Fertilizer Prices: స్వేచ్ఛ బ్యూరో: ప్రస్తుత రబీ పంటల సాగుకు ఎరువుల ధరలు మరింత భారం అయ్యాయి. తాజాగా కొన్ని కాంప్లెక్స్ ఎరువుల ధరలు బస్తాకు రెండు నెలల్లో 50 చొప్పున పెరిగిందని వ్యాపార వర్గాలు అంటున్నాయి. ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులతో సేద్యాన్ని నీటికొస్తున్న అన్నదాతకు పెరిగిన ఎరువుల కాంప్లెక్స్ ధరలు ఆశనిపాతంగా మారింది. దీంతో రైతులపై భారం తప్పడం లేదు. ఉమ్మడి జిల్లాలో యాసంగి వరి నాట్లు పూర్తికాగా ఇతర ఆరు తడి పంటలు మధ్య దశకు వచ్చాయి. పంటల ఎదుగుదలకు యూరియాతోపాటు ఇతర పోషకాలు అందించేందుకు కాంప్లెక్స్ ఎరువులను రైతులు విరివిగా వినియోగిస్తారు. వర్షాలు సమృద్ధిగా కురియడంతో సాధారణం కంటే ఎక్కువ పంటలు సాగయ్యే వీలుందని అధికారులు అంచనా వేశారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో 76,903 ఎకరాలు ఆరుతడి పంటలు సాగులో ఉండగా 25018 వేల ఎకరాలు వరి పంట సాగు చేస్తున్నారు. సాగుకు తగ్గట్లుగానే అవసరం మేరకు ఎరువులను అందుబాటులో ఉంచేందుకు ప్రతిపాదనలను జిల్లా వ్యవసాయ అధికారులు పంపించారు. యూరియా ఎక్కువగా వినియోగిస్తున్నడంతో నియంత్రించేందుకు ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ ను ప్రవేశపెట్టారు.
పంటల సాగుకు తప్పనిసరి అయింది. సేంద్రియ వ్యవసాయంపై మొగ్గు చూపాలని ప్రభుత్వాలు, అధికారులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ సూచనలు చేస్తున్నా వాతావరణం పరిస్థితులు అందుకు అనుకూలించడం లేదు. దీంతో అన్నదాతలకు రసాయన ఎరువుల వినియోగం తప్పనిసరి అయిపోతుంది. అయితే రసాయన ఎరువులు ధరలు పెరగడంతో రైతులకు ఆర్థిక ఇబ్బందులు తప్పడం లేదు. యూరియా, డిఏపి మినహా మిశ్రమ ఎరువుల తయారీకి ముడి సరుకు అవసరం కాగా ఆ ముడి సరుకు విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్ లో వీటి ధరలు అధికంగా పెరగడంతో దేశంలోని ఎరువుల ధరలు అమాంతంగా పెరిగినట్లు ప్రచారం నడుస్తోంది.
గతంలో కాంప్లెక్స్ ధరల్లో ఎక్కువగా ఉండడంతో యూరియాను కలిపి అధిక మోతాదులో వినియోగించేవారు ఇప్పుడు యూరియాను ఎకరానికి రెండు బస్తాల చొప్పున మూడు దఫాలుగా ఆన్లైన్ లో బుక్ చేసుకుని పొందాల్సి ఉంటుంది. బహిరంగ మార్కెట్లో లభ్యతను నియంత్రించడంతో కాంప్లెక్స్ ఎరువులు అవసరం మేరకు వేయాల్సి ఉంటుంది. మరోవైపు వాటి ధరలు పెంచడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు యూరియా, డీఏపీలను మినహాయించి కాంప్లెక్స్ ఎరువుల ధరలను మాత్రమే పెంచారు. ఎకరాలు సాగు చేసే రైతులపై అదనంగా రో 4000 నుంచి 5000 వరకు అదనపు భారం పడనుంది. కాంప్లెక్స్ ఎరువుల్లో 20:20:0 బస్తా తక్కువ ధరతో ఉండడంతో యాసంగిలో రైతులు ఎక్కువగా వినియోగిస్తారు. ఇప్పుడు దీని ధరను సైతం పెరిగింది.
జనవరి,ఫిబ్రవరి నెలలో 50 రూపాయల చొప్పున 100 వరకు కాంప్లెక్స్ ఎరువుల బస్తాలపై ధర పెరిగింది.50 కిలోల 15.15.15 మిశ్రమ ఎరువు రబీ ప్రారంభంలో రూ.1,150 ఉండగా, ప్రస్తుతం రూ.1,650కి చేరింది. 20.20.13 కాంప్లెక్స్ ఎరువు (50 కిలోల బస్తా) రూ.1400 ఉండగా, ఇప్పుడు రూ.1500 పెరిగింది. 10.26.26 కాంప్లెక్స్ ఎరువు ధర రూ.1900 ఉండగా రూ.2,100కు చేరింది. 14.35.14 ఎరువు బస్తా రూ.1950 ఉండగా, ప్రస్తుతం రూ.2,150కు అమ్ముతున్నారు. రూ.1600 ఉన్న 16.16.16 ఎరువు రూ.1675కు చేరింది.
Also Read: Control Room: త్వరలో కోర్ అర్బన్ ఏరియాలో.. ఆరోగ్య సేవలపై స్పెషల్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు