E-Paper
Advertisement

Honda Zero Alpha SUV: భారత్ లో క్రేజీ ఎలక్ట్రిక్ SUV లాంచ్.. హోండా కీలక ప్రకటన!

Honda Zero Alpha SUV: భారత్ లో క్రేజీ ఎలక్ట్రిక్ SUV లాంచ్.. హోండా కీలక ప్రకటన!
Advertisement

జపాన్ ఆటోమోటివ్ దిగ్గజం హోండా తన 0 సిరీస్ ఎలక్ట్రిక్ శ్రేణి కార్లను జపాన్ మొబిలిటీ షోలో ప్రపంచ వ్యాప్తంగా ఆవిష్కరించింది. అదే సమయంలో కంపెనీ భారత్ లో ఈ మోడల్ అడుగు పెడుతుందని ప్రకటించింది. హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్, మహీంద్రా BE 6 లాంటి కార్లకు గట్టి పోటీ ఇచ్చే ఎలక్ట్రిక్ SUV అయిన 0 ఆల్ఫా ఇండియా లాంచ్ కు సంబంధించి హోండా కీలక ప్రకటన చేసింది.

2027లో ఇండియాలో లాంచ్

హోండా కార్ ఇండియా పేజీ ద్వారా ఇటీవల కీలక ప్రకటన చేసింది. ఇందులో హోండా 0 ఆల్ఫా ఎలక్ట్రిక్ SUV 2027లో  భారత్ లో అడుగు పెడుతుందని ప్రకటించింది. అయితే, కచ్చితమైన తేదీని పోస్ట్ చేయలేదు. హోండా మొబిలిటీ కొత్త అధ్యాయం మొదలుకాబోతోంది. ఎలక్ట్రిక్ డ్రైవింగ్ తదుపరి యుగం ప్రారంభం అవుతోందని ప్రకటించింది.

హోండా 0 ఆల్ఫా వివరాలు

Advertisement

హోండా నుంచిరాబోయే మిడ్ సైజ్ ఎలక్ట్రిక్ SUV 0 ఆల్ఫా. ఇది భారత్ లో తయారు చేయబడుతుంది. హోండా గ్లోబల్ 0 సిరీస్ కార్యక్రమంలో భాగంగా, ఈ కారును తయారు చేయనుంది. ఈ నేపథ్యంలో ఇండియన్ మార్కెట్ లో ఆ కారు ధర మరింత తక్కువగా ఉంటుంది. ఇది దేశంలో హోండా కార్స్ ఇండియా ఫస్ట్ ఎలక్ట్రిక్ కారుగా మార్కెట్ లోకి అడుగు పెట్టనుంది. 0 ఆల్ఫాతో పాటు, కంపెనీ పెద్ద 0 SUV, 0 సెలూన్‌ ను కూడా ప్రదర్శించింది.

0 సిరీస్ లో పలు ఎలక్ట్రిక్ కార్లు

అయితే, 0 SUV కంప్లీట్లీ బిల్ట్ యూనిట్ ద్వారా ఇండియాకు తీసుకురాబడుతుంది. 0 సెలూన్ అంతర్జాతీయంగా మాత్రమే అందించబడుతుంది. ఇప్పుడు, హోండా 0 ఆల్ఫా, ఇతర 0 సిరీస్ వాహనాల డిజైన్ విషయానికి వస్తే, అవి చాలా మోడ్రన్, ఫ్యూచరిస్టిక్ భవిష్యత్ డిజైన్‌ను కలిగి ఉంటాయి.  రీసెంట్ గా ఆవిష్కరించిన హోండా 0 ఆల్ఫా కాన్సెప్ట్ చాలా సింపుల్ గా కనిపిస్తుంది. ఇది కనెక్ట్ చేయబడిన LED DRLని కలిగి ఉంటుంది. ఇది చివర్లలో కాస్త కుంచించుకుపోయినట్లు కనిపిస్తుంది.  ఈ SUV LED హెడ్‌లైట్లను కలిగి ఉంటుంది. కొత్త షైనింగ్ హోండా లోగోతో పూర్తిగా బ్లాక్ అవుట్, క్లోజ్ ఆఫ్ గ్రిల్‌ను కూడా పొందుతుంది.

