E-Paper
Advertisement

Klaasen On RCB: నాది ఔటే కాదు..అంపైర్ల‌ను కొని గెల‌వ‌డానికి సిగ్గుండాలి !

Klaasen On RCB: నాది ఔటే కాదు..అంపైర్ల‌ను కొని గెల‌వ‌డానికి సిగ్గుండాలి !
Advertisement

Klaasen On RCB:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( IPL 2026) నిన్న ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే ఈ మెగా టోర్నమెంటులో మొదట సన్ రైజర్స్ హైదరాబాద్ ( SRH), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ( RCB) తలపడ్డాయి. అయితే ఈ మ్యాచ్ లో అద్భుతంగా రాణించిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ఈ సీజ‌న్ లో మొట్ట మొదటి విజయాన్ని నమోదు చేసుకుంది. హైదరాబాద్ పై 6 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది. అయితే ఈ మ్యాచ్ లో మ్యాచ్‌ ఫిక్సింగ్ జరిగినట్లు సోషల్ మీడియాలో తెగ వార్తలు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ ఆటగాడు హేన్రిచ్ క్లాసెన్ నాట్ ఔట్ అంటూ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఇక ఇదే అంశంపై హేన్రిచ్ క్లాసెన్ తాజాగా స్పందించాడు. తనది ఔట్ కాద‌న్నారు. అంపైర్లు అమ్ముడుపోయి, నిద్ర మత్తులో త‌న‌ది ఔట్ అంటూ ప్ర‌క‌టించార‌ని విమ‌ర్శ‌లు చేశారు, ఈ మేరకు సోషల్ మీడియాలో హేన్రిచ్ క్లాసెన్ చేసిన కామెంట్లు వైరల్ గా మారాయి.

Also Read: IPL telecast in Bangladesh: బిగ్ రిలీఫ్‌..బంగ్లాదేశ్ లో ఐపీఎల్ పై నిషేధం ఎత్తివేత‌..ముస్తాఫిజుర్ రీ-ఎంట్రీ !

నాది ఔటే కాదు..అంపైర్ల‌ను కొని గెల‌వ‌డానికి సిగ్గుండాలి !

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో భాగంగా నిన్న హైద‌రాబాద్ వ‌ర్సెస్ ఆర్సీబీ మ‌ధ్య మ్యాచ్ జ‌రిగింది. ఇందులో హేన్రిచ్ క్లాసెన్ 31 ప‌రుగుల చేసి, వివాద‌స్ప‌ద క్యాచ్ కార‌ణంగా ఔట్ అయ్యాడు. రొమారియో షెపర్డ్ బౌలింగ్ లో ఫిల్ సాల్ట్ కు క్యాచ్ ఇచ్చి, వెనుదిరిగాడు క్లాసెన్‌. అయితే, బౌండ‌రీ గేట్ ద‌గ్గ‌ర ఉన్న ఫిల్ సాల్ట్ క్యాచ్ అందుకున్న అనంతరం, త‌న కాలును బార్డ‌ర్ కు త‌గిలించిన‌ట్లు రీప్లేలో స్ప‌ష్టంగా క‌నిపించింది. అయితే, రీప్లేలో స‌రిగ్గా ఈ విషాయాన్ని గ‌మ‌నించ‌ని థ‌ర్డ్ అంపైర్, హేన్రిచ్ క్లాసెన్ ఔట్ అంటూ ప్ర‌క‌టించాడు. దీంతో ఈ క్యాచ్ వివాదంగా మారింది. సునీల్ గ‌వాస్క‌ర్‌, ర‌వి శాస్త్రి లాంటి సీనియ‌ర్లు కూడా హేన్రిచ్ క్లాసెన్ నాటౌట్ అంటూ ప్ర‌క‌టిస్తున్నారు.

ఇక తాజాగా హేన్రిచ్ క్లాసెన్ ( Heinrich Klaasen ) స్వ‌యంగా ఈ క్యాచ్ వివాదంపై స్పందించార‌ని ఓ పోస్ట్ వైర‌ల్ గా మారింది. తొండాట ఆడి గెలిచి, సంబ‌రాలు చేసుకోవ‌డానికి సిగ్గుండాలంటూ రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌ట్టును ఉద్దేశించి ఫైర్ అయ్యారు. నాది అస‌లు ఔటే కాద‌ని విమ‌ర్శ‌లు చేశారు. ఫిల్ సాల్ట్ కాలు బౌండ‌రీ గేట్ ను త‌గిలిన‌ట్లు స్ఫ‌ష్టంగా క‌నిపించింది.. కానీ అంపైర్లు మాత్రం ఆర్సీబీకి అనుకూలంగా నిర్ణ‌యం తీసుకున్నార‌ని మండిప‌డ్డారు. లేక‌పోతే, మ్యాచ్ మేం గెలిచేవాళ్ల‌మ‌న్నారు. ఆ ఒక్క క్యాచ్ ( Heinrich Klaasen Catch Controversy) మ్యాచ్ ఫ‌లితాన్ని మార్చేసింద‌ని సీరియ‌స్ అయ్యారు. పేరు గాంచిన ఐపీఎల్ లో కూడా ఇలాంటి త‌ప్పిదాలు జ‌రుగ‌డం దారుణ‌మ‌న్నారు. ఇలా అంపైర్లు కూడా ఆర్సీబీకి అనుకూలంగా ఉండ‌టం త‌మ ఓట‌మిని శాసించింద‌న్నారు.

Advertisement

 

Also Read: Mohammad Amir: ఐపీఎల్ అంటేనే ఫిక్స‌ర్స్ లీగ్..అంపైర్ల నుంచి చీర్ గ‌ర్ల్స్ అంద‌రూ అమ్ముడుపోయేవాళ్లే

 

 

Related News

దున్న‌పోతుల్లా తిన‌డం త‌ప్ప‌…మా ద‌ద్ద‌మ్మ‌ల‌కు ఆడ‌టం చేత‌కాదు

రిటైర్మెంట్ ఇచ్చే వ‌రకు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ గా కొన‌సాగుతాడు

బాబర్ ఆజం, షాహీన్ అఫ్రిది మధ్య గొడవలే పాకిస్తాన్ కు ఈ దరిద్రం

బాబ‌ర్ ఆజంకు చేత‌కాదు, నాకు కెప్టెన్సీ ఇవ్వండి !

నేను లేక‌పోతే..టీమిండియాలో ధోని అడుగు పెట్టేవాడే కాదు!

ధోని తల పగలగొట్టాలని బంతులు వేశా.. షోయబ్ అక్తర్ సంచ‌ల‌నం!

హ‌ర్ధిక్ పాండ్యా ఎఫెక్ట్..సూర్య‌కు ఝ‌ల‌క్..ముంబై జ‌ట్టులో గంద‌ర‌గోళం !

ఒక్క దద్దమ్మ నాకు సపోర్ట్ చేయలేదు..బాబ‌ర్ ఆజం హాట్ కామెంట్స్‌

Big Stories

Advertisement
×