E-Paper
Advertisement

Big Tv Kissik Talks: సక్సెస్ ఏంటో తెలియదు.. నటిగా దక్కిన గౌరవం అదే.. హరిత ఎమోషనల్ ..

Big Tv Kissik Talks: సక్సెస్ ఏంటో తెలియదు.. నటిగా దక్కిన గౌరవం అదే.. హరిత ఎమోషనల్ ..
Advertisement

Big Tv Kissik Talks: హరిత జాకీ పరిచయం అవసరం లేని పేరు. బుల్లితెర నటిగా ఎన్నో అద్భుతమైన సీరియల్స్ లో నటించిన మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె ప్రస్తుతం పలు చానల్స్ లో వివిధ సీరియల్స్ లో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా బుల్లితెర సీరియల్స్ మాత్రమే కాకుండా పలు కార్యక్రమాలలో కూడా హరిత సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. ఈమె నటిగా మాత్రమే కాకుండా మంచి డాన్సర్ కూడా. ప్రస్తుతం హరిత సీరియల్స్, బుల్లితెర కార్యక్రమాలు అలాగే యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా గడుపుతున్నారు.

ముద్దమందారం సీరియల్…

ఇదిలా ఉండగా తాజాగా హరిత(Haritha) బిగ్ టీవీ కిస్సిక్ టాక్స్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈమె మాట్లాడుతూ తన కెరియర్ కి సంబంధించిన విషయాలతో పాటు వ్యక్తిగత విషయాలను కూడా అభిమానులతో పంచుకున్నారు. ఈ నేపథ్యంలోనే తన కెరియర్లో తనకు ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలను తీసుకువచ్చిన ముద్దమందారం(Mudda Mandaram) సీరియల్ గురించి మాట్లాడుతూ కాస్త ఎమోషనల్ అయ్యారు. హరిత నటించిన టీవీ సీరియల్స్ లో తనకు ముద్దమందారం సీరియల్ ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలను తీసుకువచ్చింది.

ఘట్టమనేని అఖిలాండేశ్వరి..

Advertisement

ఈ సీరియల్ లో ఈమె ఘట్టమనేని అఖిలాండేశ్వరి (Ghattamaneni Akhilandeswari)పాత్రలో ఎంతో అద్భుతంగా నటించారు. 2014లో ప్రారంభమైన ఈ సీరియల్ 2019లో పూర్తి అయింది. పవన్ సాయి, తనూజ, సునంద వంటి తదితరులు ఈ సీరియల్లో నటించి ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకున్నారు.. ఇక ఈ సీరియల్ అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ముద్దమందారం సీరియల్ గురించి ఏదైనా చెప్పాలంటే ఏం చెబుతారు అంటూ వర్ష ప్రశ్నించారు. ఈ సీరియల్ గురించి హరిత మాట్లాడుతూ.. ముద్దమందారం సీరియల్ గురించి ఏం మాట్లాడినా తక్కువే అంటూ తెలిపారు. ఈ సీరియల్ 2019వ సంవత్సరంలో పూర్తి అయింది దాదాపు 6 సంవత్సరాలు అయిన ఇప్పటికీ నేను బయటకు వెళ్తే నన్ను చూసి అందరూ అఖిలాండేశ్వరి అని పిలుస్తారు.

Advertisement

ఒక ఆర్టిస్టుకు ఇంతకంటే పెద్ద బ్లెస్సింగ్స్ ఏవి ఉండవని తెలిపారు. నేను ఎప్పుడు అనుకోలేదు ఒక నటిగా వచ్చాను, నటించాను. సక్సెస్ అనేది ఎలా ఉంటుందో మనకు తెలియదు అవకాశాలు వస్తే నటిస్తూనే ఉన్నాము. ఈ సీరియల్ తో సక్సెస్, పేరు ప్రఖ్యాతలు రావడం, ఎంతోమంది ప్రేమాభిమానాలు పొందటం ఒక యాక్టర్ గా నాకు దక్కిన వరం, గౌరవం అఖిలాండేశ్వరి పాత్ర అంటూ ఎమోషనల్ అయ్యారు. చిన్నప్పటి నుంచి కూడా నా విషయంలో ప్రతి ఒక్కరూ చాలా మంచిగా బ్లెస్సింగ్స్ ఇచ్చేవారని, ఇలా వారు ఆశీర్వాదాలు ఇచ్చినప్పుడు భగవంతుడు తధాస్తు అన్నాడు కాబోలు నా జీవితంలో అనుకున్న దానికంటే భగవంతుడు ఎక్కువే ప్రసాదించాడు అంటూ ఈమె తన సక్సెస్ గురించి కూడా మాట్లాడుతూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Also Read: Big Tv Kissik Talks: సీరియల్ నటి హరిత అసలు పేరు ఏంటో తెలుసా…అందుకే మార్చారా?

Related News

‘బైలెల్లి రాయే బతుకమ్మ’ జోరు మామూలుగా లేదుగా.. అప్పుడే మిలియన్ల వ్యూస్

సింగర్ అంతడుపుల రమాదేవి ఒక్క పాటకు ఎంత తీసుకుంటారో తెలుసా?

Telugu Tv Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. ఆ ఒక్కటే మళ్లీ టాప్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి కొత్త టెన్షన్.. చింటును బాలు తెస్తాడా..? గుణ ప్లానేంటి..?

Podarillu Today Episode : నారాయణకు అడ్డంగా దొరికిన జమున.. కన్నా సీరియస్.. ఇదేం ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ మాటతో మీనాక్షి షాక్.. పల్లవికి మైండ్ బ్లాక్.. అరెస్ట్ చేస్తారా..?

Illu Illalu Pillalu Today Episodes: రెచ్చిపోయిన భాగ్యం.. రామరాజు మాస్ వార్నింగ్.. వల్లికి ఇంకో ఛాన్స్..

Sunday TV Movies : ఆదివారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. మస్ట్ వాచ్..

Big Stories

Advertisement
×