E-Paper
Advertisement

సక్సెస్ ను ఎంజాయ్ చేయలేకపోయాను…నల్లగా పుట్టమే నాకు వరమైంది: ఫైమా

సక్సెస్ ను ఎంజాయ్ చేయలేకపోయాను…నల్లగా పుట్టమే నాకు వరమైంది: ఫైమా
Advertisement

Big Tv Kissik Talks: జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఫైమా ప్రస్తుతం శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంతో పాటు జబర్దస్త్ కార్యక్రమం అలాగే ఢీ కార్యక్రమంలో మెంటర్ గా కూడా కొనసాగుతూ ఉన్నారు. ఇలా కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న ఫైమా తాజాగా బిగ్ టీవీ కిస్సిక్ టాక్స్ (Big tv kissik talks)కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈమె తన కెరియర్ కు సంబంధించిన విషయాలను అలాగే తన గురించి వచ్చిన నెగిటివ్ కామెంట్ లపై స్పందిస్తూ ఎమోషనల్ అయ్యారు. నిజానికి తాను ఇండస్ట్రీలోకి రావడానికి తన తల్లిదండ్రులు ఒప్పుకోలేదని కాకపోతే నా బలవంతం మీద వారిని ఒపించి వచ్చానని తెలిపారు.

సక్సెస్ రాగానే నెగిటివ్ కామెంట్లు..

పటాస్ కార్యక్రమంలో తాను మొదట చేశానని అయితే అందులో ఒక ప్రోమో ద్వారానే నాకు మంచి ఫేమ్ వచ్చిందని తెలిపారు. ఇక వర్ష ప్రశ్నిస్తూ ఎప్పుడైనా అలా ఉన్నావ్ ,ఇలా ఉన్నావ్ అంటూ ఎవరైనా ఏదైనా అన్నారా అంటూ ప్రశ్న వేశారు. ఈ ప్రశ్నకు ఫైమా సమాధానం చెబుతూ తాను ఇండస్ట్రీలోకి రాకముందు వరకు కూడా చాలా సంతోషంగా ఉన్నానని ఎవరు కూడా నా రంగు గురించి నా పోలికల గురించి కామెంట్లు చేయలేదు కానీ ఇండస్ట్రీలోకి వచ్చిన తరువాత ఎప్పుడైతే నాకు సక్సెస్ వచ్చిందో ఆ క్షణం నుంచి తాను నెగిటివ్ కామెంట్లను ఎదుర్కోవాల్సి వచ్చిందని తెలిపారు.

ఎందుకమ్మా నల్లగా కన్నావు..

Advertisement

చాలామంది వుయ్ వాంట్ ఫైమా అంటూ అనడంతో అసలు దీంట్లో ఏముంది ఇంత గలీజ్ గా ఉంది నల్లగా ఉంది అంటూ చాలామంది బ్యాడ్ కామెంట్స్ పెట్టారు. అలా బ్యాడ్ కామెంట్స్ చూసిన తర్వాత నాలో ఉన్న కాన్ఫిడెన్స్ మొత్తం పోయిందని, తర్వాత ఏం చేసిన ఇలాంటి కామెంట్లు చేస్తారనే బాధ ఎక్కువగా ఉండేదని తెలిపారు. ఇలా నా కలర్ గురించి కామెంట్లు రావడంతో మా అమ్మకు ఫోన్ చేసి ఎందుకమ్మా నన్ను నల్లగా కన్నావు అంటూ అడగడంతో అమ్మ ఘోరంగా ఏడ్చిందని తెలిపారు. ఇలా నా గురించి నెగిటివ్ కామెంట్లు వచ్చినప్పటికీ మొదట్లో బాధపడ్డాను తర్వాత వాటిని పట్టించుకోవడం మానేశాను.

Advertisement

ఇలా ఎప్పుడైతే నెగిటివ్ కామెంట్స్ పట్టించుకోలేదో నాలో నాకు తెలియని కాన్ఫిడెన్స్ వచ్చింది ఇంకా ఎంతో ఉత్సాహంగా పనిచేస్తున్నానని తెలిపారు. ఇలా నెగటివ్ కామెంట్ల కారణంగా నేను నాకు వచ్చిన సక్సెస్ కూడా ఎంజాయ్ చేయలేకపోయానని ఫైమా తెలిపారు. మరి ఇప్పుడు ఎలా ఫీలవుతున్నావు అంటూ మరో ప్రశ్న వేయడంతో ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నానని, నేను నల్లగా పుట్టినందుకు ఇంకా ఆనందంగా ఉందని తెలిపారు. చాలా అందంగా, గ్లామర్ గా ఉండి ఉంటే కామెడీ చేసే దాన్ని కాదు అప్పుడు నా దగ్గర అందం తప్ప మరేది ఉండేది కాదు అందుకే ఇది నాకు ప్లస్ అయింది. ఏదైతే నేను మైనస్ అనుకున్నానో అదే ప్లస్ అయిందని, మనకు అందం కాదు, మన టాలెంట్ ముఖ్య అంటూ ఫైమా ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Also Read: నాగబాబు జడ్జిమెంట్ పై ఫైమా షాకింగ్ కామెంట్స్… పాపం ఇంద్రజ!

Related News

Telugu Tv Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. ఆ ఒక్కటే మళ్లీ టాప్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి కొత్త టెన్షన్.. చింటును బాలు తెస్తాడా..? గుణ ప్లానేంటి..?

Podarillu Today Episode : నారాయణకు అడ్డంగా దొరికిన జమున.. కన్నా సీరియస్.. ఇదేం ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ మాటతో మీనాక్షి షాక్.. పల్లవికి మైండ్ బ్లాక్.. అరెస్ట్ చేస్తారా..?

Illu Illalu Pillalu Today Episodes: రెచ్చిపోయిన భాగ్యం.. రామరాజు మాస్ వార్నింగ్.. వల్లికి ఇంకో ఛాన్స్..

Sunday TV Movies : ఆదివారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. మస్ట్ వాచ్..

Nindu Noorella Saavasam Serial Today Episode October 18th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి కోల్‌ కతా వెళ్లడానికి వైజయంతి ఒప్పుకుంటుందా..?

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

Big Stories

Advertisement
×