E-Paper
Advertisement

శ్రీ సత్యతో లవ్.. బ్రేకప్ పై అర్జున్ కళ్యాణ్ ఎమోషనల్..వారి శాపమే అంటూ!

శ్రీ సత్యతో లవ్.. బ్రేకప్ పై అర్జున్ కళ్యాణ్ ఎమోషనల్..వారి శాపమే అంటూ!
Advertisement

Big Tv Kissik Talks: అర్జున్ కళ్యాణ్ బిగ్ బాస్ కంటెస్టెంట్ గా అందరికీ ఎంతో సుపరిచితమైన ఈయన ప్రస్తుతం పలు బుల్లి తెర కార్యక్రమాలతో పాటు సినిమా అవకాశాలను అందుకుంటున్నారు. ఇలా కెరియర్ పరంగా ఇండస్ట్రీలో బిజీ అవుతున్న అర్జున్ కళ్యాణ్ (Arjun Kalyan)తాజాగా కిస్సిక్ టాక్స్(Kissik Talks) కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన తన బ్రేకప్ గురించి మాట్లాడుతూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. బిగ్ బాస్ కార్యక్రమంలో అర్జున్ కళ్యాణ్ పాల్గొన్న సమయంలో శ్రీ సత్య (Sri Satya)తో ప్రేమలో ఉన్నారు అంటూ అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే ఈ విషయంపై అర్జున్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చారు.

శ్రీ సత్యతో లవ్.. రూమర్లు మాత్రమే..

శ్రీ సత్యతో తనకు ఎలాంటి లవ్ లేదని, తను నాకు ఒక మంచి స్నేహితురాలు మాత్రమేనని తెలిపారు. తనతో లవ్ లో ఉన్నానంటూ వచ్చిన వార్తలు కేవలం రూమర్స్ మాత్రమేనని క్లారిటీ ఇచ్చారు. తను ఎవరినైనా బీభత్సంగా ఇష్టపడితే కచ్చితంగా వారికి తన ప్రేమ విషయాన్ని చెబుతానని అర్జున్ తెలిపారు. నేను ఎవరికైనా ప్రపోజ్ చేశాను అంటే అమ్మాయి ఎంతో స్పెషల్ అని అర్థం అంటూ అర్జున్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. మరి ఎవరికైనా అలా చెప్పారా అంటూ వర్ష అడగడంతో చెప్పాను, ఆమె ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటానని తెలిపారు కానీ ఆమె ఎవరు అనే విషయాలు మాత్రం తెలియజేయలేదు.

ఆ ప్రేమ సచ్చిపోయింది…

Advertisement

తాను ప్రపోజ్ చేసిన అమ్మాయి మాత్రం పెళ్లికి ఒప్పుకోలేదని, ఒప్పుకుంటే మాత్రం చేసుకుంటానని తెలిపారు. ఇప్పుడు ఆ అమ్మాయి ఇంటర్వ్యూ చూస్తుంది తనకు ఏదైనా ప్రేమగా చెప్పాలనుకుంటే ఏం చెబుతారు అంటూ ప్రశ్న వేయడంతో ఇప్పుడు ఆ ప్రేమ లేదని, ఆ ప్రేమ సచ్చిపోయింది అంటూ అర్జున్ తెలిపారు. అయితే తన కెరియర్ లో ఇప్పటివరకు అయిదు సార్లు బ్రేకప్ జరిగిందని ఒకసారి మాత్రం మ్యూచువల్ గా ఇద్దరం విడిపోయామని మిగిలిన నాలుగు సార్లు నేను ప్రపోజ్ చేసిన ఒప్పుకోలేదని తెలిపారు. ఇలా బ్రేకప్ అయిన తర్వాత అప్పట్లో డిప్రెషన్లో ఉండిపోయానని కానీ అలా ఉండకూడదని, కచ్చితంగా మూవ్ ఆన్ అవ్వాలి కానీ అదే జ్ఞాపకాలలో ఉండకూడదని అర్జున్ తెలిపారు.

Advertisement

ఇక బ్రేకప్ అనేది ఎప్పుడు కూడా ఒకరి వల్లే కాదని ఇద్దరి వల్ల ,ఇద్దరు చేసిన తప్పులు, ఒకరినొకరు అర్థం చేసుకోకపోవడం వంటి కారణాల వల్ల మాత్రమే బ్రేకప్ జరుగుతుందని అర్జున్ తెలిపారు. ఇలా ఏకంగా ఐదుసార్లు తనకు బ్రేకప్ జరిగింది అంటూ అర్జున్ ఈ సందర్భంగా చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అయితే తను ఇంటర్ చదువుతున్న సమయంలో తనకు చాలామంది ప్రపోజ్ చేశారని ఆ సమయంలో తాను నో చెప్పానని, అందుకే ఇప్పుడు నేను ప్రపోజ్ చేసిన వారందరూ నో చెబుతున్నారు అంటూ అర్జున్ చెప్పారు. బహుశా వారి శాపాలే నాకు తగిలాయేమో అంటూ అర్జున్ కళ్యాణ్ సరదాగా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Also Read: కాబోయే భార్య ఎలా ఉండాలో చెప్పిన అర్జున్ కళ్యాణ్… పిచ్చ క్లారిటీతో ఉన్నాడుగా!

Related News

Podarillu Today Episode : జమున దొరుకుతుందా..? శైలు మాటతో షాక్.. నారాయణ దెబ్బకు మైండ్ బ్లాక్..

Karthika Deepam 2 Serial Today Episode October 17th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని ఎదురుగానే జ్యోత్స్న చేయి పట్టుకున్న సూరజ్            

Gundeninda GudiGantalu Today episode: బాలును ఇరికించే ప్లాన్.. దొంగగా రోహిణి.. ఇది కదా అసలు ట్విస్ట్..

Brahmamudi Serial Today Episode October 17th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  అపర్ణ రాసిన లెటర్ శేషు జీవితాన్ని మలుపు తిప్పుతుందా..? 

Saturday TV Movies : శనివారం టీవీ సినిమాలు.. మూవీ లవర్స్ కు జాతరే..

Nindu Noorella Saavasam Serial Today Episode October 17th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పార్థు హత్య కేసు నుంచి మనోహరి ఎస్కేప్ అవుతుందా..? 

సోషల్ మీడియాని షేక్ చేస్తున్న నల్గొండ గద్దర్ నరసన్న.. రమణిలో బతుకమ్మ పాటతో రచ్చ!

మాధురి రాథోడ్ లైఫ్‌లో జరిగినదే పాటలో ఉందా? ‘భామ సుందరా’ గ్లింప్స్ వైరల్!

Big Stories

Advertisement
×