E-Paper
Advertisement

‘దేశ ప్రతిష్టను తాకట్టు పెడుతున్నారు’.. రాహుల్‌పై విరుచుకుపడ్డ ప్రధాని మోదీ!

‘దేశ ప్రతిష్టను తాకట్టు పెడుతున్నారు’.. రాహుల్‌పై విరుచుకుపడ్డ ప్రధాని మోదీ!
Advertisement

PM Modi: న్యూఢిల్లీలో ఓ జాతీయ మీడియా సమ్మిట్ ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొని రాహుల్ గాంధీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దేశంలో అశాంతిని సృష్టించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని, ఒక కుటుంబం కోసం దేశ ప్రతిష్టను పణంగా పెడుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ తమ అగ్రనేతను మళ్లీ మళ్లీ లాంచ్ చేయడానికి ప్రయత్నిస్తోందని ఎద్దేవా చేశారు. శ్రీహరికోటలోని స్పేస్ సెంటర్‌లో కూడా ఇన్ని రాకెట్ ప్రయోగాలు జరగవేమోనని, కానీ కాంగ్రెస్ మాత్రం ఏడాదికి ఎన్నిసార్లు తమ నేతను లాంచ్ చేయడానికి విఫల ప్రయత్నాలు చేస్తుందో లెక్కేలేదని చురకలంటించారు. కేవలం ఒక కుటుంబం పరువు నిలబెట్టడం కోసం దేశ అభివృద్ధిని, విజయాలను పణంగా పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రపంచ దేశాలన్నీ భారత్ ప్రగతిని కొనయాడుతుంటే కొందరు మాత్రం దేశంలో అశాంతిని (Disorder) కోరుకుంటున్నారని ప్రధాని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుత గ్లోబల్ పరిస్థితుల నేపథ్యంలో భారత్ ను బలమైన దేశంగా ప్రపంచం ముందుంచాల్సిన అవసరం ఉందని మోదీ అన్నారు. కానీ కొందరు మాత్రం విదేశాలకు వెళ్లి భారత్‌ను అప్రతిష్టపాలు చేస్తున్నారని విమర్శించారు. విదేశీ శక్తులు దేశంలో జోక్యం చేసుకోవాలని కోరడం సరికాదని హితవు పలికారు.

Advertisement

Also Read: టిబెట్‌లో భారీ భూకంపం.. వందలాది ఇళ్లు నేలమట్టం.. 18 మంది మృత్యువాత!

మరోవైపు కాంగ్రెస్ పరాన్నజీవిలా మారిందన్న ప్రధాని.. తాను ఎదగకపోగా, ఇతరులను కూడా ఎదగనివ్వడం లేదని విమర్శించారు. అందని ద్రాక్ష పుల్లన అన్న చందంగా అధికారం కోల్పోయిన తర్వాత కాంగ్రెస్ పరిస్థితి మారిందన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం కరువైందని ప్రధాని పేర్కొన్నారు. కేవలం ఒకే ఒక్క వ్యక్తిని వెలుగులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో.. తమ పార్టీలోని ఇతర ప్రతిభావంతులైన యువ ఎంపీలను సైతం మాట్లాడనివ్వకుండా అణిచివేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఆలోచనా విధానాన్ని ‘దిమాగీ నక్సల్స్’ తమ చేతుల్లోకి తీసుకున్నారని, అందుకే ఆ పార్టీకి ఆలోచనా శక్తి నశించిందని ఎద్దేవా చేశారు.

Advertisement

Also Read: Brahmamudi Serial Today Episode October 23rd ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రేఖ, భ్రమరాంబ కలిసి సుభాష్‌ను చంపేస్తారా..?  

Tags

Related News

డేంజర్ బెల్స్.. ప్రపంచ దేశాలకు ఐక్యరాజ్యసమితి హెచ్చరిక!

ఆడి కారు బీభత్సం.. బైక్‌ను ఢీకొట్టి, బాధితుడ్ని తొక్కుకుంటూ వెళ్లిన డ్రైవర్!

ఇన్‌స్టాలోకి కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియాగాంధీ.. ఫస్ట్ ఫోస్టు ఇదే

వృద్ధ తల్లిదండ్రులను వదిలి భర్తను ఇంటల్లుడిగా ఉండాలన్న యువతి.. విడాకుల కేసులో కోర్టు తీర్పు ఇదే

భార్య తల నరికి త్రిశూలంపై పెట్టి తాంత్రిక పూజ, బెంగాల్‌లో గగుర్పొడిచే ఘటన

ఎల్ఐసిలో ఫ్రెషర్స్ జాబ్స్.. 232 ఉద్యోగ ఖాళీలు.. వెంటనే అప్లై చేయండి

రిటైర్డ్ ఆర్మీ దంపతులకు షాక్.. డిజిటల్ అరెస్ట్ పేరుతో రూ.61.85 లక్షలు స్వాహా!

Big Stories

Advertisement
×