E-Paper
Advertisement

నాగబాబు జడ్జిమెంట్ పై ఫైమా షాకింగ్ కామెంట్స్… పాపం ఇంద్రజ!

నాగబాబు జడ్జిమెంట్ పై ఫైమా షాకింగ్ కామెంట్స్… పాపం ఇంద్రజ!
Advertisement

Big Tv Kissik Talks: బిగ్ టీవీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కిస్సిక్ టాక్స్ (Kissik Talks)కార్యక్రమానికి ఎంతో మంచి ఆదరణ లభిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎంతో మంది సెలబ్రిటీలు ఈ కార్యక్రమంలో పాల్గొని వారికి సంబంధించిన ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ వారం ఈ కార్యక్రమంలో భాగంగా జబర్దస్త్ కమెడియన్ ఫైమా (Faima)పాల్గొని సందడి చేశారు. ఇక ఈమె జబర్దస్త్ ద్వారా మంచి సక్సెస్ కావడంతో జబర్దస్త్ కార్యక్రమానికి సంబంధించి పలు ఆసక్తికరమైన విషయాలను అభిమానులతో పంచుకున్నారు. ముఖ్యంగా జబర్దస్త్ జడ్జెస్ గురించి ఈమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

పటాస్ కార్యక్రమంతో బుల్లితెర ఎంట్రీ..

ఫైమా పటాస్ కార్యక్రమం ద్వారా బుల్లితెరకు పరిచయమయ్యారు .ఈ కార్యక్రమం ద్వారా తన పెర్ఫార్మన్స్ తో అందరిని మెప్పించిన ఫైమా అనంతరం జబర్దస్త్(Jabardasth) కార్యక్రమంలో అవకాశం అందుకున్నారు. ఇలా లేడీ కమెడియన్ గా కొనసాగుతున్న ఈమె మరో అడుగు ముందుకు వేస్తూ ప్రస్తుతం మెంటర్ గా కొనసాగుతున్నారు. జబర్దస్త్ కార్యక్రమంలో తనకు బుల్లెట్ భాస్కర్ ఎంతో మంచి ప్రోత్సాహం కల్పించారని తెలిపారు.. ఇకపోతే జబర్దస్త్ కార్యక్రమంలో జడ్జెస్ గా వ్యవహరించిన నాగబాబు(Nagababu) ఇంద్రజ(Indraja) గురించి కూడా ప్రశ్నలు ఎదురయ్యాయి.

నాగబాబు గారిని చూసి భయపడ్డాను..

Advertisement

నాగబాబు ఈ కార్యక్రమానికి మొదట జడ్జిగా కొనసాగిన సంగతి తెలిసిందే. కొన్ని సంవత్సరాలు పాటు జడ్జిగా ఉన్న ఈయన అప్పట్లో కమెడియన్లకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చేవారు. ఇలా కొన్ని కారణాల వల్ల నాగబాబు తప్పుకోవడంతో ఈ కార్యక్రమానికి ప్రస్తుతం కృష్ణ భగవాన్ కొనసాగుతున్నారు. ఇక ఇంద్రజ కూడా జబర్దస్త్ కార్యక్రమంలో జడ్జిగా కొనసాగుతూ తనదైన శైలిలో జడ్జిమెంట్ ఇస్తూ ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఫైమాకు వర్ష ప్రశ్న వేస్తూ.. నాగబాబు గురించి అడగడంతో నాగబాబు గారి ముందు స్కిట్ చేయాలంటే మొదట భయపడ్డాను కానీ నాగబాబు గారు చాలా మంచిగా ఎంకరేజ్ చేస్తారని తెలిపారు.

Advertisement

మరి జబర్దస్త్ జడ్జెస్ గా నీకు నాగబాబు గారు ఇష్టమా లేకుంటే ఇంద్రజ గారు ఇష్టమా అంటూ ప్రశ్న ఎదురయింది. ఈ ప్రశ్నకు ఫైమా సమాధానం చెబుతూ రెండు కళ్ళల్లో ఏది ఇష్టం అంటే ఏం చెప్పగలం.. వారిద్దరూ నాకు రెండు కళ్ళతో సమానం అంటూ తనదైన శైలిలోనే సమాధానం ఇచ్చారు. ఇక ఇంద్రజ గారు తిరిగి ఈ షోలో పాల్గొనటం సంతోషంగా ఉందని పైమా తెలిపారు. ఇక ఈ కార్యక్రమంలో ఫైమా జబర్దస్త్ గురించి మాత్రమే కాకుండా తన వ్యక్తిగత విషయాలు అలాగే తన కెరియర్ గురించి కూడా పలు ఆసక్తికరమైన విషయాలను అభిమానులతో పంచుకున్నారు.

Also Read: రణబాలి సెట్ లో విరోష్ వెడ్డింగ్ సెలబ్రేషన్స్… ఫోటోలు వైరల్!

Related News

Telugu Tv Serials : ఈ వారం సీరియల్స్ రౌండప్.. టాక్ ఆఫ్ ది సీరియల్ ఏదంటే..?

ఇంద్రజకు ఒక్కరోజు రెమ్యూనరేషన్ ఎన్ని లక్షలో తెలుసా..? సినిమా కన్నా ఎక్కువే..

Gundeninda GudiGantalu Today episode: సంబరాలు చేసుకున్న ప్రభా.. చింతామణి కుట్ర తెలిసిపోతుందా..? బాలుకు షాక్..

Podarillu Today Episode : విగ్నేశ్వరి దెబ్బకు మహా ఫ్యూజుల్ అవుట్.. మహా కోసం సర్ప్రైజ్ ప్లాన్.. నిజం తెలిసిపోతుందా..?

Intinti Ramayanam Today Episode: అయ్యో పాపం శ్రీయ.. పల్లవి నగలను కొట్టేసిందా..? అక్షయ్ సీరియస్..

Illu Illalu Pillalu Today Episodes: ధీరజ్ కు షాక్.. వల్లి ఫిట్టింగ్ అదిరిపోయింది.. నెక్స్ట్ ఏం జరుగుతుంది..?

Sunday Movies in Tv : ఆదివారం టీవీ సినిమాలు.. మాస్ ఫ్యాన్స్ కు పునకాలే..

Nindu Noorella Saavasam Serial Today Episode July 18th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్లాన్ ప్రకారం బుజ్జమ్మ చంపాలనుకున్న ప్రచండ

Big Stories

Advertisement
×