Vidura Niti: విదుర నీతి ప్రకారం భార్యాభర్తలు ఎట్టి పరిస్థితుల్లో ఆ పనులు అసలు చేయకూడదట. ఆ పనులు చేసే భార్యాభర్తలు ఎప్పుడు సంతోషంగా ఉండరట. ఇంకా అన్యోన్య దాంపత్యానికి హస్బెండ్ అండ్ వైఫ్ ఎలా ఉండాలి.. ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి.. నిండు నూరేళ్ల కాపురానికి ఏమేం చేయాలి లాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు విదుర నీతిలో ఉన్నాయట. ఆ విషయాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
మహాభారతంలోని విదురనీతిలో దంపతుల మధ్య ఉండాల్సిన సంబంధం, బాధ్యత మరియు ప్రవర్తన గురించి చాలా స్పష్టమైన మరియు లోతైన మార్గదర్శకాలు ఉన్నాయట. విదురుని బోధనల ప్రకారం భార్యాభర్తలు ఎలా ఉండాలో ఎలా ఉండకూడదలో ఇప్పుడు తెలుసుకుందాం.
పరస్పర గౌరవం మరియు నమ్మకం: విదురనీతి ప్రకారం.. భార్యాభర్తల బంధానికి మూలం నమ్మకం. భార్యాభర్తలు ఒకరినొకరు గౌరవించుకోవాలట. భర్త భార్యను, భార్య భర్తను ఎట్టి పరిస్థితుల్లోనూ తక్కువ చేసి మాట్లాడకూడదట. ఒకరి వ్యక్తిత్వాన్ని మరొకరు గౌరవించినప్పుడే ఆ కుటుంబం సుభిక్షంగా ఉంటుందట. అలా కాకుండా ఎవరి ఇష్టానికి వాళ్లు ఒకరి మీద ఒకరు ఎప్పుడూ గొడవపడుతుంటే ఆ కాపురం మూణాళ్ల ముచ్చటగానే మిగిలిపోతుందట.
ఏకాభిప్రాయం (ఏకపత్నీవ్రతం – పరస్పర నిబద్ధత): విదురుడు దంపతులు ఒకే లక్ష్యం వైపు సాగాలని చెబుతాడు. సంపద, ధర్మం, మరియు సుఖాల విషయంలో ఇద్దరి ఆలోచనలు కలవాలట. నిర్ణయాలు తీసుకునేటప్పుడు పరస్పర చర్చ జరగాలట. ఇద్దరూ కలిసి ఉండటమే గృహస్థాశ్రమానికి అసలైన సంతోషం అని విదురనీతి చెబుతుందట.
భార్య పాత్ర (గృహిణి): విదురనీతిలో భార్యను గృహలక్ష్మి గా కొలుస్తారట. ఆమెకు ఉండాల్సిన లక్షణాలను విదుర నీతిలో సూచించాడట. వాటిలో భార్య మృదు స్వభావం కలిగి ఉండాలట. కఠినమైన మాటలు మాట్లాడకుండా, ఇంటిని ప్రశాంతంగా ఉంచాలట. శారీరకంగానే కాకుండా, ఆలోచనల్లో కూడా పవిత్రత కలిగి ఉండాలట. ఇక ఇంటి ఆర్థిక విషయాలను, బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలట. ఏ ఇంట భార్య సంతోషంగా ఉంటుందో, ఆ ఇల్లు దైవ సమానమని విదురుడు చెప్పాడట.
భర్త పాత్ర: భార్యను భర్త ఒక బాధ్యతగా చూడాలట..భార్యను అన్ని వేళలా రక్షించాలట, ఆమెకు ఇచ్చే గౌరవం ఎల్లప్పుడూ తగ్గకుండా చూసుకోవాలట. అలాగే ఆమె చేసే పనులను, ఆమెలోని ప్రతిభను భర్త గుర్తించి ప్రోత్సహించాలట. భర్త తన భార్య దగ్గర ఎప్పుడూ నిజాయితీగా ఉండాలట, ఎటువంటి రహస్యాలు దాచకూడదట.
కష్టసుఖాల్లో సమాన భాగస్వామ్యం: విదురనీతి ప్రకారం.. భార్యాభర్తలు కేవలం సుఖాల్లోనే కాకుండా, కష్టాల్లో కూడా ఒకరికొకరు తోడుగా ఉండాలట. ఒకరి బాధను మరొకరు పంచుకోవడం ద్వారా ఆ బాధ తగ్గుతుందని, సంతోషాన్ని పంచుకోవడం ద్వారా అది రెట్టింపు అవుతుందని విదురుని నీతిలో ఉందట.
ధర్మబద్ధమైన జీవనం: దంపతులు ఇద్దరూ ధర్మ మార్గంలో నడవాలట. ధర్మాన్ని పాటించే దంపతుల సంతానం కూడా సుగుణవంతులుగా ఉంటారని, ఇది కుటుంబానికి కీర్తిని తెస్తుందని విదురనీతి చెబుతుందట.
విదురనీతి ఒక మాటలో చెప్పాలంటే.. భార్యాభర్తలు ఒకే రథానికి ఉన్న రెండు చక్రాల వంటి వారని అందులో ఏ ఒక్క చక్రం సరిగ్గా లేకపోయినా రథం నడవదని. కాబట్టి ఇద్దరూ సమతుల్యతతో, ఓర్పుతో, ప్రేమతో వ్యవహరిస్తేనే ఆ జీవితం ధన్యమవుతుందని విదుర నీతిలో ఉందని పండితులు చెప్తున్నారు.
ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.