రూ.53.50 లక్షల నుండి ప్రారంభం అవుతుంది.

also read: ఘనంగా భూమి పూజతో మొదలైన వరుణ్ తేజ్ ‘ బరి’!

శివ జ్యోతి కెరియర్:

Advertisement

ప్రముఖ నటుడు ప్రియదర్శి, ఫోక్ సింగర్ నాగదుర్గ జంటగా నటిస్తున్న ఇడుపుకాయితం సినిమాలో ఈమె ఒక కీలక పాత్ర పోషిస్తుంది. బన్నీ వాసుతో కలిసి సుకుమార్ నిర్మిస్తున్నారు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 లో కంటెస్టెంట్ గా పాల్గొని ఫినాలే వరకు వెళ్లిన ఈమె.. 2017లో ఉత్తమ జర్నలిజం పురస్కారం కూడా అందుకుంది. జ్యోతక్క పేరుతో యూట్యూబ్ ఛానల్ పెట్టి సక్సెస్ కూడా అయిన శివ జ్యోతి.. ఈమధ్య బుల్లితెర షోలలో కూడా తెగ సందడి చేస్తున్న విషయం తెలిసిందే. ఈమెకు భర్త గంగూలి, ఒక కుమార్తె కూడా ఉన్నారు.

?utm_source=ig_web_copy_link&psln=MzRlODBiNWFlZA==&srtk=MzRlODBiNWFlZA==

Related News

నీతూ వర్సెస్ వర్షిణి.. అసలైన దమ్ము ఎవరికుంది?

Gundeninda GudiGantalu Today episode: శృతి ఉప్మా ప్రయోగం.. రోహిణికి దిమ్మతిరిగే షాక్.. బాలు ఇరుక్కున్నాడే..?

Podarillu Today Episode : కన్నా తల్లి కోసం కన్నీళ్లు.. నారాయణ మాటతో షాక్.. చక్రికీ నిజం చెప్పిన మహా..

Karthika Deepam 2 Serial Today Episode October 20th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మరోసారి జ్యోత్స్నను తీసుకెళ్లి అప్పగించిన సూరజ్‌           

Intinti Ramayanam Today Episode: చక్రధర్ టెన్షన్.. కమల్ ఫుల్ హ్యాపీ.. పల్లవికి చక్రధర్ వార్నింగ్..

Illu Illalu Pillalu Today Episodes: వల్లికి దిమ్మతిరిగే షాక్.. ఇంట్లోంచి గేంటేసిన భాగ్యం.. చందు మాటతో షాక్..

Brahmamudi Serial Today Episode October 20th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రాజు వేసిన ప్లాన్ తనకే బెడిసి కొడుతుందా..? 

Big Stories

Advertisement
×