E-Paper
Advertisement

ముక్కు మూసుకుని బతుకమ్మ నిమజ్జనం చేసిన మహిళలు.. ఎందుకో తెలుసా..?

ముక్కు మూసుకుని బతుకమ్మ నిమజ్జనం చేసిన మహిళలు.. ఎందుకో తెలుసా..?
Advertisement

Bathukamma Ghat: స్వేచ్చ బ్యూరో: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళా భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో కొంపల్లి సర్కిల్‌ మున్సిపల్‌ అధికారుల తీరుపై పలు విమర్శలు వ్యక్తమయ్యాయి. కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గం పరిధిలోని సూరారం కట్ట మైసమ్మ బతుకమ్మ ఘాట్‌ వద్ద నీటి కొరత, దుర్వాసనతో ఆదివారం మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బతుకమ్మలను నిమజ్జనం చేసేందుకు ఏర్పాటు చేసిన తాత్కాలిక నీటి కొలనులో సరిపడా నీరు లేకపోవడంతో మహిళా భక్తులు అవస్థలు పడాల్సి వచ్చింది. దీనికి తోడు నీటి నుంచి వెలువడుతున్న దుర్వాసన భక్తులను ఇబ్బందులకు గురిచేసింది. కొందరు మహిళలు దుర్వాసన భరించలేక ముక్కులు మూసుకుంటూ నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్నారు . పండుగకు వచ్చే భక్తుల సౌకర్యార్థం ముందస్తు ఏర్పాట్లు చేయాల్సిన అధికారులు ఈ సమస్యలను ఎందుకు పరిష్కరించలేదని వారు ప్రశ్నిస్తున్నారు.

భక్తులు ఆందోళన..

కొలనులో నీరు తక్కువగా ఉండటంతో బతుకమ్మలను నిమజ్జనం చేసేందుకు మహిళలు మెట్లపై నుంచి చాలా లోతువరకు దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఏర్పడ్డదని భక్తులు ఆందోళన వ్యక్తం చేసారు . పండుగ సందర్భంగా మహిళలు, వృద్ధులు, చిన్నారులు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నప్పటికీ, వారి భద్రతకు తగిన చర్యలు తీసుకున్నారా అనే ప్రశ్నలు తలెత్తాయి . ఈ సమస్యపై స్థానిక నాయకులు ముందుగానే స్పందించి కుత్బుల్లాపూర్‌ జోనల్‌ కమిషనర్‌ను కలిసి అవసరమైన ఏర్పాట్లు చేయాలని వినతిపత్రాలు సమర్పించినట్లు సమాచారం. అయినప్పటికీ కొంపల్లి సర్కిల్‌ పరిధిలోని సంబంధిత అధికారులు సమస్యను పరిష్కరించడంలో తగిన చర్యలు తీసుకోలేదని స్థానికులు ఆరోపించారు.

తెలంగాణ సంస్కృతికి ప్రతీక..

Advertisement

బతుకమ్మ పండుగ మహిళల ఆత్మగౌరవానికి, తెలంగాణ సంస్కృతికి ప్రతీక. అలాంటి పండుగ వేళ కనీస నీటి సౌకర్యం, పరిశుభ్రత, భద్రత కల్పించడం మున్సిపల్‌ యంత్రాంగం బాధ్యత. కనీసం భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరారు.

Also read: ఎన్ హెచ్ఎం ఉద్యోగుల జీతాల్లో కోత సమంజసమా? సీఎం రేవంత్ కు కవిత సవాల్!

Tags

Related News

తెలంగాణ మహిళపై జమ్మూకశ్మీర్‌లో కేసు నమోదు..!

ఎంవీఎస్ఆర్ కాలేజీ దాండియా ప్రమాదంపై.. ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక ప్రకటన!

ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగే సదస్సులకు.. సర్కార్ కొత్త నిబంధనలు!

సోషల్ మీడియాలో వైరల్ వీడియోపై.. నిజామాబాద్ పోలీసులు యాక్షన్..!

కేసీఆర్‌ కుటుంబ ఆస్తులు స్వాధీనం చేసుకోవాలి! – మాజీ మంత్రి రవీంద్ర నాయక్

సాలార్ జంగ్ మ్యూజియంకు సరికొత్త రూపు.. ఓయూ విద్యార్థులకు కీలక పిలుపు!

దేశంలో అలజడులు సృష్టించే కుట్రలు సాగనివ్వం: రాంచందర్ రావు

కేజీబీవీ కాంట్రాక్ట్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్.. త్వరలో మళ్లీ ఆర్డర్లు?

Big Stories

Advertisement
×