E-Paper
Advertisement

Harish Rao: తెలంగాణకు మొదటి విలన్ కాంగ్రెస్.. హరీశ్‌రావు ఘాటు విమర్శలు

Harish Rao: తెలంగాణకు మొదటి విలన్ కాంగ్రెస్.. హరీశ్‌రావు ఘాటు విమర్శలు
Advertisement

Harish Rao: మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు హరీశ్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర హక్కులను కాలరాసిందే కాంగ్రెస్ పార్టీ అని విమర్శలు గుప్పించారు.

అసలు తెలంగాణను ఆంధ్రాలో కలిపి మరణ శాసనం రాసింది కాంగ్రెస్ పార్టీ అని హరీశ్ రావు ఆరోపించారు. ఫజల్ ఆలీ కమిషన్ తెలంగాణ ను ఆంధ్రాలో కల్పొద్దని చెప్పిన వినకుండా విలీనం కాంగ్రెస్ పార్టీ విలీనం చేసిందని విమర్శలు గుప్పించారు.

Advertisement

సిటీ కాలేజీలో విద్యార్థులు ఆందోళన చేస్తే.. కాల్పులు జరిపి వారి ప్రాణాలు తీసింది కాంగ్రెస్ అని పార్టీహరీశ్ రావు తెలిపారు. తెలంగాణ ప్రజలపై అణచివేత, నిర్లక్ష్యం కాంగ్రెస్ పాలనకు అలవాటేనని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ సొంత రాష్ట్రంగా ఉంటే పాలమూరు రంగారెడ్డి, ఇతర ప్రాజెక్టులు ఎప్పుడో పూర్తయ్యేవి అని అన్నారు.

నదీ జలాల విషయంలోనూ కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు.. తీవ్ర అన్యాయం చేసిందని హరీశ్ రావు విమర్శించారు. సెక్షన్ 84 అమలు చేసి నీటి విభజనలో తెలంగాణను మోసం చేశారని, కల్వకుర్తి, నెట్టెంపాడు వంటి కేవలం రెండు ప్రాజెక్టులనే 11వ షెడ్యూల్‌లో చేర్చిందని ఆయన తెలిపారు. పాలమూరు రంగారెడ్డి జిల్లాలకు అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ అని ఆరోపించారు.

Advertisement

నాడైనా, నేడైనా తెలంగాణకు నెంబర్ 1 విలన్ కాంగ్రెస్ పార్టీ అని హరీశ్ రావు విమర్శించారు. కేసీఆర్ నాయకత్వంలో పదేళ్ల పాటు కష్టపడి నిర్మించుకున్న సాగునీటి ప్రాజెక్టులను కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యం చేస్తోందని, ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టుపై రేవంత్ సర్కార్ కుట్రలు చేస్తోందని తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పించారు.

పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో 50 TMC ల నీటిని నిలుపుకునే అవకాశం ఉన్నా కూడా.. చిన్న కాలువ తియ్యలేక చేతకాని వ్యక్తి లాగా సీఎం రేవంత్ చేతులు కట్టుకుని ఉన్నాడని హరీశ్ రావు విమర్శించారు.

60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో కేవలం 42 లక్షల ఎకరాలకు మాత్రమే సాగునీటి స్థిరీకరణ జరిగిందని వివరించారు. అదే బీఆర్‌ఎస్ ప్రభుత్వం తొమ్మిదిన్నర ఏళ్ల కాలంలోనే 48 లక్షల ఎకరాలకు పైగా స్టేబులైజేషన్ చేసి చూపించిందని హరీశ్ రావు తెలిపారు.

Also Read: సీఎం రేవంత్ రాబందులా మారారు.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

2004 నుంచి 2014 వరకు పదేళ్ల కాంగ్రెస్ పాలనలో సంవత్సరానికి సగటున కేవలం.. 90,300 ఎకరాలకు మాత్రమే సాగునీటి స్థిరీకరణ జరిగిందని పేర్కొన్నారు. కానీ 2014 నుంచి 2023 వరకు కేసీఆర్ నాయకత్వంలో ప్రతి సంవత్సరం సగటున 3,31,578 ఎకరాలకు సాగునీటి స్థిరీకరణ జరిగిందని స్పష్టం చేశారు. ఈ గణాంకాలే ఎవరు రైతుల పక్షపాతులు, ఎవరు తెలంగాణ ద్రోహులో ప్రజలకు అర్థమయ్యేలా చెబుతున్నాయని హరీశ్ రావు తెలిపారు.

Related News

అనిరుధ్ – కావ్యా మారన్ పెళ్లి రిసెప్షన్.. సీఎం రేవంత్, కేటీఆర్‌కు ఆహ్వానం!

ఎల్‌నినో ఎఫెక్ట్‌.. తెలుగు రాష్ట్రాలకు రానున్న అతిపెద్ద గండం ఇదే?

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వింత దృశ్యం.. మిరప తోటల్లో సినీ తారల ఫ్లెక్సీలు!

కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు!

నకిలీ యూఎల్‌సీ పత్రాలతో రిజిస్ట్రేషన్లు దందా కలకలం

తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం.. మారనున్న ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు!

తెలంగాణలో హ్యుందాయ్ బిగ్ ప్లాన్.. రూ.8,528 కోట్లతో మెగా ప్రాజెక్ట్.. సీఎం రేవంత్ కీలక విజ్ఞప్తి!

నీ డేటా మొత్తం నా దగ్గర ఉంది పరేషాన్ కాకు.. కేటీఆర్‌ పై గజ్జెల కాంతం ఫైర్!

Big Stories

Advertisement
×