E-Paper
Advertisement

Sudigali Sudheer: సుధీర్ విషయంలో కన్నీళ్లు పెట్టుకున్న తల్లి తండ్రులు… వారి కోరిక నెరవేరేనా?

Sudigali Sudheer: సుధీర్ విషయంలో కన్నీళ్లు పెట్టుకున్న తల్లి తండ్రులు… వారి కోరిక నెరవేరేనా?
Advertisement

Sudigali Sudheer: సుడిగాలి సుదీర్ పరిచయం అవసరం లేని పేరు. సుధీర్ జబర్దస్త్ కార్యక్రమంలో కమెడియన్ గా కొనసాగుతూ విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్నారు. ఇలా జబర్దస్త్ ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈయనకు సినిమా అవకాశాలు రావడంతో హీరోగా పలు సినిమాలలో నటిస్తూనే మరోవైపు పలు కార్యక్రమాలకు యాంకర్ గా కొనసాగుతూ ఎంతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం సుడిగాలి సుదీర్(Sudigali Sudheer) నిహారిక కొణిదెల నిర్మాతగా వ్యవహరిస్తున్న ఆట(Aata) కార్యక్రమానికి యాంకర్ గా కొనసాగుతున్నారు. తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ఈ ప్రోమో వీడియోలో భాగంగా సుడిగాలి సుదీర్ ప్రాణం స్నేహితుడు ఆటో రాంప్రసాద్ (Auto Ramprasad)ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఆట షోలో సందడి చేసిన ఆటో రాంప్రసాద్..

జబర్దస్త్ కార్యక్రమంలో కొనసాగే సమయంలో సుడిగాలి సుదీర్ ఆటో రాంప్రసాద్ గెటప్ శ్రీను ఈ ముగ్గురు కలిసి పెద్ద ఎత్తున స్కిట్లు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమానికి వచ్చిన ఆటో రాంప్రసాద్ సుధీర్ గురించి మాట్లాడుతూ పలు విషయాలను తెలిపారు. మీ అమ్మ నాన్న ప్రతిరోజు మా ఇంటికి వచ్చి బాగా ఏడుస్తున్నారు. మా అబ్బాయికి మంచ సంబంధం చూడమని చెబుతున్నారు. మరి పెళ్లి సంబంధం చూడొచ్చు కదా అంటూ సుధీర్ మాట్లాడటంతో.. నీకు ఏ ఆప్షన్స్ లేకపోతే ఫైనల్ గా విష్ణు ప్రియను పెళ్లి చేసుకో అంటూ ఆటో రాంప్రసాద్ మాట్లాడారు. దీంతో ఒక్కసారిగా సుధీర్ షాక్ అయిపోయారు.

విష్ణు ప్రియతో సుడిగాలి సుధీర్ పెళ్లి?

Advertisement

ఆటో రాంప్రసాద్ వెంటనే ఏం విష్ణు మా సుధీర్ ను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమే కదా అని అడగగా వెంటనే విష్ణు నాకు ఇష్టమే అని చెప్పగా నాకు మాత్రం ఇష్టం లేదు అది చెప్పడానికే ఇక్కడికి వచ్చాను అంటూ ఆటో రాంప్రసాద్ తనదైన శైలిలోనే విష్ణు పై పంచ్ వేశారు. అదేవిధంగా అక్కడే ఉన్న సింగర్ సమీరా భరద్వాజ్ గురించి కూడా ప్రసాద్ మాట్లాడుతూ నేను నీకు పెద్ద ఫ్యాన్ అని ప్రసాద్ చెప్పగా వెంటనే సమీరా ఎప్పటినుంచి అంటూ అడుగుతుంది. నువ్వు సింగింగ్ మానేసిన అప్పటినుంచి నీకు నేను ఫ్యాన్ అయిపోయాను అంటూ ఆటో రాంప్రసాద్ మళ్లీ పంచ్ వేశారు. ప్రస్తుతం ఈ ప్రోమో వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

?igsh=eWZvOXF2cDdrOXJh

Advertisement

ఇకపోతే ఈ కార్యక్రమంలో భాగంగా ఆటో రాంప్రసాద్ సుడిగాలి సుదీర్ పెళ్లి గురించి మాట్లాడటంతో అభిమానులు కూడా సుధీర్ పెళ్లి చేసుకుంటే చూడాలని ఉంది అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇప్పటికే సుదీర్ పెళ్లికి సంబంధించి ఎన్నో రకాల వార్తలు బయటకు వచ్చాయి కానీ సుదీర్ మాత్రం ఇప్పటివరకు పెళ్లి చేసుకోలేదు. మరి పెళ్లి చేసుకొని సుధీర్ తన అమ్మ నాన్న కోరిక నెరవేరుస్తారా లేదంటే ఇలా బ్యాచిలర్ జీవితాన్ని గడుపుతారా అంటూ అభిమానులు కూడా కామెంట్లు చేస్తున్నారు. ఇక గతంలో యాంకర్ రష్మి గౌతమ్ తో సుధీర్ ప్రేమలో ఉన్నారంటూ వార్తలు వచ్చాయి కానీ ఆ వార్తలు నిజం కాదని, ఇద్దరం మంచి ఫ్రెండ్స్ అంటూ తెలియజేశారు.

Also Read: Actress Radhika: ఏంటీ ఈ పిచ్చి మాటలు… ఆటో రాంప్రసాద్ పై రాధిక ఫైర్..అసలేం జరిగిందంటే?

Related News

సింగర్ అంతడుపుల రమాదేవి ఒక్క పాటకు ఎంత తీసుకుంటారో తెలుసా?

Telugu Tv Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. ఆ ఒక్కటే మళ్లీ టాప్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి కొత్త టెన్షన్.. చింటును బాలు తెస్తాడా..? గుణ ప్లానేంటి..?

Podarillu Today Episode : నారాయణకు అడ్డంగా దొరికిన జమున.. కన్నా సీరియస్.. ఇదేం ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ మాటతో మీనాక్షి షాక్.. పల్లవికి మైండ్ బ్లాక్.. అరెస్ట్ చేస్తారా..?

Illu Illalu Pillalu Today Episodes: రెచ్చిపోయిన భాగ్యం.. రామరాజు మాస్ వార్నింగ్.. వల్లికి ఇంకో ఛాన్స్..

Sunday TV Movies : ఆదివారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. మస్ట్ వాచ్..

Nindu Noorella Saavasam Serial Today Episode October 18th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి కోల్‌ కతా వెళ్లడానికి వైజయంతి ఒప్పుకుంటుందా..?

Big Stories

Advertisement
×