ప్రపంచంలో చాలా వింత యూనివర్సిటీలు ఉన్నాయి. ఇవి సాధారణ యూనివర్సిటీల మాదిరిగా కాకుండా, ప్రత్యేకమైన కోర్సులు, తక్కువ సంఖ్యలో విద్యార్థులు, అసాధారణ రూల్స్, ఒకే సబ్జెక్ట్ పై ఫోకస్ చేస్తాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కొన్ని వింత యూనివర్సిటీల గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
ఇది ప్రపంచంలోనే అత్యంత వింత యూనివర్సిటీల్లో ఒకటి. ఇందులో కేవలం 26 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇక్కడ పశువులు, వ్యవసాయం, స్వయం పాలన గురించి నేర్పిస్తారు. ఈ యూనివర్సిటీలో ట్యూషన్ ఫీజు ఉండదు. విద్యార్థులు వారానికి 20 గంటలు రాంచ్ వర్క్ చేస్తారు. ఇది లిబరల్ ఆర్ట్స్ కోర్స్ అయినప్పటికీ, రాంచ్ లైఫ్ తో కలిపి నేర్పిస్తారు.
ఈ యూనివర్సిటీలో కేవలం ఐస్ క్రీమ్ గురించి టీచ్ చేస్తారు. ఇంకా చెప్పాలంటే ప్రపంచంలోనే ఏకైక ఐస్ క్రీమ్ యూనివర్సిటీ ఇది. ఇక్కడ జెలాటో (ఐస్ క్రీమ్) తయారీ, ఫ్లేవర్స్, మార్కెటింగ్ గురించి నేర్పిస్తారు. ఈ కాలేజీని ఇటలీలోని కార్పిగియాని కంపెనీ నడిపిస్తుంది.
ఈ యూనివర్సిటీలో క్యానబిస్ (మారిజువానా) స్టడీస్ పై ఫోకస్ చేస్తారు. క్యానబిస్ గ్రోయింగ్, లా, బిజినెస్, మెడిసిన్ గురించి కోర్సులు ఉంటాయి.
ఈ యూనివర్సిటీలో మరణం తర్వాత చేసే పనుల గురించి నేర్పిస్తారు. ఫ్యూనరల్ సర్వీసెస్ మీద స్పెషలైజ్డ్ కోర్సులు ఉంటాయి. ఎంబామింగ్, ఫ్యూనరల్ డైరెక్టర్ ట్రైనింగ్ ఇస్తారు.
ఈ యూనివర్సిటీలో నావల్ ఆర్కిటెక్చర్, మెరైన్ ఇంజనీరింగ్ (షిప్ బిల్డింగ్) గురించి నేర్పిస్తారు. విద్యార్థుల సంఖ్య కేవలం 40 నుంచి 100 వరకు ఉంటుంది. ఈ యూనివర్సిటీ క్యాంపస్ దాదాపు ఐలాండ్ మాదిరిగా ఉంటుంది.
ఈ యూనివర్సిటీలో బౌద్ధ మతంతో పాటు కంటెంపరరీ స్టడీస్ ఉంటాయి. ఎక్కువగా మైండ్ ఫుల్ నెస్, మెడిటేషన్ బేస్డ్ కోర్సులు అందిస్తుంది.
ఈ యూనిర్సిటీలో మ్యాజిక్ నేర్పిస్తారు. ఇల్యూషన్స్, మ్యాజిక్ ట్రిక్స్ సంబంధించిన కోర్పులు ఉంటాయి.
ఈ యూనివర్సిటీలో క్లౌన్ పెర్ఫార్మెన్స్, సర్కస్ కు సంబంధించి కళలను నేర్పిస్తారు.
ఇది మెక్ డోనాల్డ్స్ నడిపే ట్రైనింగ్ యూనివర్సిటీ ఇది. ఇక్కడ రెస్టారెంట్ మేనేజ్ మెంట్, బర్గర్ తయారీ గురించి నేర్పిస్తారు.
డర్హామ్ వర్సిటీ, యుకె: ఇందులో హ్యారీ పాటర్ కు సంబంధించిన కోర్సులు ఉంటాయి.
నజర్‌బయేవ్ యూనివర్సిటీ, కజకిస్తాన్: ఇందులో నరమాంస భక్షణ, నాగరికత గురించి నేర్పిస్తారు.
పెన్సిల్వేనియా యూనివర్సిటీ: ఇంటర్నెట్ లో సమయం వృథా చేయకుండా ఎలా ఉండాలనే కోర్సును అందిస్తారు.
ఈ యూనివర్సిటీలలో అడ్మిషన్ చాలా కష్టం. స్పెషల్ ఇంట్రెస్ట్ ఉన్నవారికి మాత్రమే ఇందులో చదువుకునే అవకాశం కల్పిస్తారు.
Read Also: ఆ యూనివర్సిటీలో ‘భూత వైద్యం’ కోర్సు.. ఇప్పటి వరకు ఎన్ని అడ్మిషన్లు వచ్చాయంటే?