E-Paper
Advertisement

Big tv kissik talks: అంతకంటే గొప్ప ప్రశంస ఏదీ లేదు.. నాగబాబుపై ఆది కామెంట్స్!

Big tv kissik talks: అంతకంటే గొప్ప ప్రశంస ఏదీ లేదు.. నాగబాబుపై ఆది కామెంట్స్!
Advertisement

Big tv kissik talks: బుల్లితెరపై ప్రసారం అవుతున్న కార్యక్రమాలలో జబర్దస్త్ కామెడీ షో (Jabardasth Comedy Show)ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకుంది. ఈ కార్యక్రమం ద్వారా ఎంతోమంది మంచి పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకొని ప్రస్తుత ఇండస్ట్రీలో హీరోలుగా దర్శకులుగా కమెడియన్లుగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ కార్యక్రమానికి మొదట్లో జడ్జెస్ గా రోజా, నాగబాబు వ్యవహరించారు. ఈ కార్యక్రమం ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో హైపర్ ఆది కూడా ఒకరు. ఈ కార్యక్రమంలో మొదట కమెడియన్ గా ఈయన పరిచయమైన అతి తక్కువ సమయంలోనే టీం లీడర్ గా మారిపోయారు. జబర్దస్త్ షో ద్వారా హైపర్ ఆదికి ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది.

హైపర్ ఆదికి ఆ అలవాటు లేదా?

ఇక హైపర్ ఆది ప్రస్తుతం జబర్దస్త్ షోకు దూరంగా ఉన్నప్పటికీ ఇతర బుల్లితెర కార్యక్రమాల ద్వారా సందడి చేస్తున్నారు. అలాగే వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. తాజాగా హైపర్ ఆది కిస్సిక్ టాక్స్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎన్నో విషయాలను వెల్లడించారు. ముఖ్యంగా ఆది గారు బ్రాండ్ ఏది అంటూ వర్షా అడగడంతో నాకు తాగే అలవాటు లేదని తెలిపారు.. నీళ్లు తాగడం వల్ల దప్పిక తీరుతుంది తినడం వల్ల ఆకలి తీరుతుంది కానీ తాగడం వల్ల ఏం తృప్తి కలుగుతుందో ఇప్పటివరకు ఎవరు చెప్పలేదు అందుకే నేను తాగలేదు అని తెలిపారు. కానీ సిట్టింగ్ వేసిన వాళ్ల దగ్గర మాత్రం కచ్చితంగా కూర్చుంటానని అక్కడ పెద్ద కంటెంట్ దొరుకుతుందని అది తెలిపారు.

కొంచెం గ్యాప్ ఇవ్వవయ్యా..

Advertisement

ఇలా తాను టీం లీడర్ అయిన తర్వాత నాలుగో స్కిట్ ఇలా తాగుబోతుల గురించి చేశానని ఆ సమయంలో నాగబాబు గారు విపరీతంగా నవ్వుకున్నారని తెలిపారు. తాగుబోతులు మందు పోసుకునేటప్పుడు ఒక సైంటిస్టులు లాగా బిహేవ్ చేస్తూ ఉంటారు అంటూ ఒక స్కిట్ చేసినప్పుడు నాగబాబు గారు ఆది కొంచెం గ్యాప్ ఇవ్వవయ్యా అంటూ మాట్లాడారు. అలాంటి ఒక గొప్ప వ్యక్తి నా కామెడీ విషయంలో కాస్త గ్యాప్ ఇవ్వని చెప్పడమే నాకు పెద్ద ప్రశంసలు. ఇంతకంటే ఇంకేం కావాలని ఆది తెలిపారు. ఇక ఈ కార్యక్రమంలో జడ్జిగా కొనసాగుతున్న రోజా గారు కూడా నా కామెడీకి విపరీతంగా నవ్వుకొని కలర్ పేపర్స్ తెప్పించి మరి చల్లుతూ ఎంజాయ్ చేశారని, కమెడియన్ గా తాను అక్కడే సక్సెస్ అయ్యాను అని అది తెలియచేశారు.

Advertisement

ఇలా జబర్దస్త్ ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్న ఆది ప్రస్తుతం శ్రీదేవి డ్రామా కంపెనీ, ఢీ డాన్స్ షో కార్యక్రమంలో సందడి చేస్తున్నారు. ఇక ఇటీవల సినిమాలపై పూర్తిస్థాయిలో ఫోకస్ పెట్టారని తెలుస్తుంది. ఎక్కువగా సినిమాలలో నటిస్తూ ఆది బిజీగా ఉన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆది తన ఫ్యామిలీ గురించి, కెరియర్ గురించి ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకున్నారు.

Also Read: Big tv kissik talks: పెళ్లిపై హైపర్ ఆది కామెంట్స్..  వాళ్లు మాత్రమే పెళ్లి చేసుకోండి.. క్లారిటీతో ఉన్నాడుగా!

Related News

Telugu Tv Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. ఆ ఒక్కటే మళ్లీ టాప్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి కొత్త టెన్షన్.. చింటును బాలు తెస్తాడా..? గుణ ప్లానేంటి..?

Podarillu Today Episode : నారాయణకు అడ్డంగా దొరికిన జమున.. కన్నా సీరియస్.. ఇదేం ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ మాటతో మీనాక్షి షాక్.. పల్లవికి మైండ్ బ్లాక్.. అరెస్ట్ చేస్తారా..?

Illu Illalu Pillalu Today Episodes: రెచ్చిపోయిన భాగ్యం.. రామరాజు మాస్ వార్నింగ్.. వల్లికి ఇంకో ఛాన్స్..

Sunday TV Movies : ఆదివారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. మస్ట్ వాచ్..

Nindu Noorella Saavasam Serial Today Episode October 18th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి కోల్‌ కతా వెళ్లడానికి వైజయంతి ఒప్పుకుంటుందా..?

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

Big Stories

Advertisement
×