Advertisement

ఇక కారు ముందు భాగంలో కింది వైపు SUV చివర్లలో సిల్వర్ అంశాలతో కూడిన షార్ప్ బంపర్, మధ్యలో పెద్ద ఎయిర్ డ్యామ్‌ ను కలిగి ఉంటుంది. 18–19-అంగుళాల పెద్ద ఏరో ఎఫిషియన్సీ అల్లాయ్ వీల్స్ సెట్‌ను పొందుతుంది. ఈ SUV కాన్సెప్ట్ ఫ్లష్ టైప్ డోర్ హ్యాండిల్స్,  డోర్లపై మందపాటి క్లాడింగ్‌ ను కలిగి ఉంటుంది. వెనుక చివర నుంచి చూసినప్పుడు, ఇది పొడవైన, చదునైన విండ్‌ స్క్రీన్‌ తో కలిసిపోయినట్లు కనిపిస్తుంది. ఇది ప్రత్యేకమైన U ఆకారపు LED టెయిల్‌ లైట్‌ ను కలిగి ఉంటుంది. వెనుక బంపర్ సిల్వర్ కలర్ లో డబుల్ బబుల్ డిఫ్యూజర్‌ ను కలిగి ఉంటుంది.

హోండా 0 ఆల్ఫా EV పవర్‌ ట్రెయిన్ గురించి..

ప్రస్తుతానికి, హోండా 0 ఆల్ఫా EV SUV  పవర్‌ ట్రెయిన్ ఎంపికల గురించి వెల్లడించలేదు. అయితే, ఇది 65 kWh, 75 kWh రెండు బ్యాటరీ ప్యాక్ ఎంపికలతో అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు. ఎలక్ట్రిక్ మోటారు విషయానికొస్తే, ఇది సింగిల్ మోటార్, ఫ్రంట్ వీల్ డ్రైవ్ లే అవుట్‌ ను పొందుతుంది. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి.

Read Also: ఒకే ఛార్జ్ తో ఏకంగా 1,000 కి.మీ ప్రయాణం, కళ్లు చెదిరే ఎలక్ట్రిక్ కారు వచ్చేస్తోంది!

Related News

వోక్స్‌ వ్యాగన్ కార్లపై కళ్లు ఆఫర్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ.6 లక్షల తగ్గింపు!

సింగిల్ ఛార్జ్ తో 243 కి.మీ రేంజ్.. సింపుల్ వేవ్ సూపర్ స్కూటర్ వచ్చేసింది!

2027లో కొత్త నెక్సాన్.. డిజైన్ నుంచి ఇంజిన్ వరకు అన్నీ మారనున్నాయా?

5 ఏళ్ల తర్వాత పజెరో రీఎంట్రీ.. కొత్త లుక్‌తో మిత్సుబిషి బిగ్ సర్‌ప్రైజ్!

EV కొనేముందు ఈ విషయం చెక్ చేశారా? లేదంటే ఇబ్బందులు తప్పవు!

టాటా దూకుడు.. మహీంద్రా జోరు! ఆగస్టు అమ్మకాల్లో ఎవరు టాప్?

హోండా కొత్త ఈ-స్కూటర్‌కు పేటెంట్.. స్పీడ్ ఎంతో తెలిస్తే వావ్ అనాల్సిందే!

100 కి.మీ స్పీడ్.. 200 కి.మీ రేంజ్.. ఆంపియర్ కొత్త ఎలక్ట్రిక్ బైక్‌కు పేటెంట్!

Big Stories

Advertisement
×