E-Paper
Advertisement

Big Tv Kissik Talks: సినిమా అవకాశాలు రాకుంటేనే సీరియల్స్ చేస్తారా? హరిత కామెంట్స్ వైరల్!

Big Tv Kissik Talks: సినిమా అవకాశాలు రాకుంటేనే సీరియల్స్ చేస్తారా? హరిత కామెంట్స్ వైరల్!
Advertisement

Big Tv Kissik Talks: బిగ్ టీవీ కిస్సిక్ టాక్స్ కార్యక్రమం ఎంతో మంచి ఆదరణను సొంతం చేసుకుంది. ప్రతివారం ఈ కార్యక్రమంలో భాగంగా సెలబ్రిటీలు పాల్గొంటూ ఎన్నో ఆసక్తికరమైన విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు. ఇక ఈ వారం ఈ కార్యక్రమంలో భాగంగా బుల్లితెర నటి హరిత(Haritha) పాల్గొని సందడి చేశారు. అఖిలాండేశ్వరిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె బుల్లితెర శ్రీదేవిగా అద్భుతమైన నటనను కనబరుస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.

సీరియల్స్ అవసరమా? పెళ్లి చేయొచ్చు కదా..

తాజాగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న హరిత సీరియల్స్ గురించి మాట్లాడుతూ పలు విషయాలను తెలియచేశారు. చాలామంది సినిమాలలో కాకుండా సీరియల్స్ లో నటించడం చిన్నచూపుగా భావిస్తారు. సినిమాలలో అవకాశాలు రాకుంటేనే సీరియల్స్ చేస్తారనే భావనలో ఉంటారు. తాను కూడా ఇలా సీరియల్స్ చేస్తున్న సమయంలో చాలామంది ఎన్నో మాటలు అన్నారని హరిత తెలిపారు. సీరియల్స్, నాటకాలు వేయటం అవసరమా? పెళ్లి చేసి పంపియేచ్చుగా అంటూ అమ్మకు చాలామంది చాలా విధాలుగా చెప్పారని హరిత తెలిపారు. కానీ అమ్మ మాత్రం ఆ విషయాలు ఏవి పట్టించుకోలేదని మమ్మల్ని ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తూ వచ్చారని తెలిపారు.

నాకు పునర్జన్మను ఇచ్చింది..

Advertisement

మనం నటనపై ఆసక్తితో ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకోవడానికి వచ్చాము. అది చిన్నదా పెద్దదా అనేది కాదు. మనకు ఎప్పుడు ఎక్కడ ఎలాంటి అవకాశాలు వచ్చినా వాటిని చేసుకుంటూ పోవాలని నిర్ణయించుకున్నాను. అందుకే ఇన్ని చానల్స్ లో నేను చేస్తున్నాను. ఇలా ఈరోజు నాకు వచ్చిన అవకాశాలు పునర్జన్మను ఇచ్చాయని హరిత తెలిపారు. ఇప్పటికి నేను బయటకు వెళ్లిన చాలామంది ఒక్కసారిగా నన్ను చూసి నన్ను ముద్దు పెట్టుకోవడానికి వస్తుంటారు. ఎలా ఉన్నావమ్మా అంటూ ఎంతో ఆప్యాయంగా పలకరిస్తారు.

Advertisement

మేము ఎక్కువగా మీ సీరియల్స్ చూస్తాము మీ షోలను చూస్తాము అంటూ అందరూ చెప్పడం చాలా ఆనందాన్ని కలిగిస్తుందని ఒక నటిగా ఇంతకంటే ఏం కావాలి అంటూ హరిత తెలియజేశారు. ఇలా నన్ను ఇష్టపడేవారు ఇంతమంది ఉన్నారనే విషయం నాకు తెలిసిన సమయంలో నేను వాళ్లకోసం ఇంకా కష్టపడాలి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేయాల్సి ఉంటుందని హరిత తెలిపారు. అలాగే ఇటీవల కాలంలో తనకు జరిగిన ఒక సంఘటన గురించి కూడా తెలియజేశారు. ఓ  అభిమాని తన తల్లికి నేనంటే ఇష్టమని ఆ అబ్బాయి జాకీ ఫ్రెండ్స్ సర్కిల్ ద్వారా నన్ను కాంటాక్ట్ అయ్యి నన్ను వాళ్ళింటికి తీసుకెళ్లి ఎంతో ఆప్యాయంగా పలకరించారని స్వయంగా అమ్మగారే తన చేతితో కాఫీ ఇచ్చారు అంటూ అభిమానుల నుంచి తనకు లభిస్తున్న ప్రేమను తలుచుకొని నటిగా ఇంకేం కావాలి అంటూ హరిత తెలియజేశారు.

Also Read: Deepika Padukone: ట్రోలర్స్‌కు దీపికా కౌంటర్.. అలా అనేసిందేంటీ?

Related News

Telugu Tv Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. ఆ ఒక్కటే మళ్లీ టాప్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి కొత్త టెన్షన్.. చింటును బాలు తెస్తాడా..? గుణ ప్లానేంటి..?

Podarillu Today Episode : నారాయణకు అడ్డంగా దొరికిన జమున.. కన్నా సీరియస్.. ఇదేం ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ మాటతో మీనాక్షి షాక్.. పల్లవికి మైండ్ బ్లాక్.. అరెస్ట్ చేస్తారా..?

Illu Illalu Pillalu Today Episodes: రెచ్చిపోయిన భాగ్యం.. రామరాజు మాస్ వార్నింగ్.. వల్లికి ఇంకో ఛాన్స్..

Sunday TV Movies : ఆదివారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. మస్ట్ వాచ్..

Nindu Noorella Saavasam Serial Today Episode October 18th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి కోల్‌ కతా వెళ్లడానికి వైజయంతి ఒప్పుకుంటుందా..?

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

Big Stories

Advertisement
×