E-Paper
Advertisement

Big tv kissik Talks: ఇంద్రజ అసలు పేరు ఇది కాదా… ఈ పేరు వెనుక అంత కథ ఉందా?

Big tv kissik Talks: ఇంద్రజ అసలు పేరు ఇది కాదా… ఈ పేరు వెనుక అంత కథ ఉందా?
Advertisement

Big tv kissik Talks: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా ప్రేక్షకులకు ఎంతో సుపరిచితమైన వారిలో సీనియర్ నటి ఇంద్రజ(Indraja) ఒకరు. ఈమె యమలీల సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ గా పరిచయమయ్యారు. అయితే హీరోయిన్ గా ప్రేక్షకుల ముందుకు రావడానికి అంటే ముందుగా పలు సినిమాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా పలువురు హీరోలకు చెల్లెలు పాత్రలో కూడా నటించారని తెలుస్తుంది. ఇలా చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన ఇంద్రజ అనంతరం తెలుగు ప్రేక్షకుల ముందుకు యమలీల సినిమా ద్వారా హీరోయిన్గా పరిచయమయ్యారు. ఈ సినిమా తర్వాత పలు సినిమాలలో హీరోయిన్ గా నటిస్తూ ఇండస్ట్రీలో మంచి సక్సెస్ అందుకున్నారు.

సెకండ్ ఇన్నింగ్స్ లో బిజీగా ఇంద్రజ..

ఇలా సీనియర్ హీరోయిన్లతో పాటు హీరోయిన్ గా అవకాశాలు అందుకుంటూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నా ఇంద్రజ ఉన్న ఫలంగా సినిమా ఇండస్ట్రీకి దూరమయ్యారు. అయితే పెళ్లి చేసుకోవడం వల్ల ఇండస్ట్రీకి దూరమయ్యానని తెలుస్తుంది. ఇక తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన సమయంలోనే తన తల్లిగారు చనిపోవడంతో మరి కాస్త బ్రేక్ పడిందని ఇప్పుడు వరుస సినిమాలు టీవీ షోలతో బిజీగా ఉన్నారు. తాజాగా ఇంద్రజ బిగ్ టీవీ కిస్సిక్ టాక్స్ (Big tv kissik Talks)కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈమె తన వ్యక్తిగత విషయాలతో పాటు వృత్తిపరమైన విషయాల గురించి అభిమానులతో పంచుకున్నారు.

జంతర్ మంతర్ డైరెక్టర్..

Advertisement

ఈ క్రమంలోనే తన అసలు పేరును కూడా ఈ సందర్భంగా బయటపెట్టారు. వర్ష హాయ్ రజిత గారు అంటూ పిలవడంతో నా పేరు రజిత కాదని రజాతి (Rajaathi)అంటూ తన అసలు పేరును బయటపెట్టారు. తన అసలు పేరు ఇదేనని కానీ తాను సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఇంద్రజగా పేరు పెట్టారని తెలిపారు. తాను మొదట హీరోయిన్ గా చేసిన సినిమా జంతర్ మంతర్(Jantar Mantar). కొన్ని కారణాల వల్ల ఈ సినిమా విడుదల ఆలస్యంగా అయింది. ఈ సినిమా డైరెక్టర్ భరత్ (Bharath)తన క్యారెక్టర్ పేరు ఇంద్రజగా రాశారు ఇక పూజా కార్యక్రమాలు అయిపోయి కథ నేరేడ్ చేసేటప్పుడు అందులో నా పాత్రకు సంబంధించిన సీన్స్ అన్నిటిని కూడా ఇంద్రజ అనే పేరుతో రాసేశారు. అందుకే ఇంద్రజగా పేరు పడిపోయిందని ఈమె అసలు విషయం తెలియజేశారు.

Advertisement

ఇక నా పేరు మార్చుకుందామని చెప్పడంతో మా నాన్న ఎందుకులే ఇదే కంటిన్యూ అవ్వు బాగుంది అంటూ చెప్పడంతో అందరికీ ఇంద్రజగా పరిచయం అయ్యానని తెలిపారు. ఇంద్రజ అసలు పేరు రజాతి అనే విషయం తెలియడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇక ప్రస్తుతం ఈమె వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు నాలుగు సినిమాలు షూటింగ్ జరుగుతున్నాయని అలాగే టీవీ షోలతో చాలా బిజీగా ఉన్నానని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇంద్రజ శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంతో పాటు, జబర్దస్త్ కార్యక్రమానికి జడ్జిగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.

Related News

సింగర్ అంతడుపుల రమాదేవి ఒక్క పాటకు ఎంత తీసుకుంటారో తెలుసా?

Telugu Tv Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. ఆ ఒక్కటే మళ్లీ టాప్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి కొత్త టెన్షన్.. చింటును బాలు తెస్తాడా..? గుణ ప్లానేంటి..?

Podarillu Today Episode : నారాయణకు అడ్డంగా దొరికిన జమున.. కన్నా సీరియస్.. ఇదేం ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ మాటతో మీనాక్షి షాక్.. పల్లవికి మైండ్ బ్లాక్.. అరెస్ట్ చేస్తారా..?

Illu Illalu Pillalu Today Episodes: రెచ్చిపోయిన భాగ్యం.. రామరాజు మాస్ వార్నింగ్.. వల్లికి ఇంకో ఛాన్స్..

Sunday TV Movies : ఆదివారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. మస్ట్ వాచ్..

Nindu Noorella Saavasam Serial Today Episode October 18th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి కోల్‌ కతా వెళ్లడానికి వైజయంతి ఒప్పుకుంటుందా..?

Big Stories

Advertisement
×