E-Paper
Advertisement

Actress Radhika: ఏంటీ ఈ పిచ్చి మాటలు… ఆటో రాంప్రసాద్ పై రాధిక ఫైర్..అసలేం జరిగిందంటే?

Actress Radhika: ఏంటీ ఈ పిచ్చి మాటలు… ఆటో రాంప్రసాద్ పై రాధిక ఫైర్..అసలేం జరిగిందంటే?
Advertisement

Actress Radhika: జబర్దస్త్ కార్యక్రమం ద్వారా కమెడియన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో ఆటో రాంప్రసాద్ (Auto Ramprasad)ఒకరు. ప్రస్తుతము ఈయన బుల్లితెర కార్యక్రమాలతో పాటు వెండి తెర సినిమా అవకాశాలను కూడా అందుకుంటున్నారు. ఇక త్వరలోనే దర్శకుడిగా కూడా మారిపోతున్న సంగతి తెలిసిందే. ఇలా కమెడియన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఆటో రాంప్రసాద్ తాజాగా జీ తెలుగులో ప్రసారమవుతున్న ఆట(Aata) డాన్స్ షో కార్యక్రమంలో హాజరయ్యారు. తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు.

గోల్డ్ స్క్రీన్ అని పిలవచ్చు కదా..

ఇక ఈ ప్రోమో వీడియోలో భాగంగా ఆటో రాంప్రసాద్ తన వరుస పంచ్ డైలాగులతో అందరినీ మెప్పించారు. అయితే ఈ కార్యక్రమానికి జడ్జిగా వ్యవహరిస్తున్నటువంటి వారిలో సీనియర్ నటి రాధిక (Radhika)కూడా ఒకరు. ఇక ఈయన రాధిక గురించి మాట్లాడుతూ.. ఈ వేదికపై రాధిక గారిని చూడడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు.అయినా నాకు ఒక డౌట్ మేడం మీరు సినిమాలలో కనిపిస్తే సిల్వర్ స్క్రీన్ అంటారు బంగారం లాంటి మిమ్మల్ని పెట్టుకుని గోల్డ్ స్క్రీన్ అని చెప్పొచ్చు కదా అంటూ రాధిక పై ప్రశంసలు కురిపించారు. ఇక్కడ వరకు బానే ఉన్నప్పటికీ ఈమె సినిమాల గురించి మాట్లాడుతూ..

మీ వల్లే ఆట షో సక్సెస్…

Advertisement

మీరు మీ భుజాల మీద ఎన్నో సినిమాలను పైకి లేపారు. ఇక ఈ షోను కూడ మీరే పైకి లేపుతున్నారు అనే విషయం నాకు తెలుసు అంటూ రాంప్రసాద్ మాట్లాడటంతో ఒక్కసారిగా రాధిక సీరియస్ అయ్యారు. నువ్వు నా పాత విషయాలలోకి వెళ్తున్నావు.. డాన్స్ మొదలుపెడదామా ఆట అంటూ రాధిక మాట్లాడటంతో వెంటనే సుడిగాలి సుధీర్ మేడం మీరు నిజంగానే ఏమైనా హర్ట్ అయ్యారా? అంటూ ప్రశ్నించారు. సుడిగాలి సుదీర్ ఇలా అడిగేసరికి వెంటనే రాధిక ఏంటీ ఇది..మేము ఆట షో జడ్జ్ చేయడానికి వచ్చామా ఏంటీ ఈ పిచ్చి మాటలు అంటూ ఈమె ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వెంటనే ఆటో రాంప్రసాద్ నావల్ల నీకెందుకు చెడ్డపేరు నువ్వు కూడా ఈ కార్యక్రమం మానేసెయి ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అంటూ ఆటో రాంప్రసాద్ చెప్పారు.

?igsh=eWZvOXF2cDdrOXJh

Advertisement

ఈ మాటలకు వెంటనే రాధిక నవ్వడంతో సుడిగాలి సుధీర్ అడగడంతో 40 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో నటిస్తూనే ఉన్నాను. ఈ మాత్రం ఇప్పుడు నటించలేనా అంటూ ఆటో రాంప్రసాద్ కు అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు. మొత్తానికి ఈ ఆట షో కోసం అదిరిపోయే ప్రోమో కట్ చేశారు అంటూ ఈ వీడియో పై కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి. ఇక ఈ కార్యక్రమానికి నిహారిక కొణిదెల నిర్మాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. నిహారిక రాధికతో పాటు డాన్స్ కొరియోగ్రాఫర్ రఘు మాస్టర్ జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ కార్యక్రమానికి సుడిగాలి సుదీర్ యాంకర్ గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

Also Read: Big Tv Kissik Talks: లవ్ బ్రేకప్ సూసైడ్ అటెంప్ట్ చేసిన శ్రీ సత్య…ఏం జరిగిందంటే!

Related News

సింగర్ అంతడుపుల రమాదేవి ఒక్క పాటకు ఎంత తీసుకుంటారో తెలుసా?

Telugu Tv Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. ఆ ఒక్కటే మళ్లీ టాప్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి కొత్త టెన్షన్.. చింటును బాలు తెస్తాడా..? గుణ ప్లానేంటి..?

Podarillu Today Episode : నారాయణకు అడ్డంగా దొరికిన జమున.. కన్నా సీరియస్.. ఇదేం ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ మాటతో మీనాక్షి షాక్.. పల్లవికి మైండ్ బ్లాక్.. అరెస్ట్ చేస్తారా..?

Illu Illalu Pillalu Today Episodes: రెచ్చిపోయిన భాగ్యం.. రామరాజు మాస్ వార్నింగ్.. వల్లికి ఇంకో ఛాన్స్..

Sunday TV Movies : ఆదివారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. మస్ట్ వాచ్..

Nindu Noorella Saavasam Serial Today Episode October 18th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి కోల్‌ కతా వెళ్లడానికి వైజయంతి ఒప్పుకుంటుందా..?

Big Stories

Advertisement
×