Illu Illaalu Pillalu : ప్రముఖ తెలుగు ఛానల్ స్టార్ మా లో ప్రసారమవుతున్న సీరియల్స్ ఏ రేంజ్ లో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉంటాయో అన్నది అందరికీ తెలిసిందే. ఇటీవల కాలంలో ఈ సీరియల్ లో ప్రసారమవుతున్న సీరియల్స్ తో పాటు ప్రతి ప్రోగ్రాం కూడా ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తూ వస్తున్నాయి. స్టార్ మా లో సక్సెస్ఫుల్ రేటింగ్ తో దూసుకుపోతున్న సీరియల్స్లలో ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ కూడా ఒకటి. మొన్నటి వరకు ఈ సీరియల్ కాస్త బోరింగ్ గా అనిపించినప్పటికీ కూడా వల్లి మళ్లీ మళ్లీ ఆ ఇంటికి వెళ్లాలని ప్రయత్నాలు చేయడం మాత్రం జనాలని ఆకట్టుకునేలా ఉంటుంది. ఇటీవల కాలంలో వల్లి చేసిన ఆగడానికి చందు ఇకమీదట ఆ ఇంట్లో ఉండలేడు అన్న వార్త ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. అయితే ఆ ఇంట్లో ఉండడా సీరియల్ కి ఇక గుడ్ బై చెప్తాడా అన్నది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. మరి దీని గురించి కాస్త వివరంగా తెలుసుకుందాం..
ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్లో రామరాజు క్యారెక్టర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటూ వస్తుంది. అందులో రామరాజు పెద్ద కొడుకు చందు క్యారెక్టర్ ప్రేక్షకులను బాగానే అలరిస్తూ వస్తుంది. చందు చాలా అమాయకంగా నాన్న ఏం చెప్తే అదే దైవంగా భావిస్తూ ఉంటాడు. అలాంటి చందు ని వల్లికిచ్చి పెళ్లి చేయడంతో తన జీవితం నాశనం అయిపోతుంది. వల్లి ఫ్యామిలీ చేసిన మోసాల గురించి రామరాజుకు తెలియడంతో నా కొడుకు జీవితాన్ని నేనే నాశనం చేశాను అని చాలా బాధపడిపోతూ ఉంటాడు. ఆ తర్వాత వల్లి రోజు చందు ని కలవడానికి వస్తుందని తెలుస్తుంది. తన నుంచి దూరంగా వెళ్లిపోవాలి అంటే నేను తనకి కనిపించుకున్న వెళ్లాలి అని చందు నిర్ణయించుకుంటాడని సోషల్ మీడియాలో ఓ వార్త వినిపిస్తుంది. అయితే చందు ఇకమీదట ఆ ఇంట్లో ఉండలేక ఎక్కడికో దూరంగా ఉద్యోగం కోసం వెళ్తాడని తెలుస్తుంది మరి ఆ వార్త నిజమేనో కాదు తెలియాలి అంటే ఈ సీరియల్ ను కొద్దిరోజులు మిస్ అవ్వకుండా చూడాలి..
ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఒకప్పుడు టాప్ రేటింగ్ తో దూసుకుపోయేది.. వల్లి ఎప్పుడైతే ప్రేమ ధీరజ్ లను విడగొట్టిందో తన గురించి నిజాలు ఎప్పుడైతే బయటపడ్డాయో అప్పటినుంచి ఈ సీరియల్ కాస్త డౌన్ అవుతూ వచ్చింది.. ప్రస్తుతం ప్రేమ తింగరితనం వల్ల ధీరజ్ని అడ్డంగా ఇరికించేస్తుంది. కారు ట్రావెల్ ఏజెన్సీ ధీరజ్ కి వస్తుంది కానీ భద్ర రెచ్చగొట్టడంతో ఏకంగా 30 లక్షలకు పాట పాడిన అందరికీ షాక్ ఇస్తుంది. అటు శ్రీవల్లి చందుకు దగ్గర ఎందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది. కానీ చందు మాత్రం వల్లి నీ కనీసం చూడను కూడా చూడకుండా ఉంటాడు. ఇక వల్లి చందూతో ఎలాగైనా సరే.. తన జీవితాన్ని మళ్లీ కొనసాగించాలి అని అనుకుంటుంది కాకపోతే చందు తనని దగ్గరికి కూడా రానివ్వడు అని అనుకుంటుంది. ఇక ప్రేమ చేసిన తింగర పని ఇంట్లో తెలియడంతో అందరూ కూడా ప్రేమని అంటూ ఉంటారు ఆ తర్వాత ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో అన్నది చూడాల్సిందే..