E-Paper
Advertisement

KTR on CM Revanth: సీఎం రేవంత్ రాబందులా మారారు.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

KTR on CM  Revanth: సీఎం రేవంత్ రాబందులా మారారు.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Advertisement

KTR on CM Revanth: మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్లుగా రేవంత్ రెడ్డి ప్రవర్తన ఉంది అంటూ కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణ రాష్ట్రాన్ని సాధించేందుకు తన ప్రాణాలనే పణంగా పెట్టిన మహానాయకుడు కేసీఆర్ అని కేటీఆర్ అన్నారు. అలాంటి నాయకుడిపై పదే పదే అవమానకర వ్యాఖ్యలు చేస్తూ, ఆయన చావును కూడా కోరుకునే స్థాయికి రేవంత్ దిగజారారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రేవంత్ రెడ్డి రాబందు లాగా తయారయ్యారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Advertisement

కాంగ్రెస్ తీరు కొత్తదేమి కాదని, అప్పట్లో ఎన్టీఆర్ కాంగ్రెస్ నాయకులను అంగష్టమాత్రులు, కుక్కమూతి పిందెలు అంటూ విమర్శించేవారని  కేటీఆర్ గుర్తుచేశారు. అలాంటి కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు సీఎం రేవంత్ పూర్తిగా లొంగిపోయారని ఆరోపించారు. సమైక్య వాదుల బూట్లు పాలిష్ చెయ్యడానికి రేవంత్ రెడ్డి సిద్ధంగా ఉన్నాడు అంటూ తీవ్రంగా విమర్శించారు.

కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి లేదు, కేవలం పేల్చివేతలు, కూల్చివేతలు, ఎగవేతలే ఉన్నాయని కేటీఆర్ అన్నారు. మేడిగడ్డను పేల్చినట్ట్లే, తెలంగాణలో చెక్ డ్యాంలు కూడా పేల్చుతున్నారు అంటూ ఆయన విమర్శలు గుప్పించారు.. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.

Advertisement

అశోక్ నగర్‌లో విద్యార్థులకు ఇచ్చిన హామీలు నెరవేర్చనీ రాహుల్ గాంధీని.. ఉరి తీయాలి అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అందరి హక్కులను కాపాడాల్సిన స్పీకర్ కూడా ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తున్నారని మండిపడ్డారు.

సీఎం రేవంత్ రెడ్డికి IIT, IIIT కూడా తేడా తెలియదు అంటూ విమర్శించారు. రేవంత్ రెడ్డి పాలనలో చాలా మంది ప్రాణాలు కోల్పోయారని కేటీఆర్ తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. 830 మంది రైతులను పొట్టన పెట్టుకున్నారు. 100 మంది ఆటో డ్రైవర్లు, 100 మంది గురుకుల విద్యార్థులు ప్రాణాలు తీశారు అంటూ ఆయన తెలిపారు. దీనికి కారణం కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యమే అని ఆరోపించారు. నది జలాల్లో తెలంగాణకు అన్యాయం చేసిన వ్యక్తులకు వంత పాడుతున్నారు రేవంత్ రెడ్డి కేటీఆర్ ఆరోపించారు.

Related News

సీఎం హైదరాబాద్‌కు రాకముందే.. మంత్రి పదవికి కొండా సురేఖ రాజీనామా? కాసేపట్లో మీడియా ముందుకు..

హైదరాబాద్కు మంత్రి కొండా సురేఖ.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కీలక వ్యాఖ్యలు, ముగింపు ఎలా?

కేటీఆర్ వచ్చే వేళ మిర్యాలగూడలో పొలిటికల్ హీట్.. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య వార్!

ఢిల్లీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అవార్డ్స్ 2026.. సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ వైరల్!

యూట్యూబ్‌లో చూసి నకిలీ నోట్ల తయారీ.. కానీ చివరికి ఎలా చిక్కాడంటే..?

హుజూరాబాద్‌లో మళ్లీ కాకరేపుతున్న రాజకీయ వేడి.. కాంగ్రెస్ వైఫల్యాలపై కౌశిక్ రెడ్డి భారీగా ధర్నా!

క్రికెట్ గ్రౌండ్ కోసం చెరువు కబ్జా చేస్తారా.. పట్టించుకోని అధికారులు!

ఆయనకు అన్నీ ఆశలు, కోరికలే ఉన్నాయి.. కేటీఆర్‌పై జగ్గారెడ్డి షాకింగ్ కామెంట్స్!

Big Stories

Advertisement
×