Ranabaali 2: ఇటీవల కాలంలో ఒక సినిమా మంచి సక్సెస్ అయితే కచ్చితంగా ఆ సినిమాకు సీక్వెల్ లేదా ఫ్రీక్వెల్ సినిమాలను ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో సీక్వెల్ సినిమాలు షూటింగ్ పనులను జరుపుకుంటూ ఉన్నాయి. ఇకపోతే ఇటీవల డైరెక్టర్ రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ రష్మిక మందన్న నటించిన రణబాలి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దసరా పండుగను పురస్కరించుకొని ఈ సినిమా అక్టోబర్ 16వ తేదీ విడుదల కాగా ఈ సినిమాకు అద్భుతమైన ఆదరణ లభించింది. బ్రిటిష్ వారి పాలనకు వ్యతిరేక పోరాటం నేపథ్యంలో పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.
విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) గత కొన్ని సంవత్సరాలుగా వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నప్పటికీ సరైన సక్సెస్ మాత్రం అందుకోలేకపోయారు. తాజాగా రణబాలి (Ranabaali) సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్నారు. ఈ సినిమాలో విజయ్ జోడిగా రష్మిక(Rashmika) నటించిన సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత వీళ్లిద్దరి కాంబినేషన్ వచ్చిన మొదటి సినిమా కావడం విశేషం. ఇక ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందా? అంటూ ఎన్నో సందేహాలు వ్యక్తం అయ్యాయి ఈ నేపథ్యంలోనే డైరెక్టర్ రాహుల్ సాంకృత్యన్ ఒక ఇంటర్వ్యూ సందర్బంగా ఈ సినిమా ప్రీక్వెల్ గురించి బిగ్ అప్డేట్ ఇచ్చారు.
ఈ సందర్భంగా రాహుల్ సాంకృత్యన్ మాట్లాడుతూ..రణబాలి సినిమాకు ప్రీక్వెల్ తెరకెక్కించాలని తనకు ఎంతో ఆసక్తి ఉందని తెలిపారు. రణబాలి తండ్రి, జయమ్మ, గౌడప్పల గత జీవిత కథల ఆధారంగా రణబాలి ప్రీక్వెల్ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనుకుంటున్నట్లు డైరెక్టర్ రాహుల్ తెలిపారు.అంతేకాకుండా, వారి జీవితాలను రణబాలి విధితో, అతని కొడుకు భవిష్యత్తుతో, పోర్టు నుంచి తప్పించుకున్న బ్రిటిష్ వ్యక్తితో ముడిపెడుతూ కథను రూపొందించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా రాహుల్ సాంకృత్యం రణబాలి ప్రీక్వెల్ గురించి ఒక ఇంటర్వ్యూ సందర్భంగా చేసిన ఈ కామెంట్స్ వైరల్ గా మారడంతో ఈ సినిమా ప్రీక్వెల్ పై ఆసక్తి నెలకొంది.
రణబాలి సినిమా ఫ్రీక్వెల్ కథ గురించి సోషల్ మీడియాలో ఈ వార్తలు వైరల్ గా మారడంతో విజయ్ దేవరకొండ రష్మిక మందన్న అభిమానులు మాత్రం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమా అధికారికంగా ప్రకటించిన షూటింగ్ పనులు మరి కాస్త ఆలస్యం అవుతాయని తెలుస్తుంది ప్రస్తుతం విజయ్ దేవరకొండ రష్మిక పలు సినిమాలకు కమిట్ అయ్యి బిజీగా ఉన్నారు. ఈ సినిమా పనులు పూర్తి అయిన తర్వాతనే రణబాలి ఫ్రీక్వెల్ ఉండవచ్చని తెలుస్తోంది.
Also Read: పెళ్లి పీటలు ఎక్కబోతున్న నటుడు తేజ సజ్జా.. అమ్మాయి ఎవరంటే?