Bailelli Raaye Bathukamma Song:తెలంగాణలో బతుకమ్మ పండగ జోరుగా సాగుతుండటంతో బతుకమ్మ పై చేసిన ఎన్నో పాటలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.ఇక ఈ కోవలోనే ‘బైలెల్లి రాయే బతుకమ్మ’ అంటూ బతుకమ్మపై చేసిన పాట కూడా ఇపుడు ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటుంది.స్వామి నరేష్ దుబ్బా ఈ పాటని రాసి తనే స్వయంగా పాడటం విశేషం. ఇక స్వామి నరేష్ దుబ్బానే బాసింగ బాసింగ బలాలు అనే పాటని కూడా పాడి ఎంత సెన్సేషన్ క్రియేట్ చేశాడో చెప్పక్కర్లేదు.
పది రోజుల్లోనే ఏకంగా రెండు మిలియన్ల పై చిలుకు వ్యూస్
ఇక అక్టోబర్ 8న యూట్యూబ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ పాటకి కృష్ణుడు సంగీతం అందించగా ఎస్. దేవ, అక్షర రాథోడ్ ఈ పాటకి తమవైన స్టెప్పులు వేశారు. ఇక ఈ పాట కేవలం పది రోజుల్లోనే ఏకంగా రెండు మిలియన్ల పై చిలుకు వ్యూస్ కొల్లగొట్టడంతో ఈ ఏడు వచ్చిన బతుకమ్మ పాటలలో ఇది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ సాంగ్ అంటూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు ఫోక్ లవర్స్.
ఇక సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న ఈ పాట బతుకమ్మ పండగ సందర్భంగా తెలంగాణ లోని గ్రామ గ్రామాన మారు మ్రోగి పోతుందని చెప్పడంలో సందేహం లేదు.తెలంగాణ అంటేనే మట్టి పరిమళం, సంస్కృతి సాంప్రదాయాలు.అలాంటి ఈ గడ్డ పై పుట్టే జానపదాలలో అదే ప్రతిబింబిస్తుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
ఇక ఈ పాట విషయానికి వస్తే నేచర్ ప్రొడక్షన్స్ బ్యానర్పై మహేష్ పేరబోయిన నిర్మించగా బాలు ఎస్.ఎం. దర్శకత్వం వహించారు. ఇక ఈ పాటకి రాకేష్ కొరియోగ్రఫీ అందించగా, చిక్కు నంది సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహించారు.
ఇప్పటి వరకు వచ్చిన బతుకమ్మ పాటల్లో ఏది టాప్ లో నిలుస్తుందో !
ముఖ్యంగా ఈ పాటకి రచయిత గాయకుడు అయిన స్వామి నరేష్ దుబ్బా గురించి ప్రతేకంగా చెప్పుకోవాలి.తను గాత్రం అందించిన బాసింగ బాసింగ బలాలు అనే పాట ఎంత సెన్సేషన్ అయింది చెప్పక్కర్లేదు. కేవలం 11 లక్షలతో తెరకెక్కిన ఈ పాటని ఇప్పటి వరకి 21 కోట్ల మంది చూడటం విశేషం.ఇక ఈ పాటనే స్వామి నరేష్ దుబ్బాని ప్రపంచానికి పరిచయం చేసింది. ఇక తనదైన కలం, గాత్రంతో దూసుకుపోతున్న ఈ యంగ్ టాలెంటెడ్ ముందు ముందు ఇంకెన్ని సంచలనాలు క్రియేట్ చేస్తాడో అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఫోక్ లవర్స్.
ఇక ఇప్పటికే రెండు మిలియన్ల వ్యూస్ కొల్లగొట్టిన బైలెల్లి రాయే బతుకమ్మ త్వరలోనే మరిన్ని రికార్డులని కొల్లగోడుతుందనడంలో సందేహం లేదు.చూడాలి మరి ఇప్పటి వరకు వచ్చిన బతుకమ్మ పాటల్లో ఏది టాప్ లో నిలుస్తుందో !