E-Paper
Advertisement

Big tv Kissik Talks: మల్లెమాల అమ్మలాంటిది… విమర్శిస్తే పుట్టగతులు ఉండవు..

Big tv Kissik Talks: మల్లెమాల అమ్మలాంటిది… విమర్శిస్తే పుట్టగతులు ఉండవు..
Advertisement

Big tv Kissik Talks: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్యక్రమాలలో జబర్దస్త్ (Jabardasth) కార్యక్రమానికి ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ కార్యక్రమాల ద్వారా ఎంతో మంది ఇండస్ట్రీకి కమెడియన్లుగా పరిచయం అవుతూ ప్రస్తుతం ఇండస్ట్రీలో హీరోలుగా నిర్మాతలుగా దర్శకులుగా కూడా కొనసాగుతూ బిజీగా ఉన్నారు. ఇలా మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ ద్వారా ఎప్పటికప్పుడు సరికొత్త కార్యక్రమాలు ప్రేక్షకుల ముందుకు వస్తూ ప్రేక్షకులను సందడి చేయడమే కాకుండా ఎంతోమందికి మంచి జీవితాన్ని కూడా ఇచ్చింది. ఇలా మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో జబర్దస్త్ నరేష్(Naresh) కూడా ఒకరు.

జబర్దస్త్ ఎప్పటికి ఆగిపోదు..

తాజాగా నరేష్ కిస్సిక్ టాక్స్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా జబర్దస్త్ గురించి మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్(Mallemaala entertainment) గురించి ఈయన చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. గత కొద్ది రోజులుగా జబర్దస్త్ కార్యక్రమం అనుకున్న స్థాయిలో సక్సెస్ అందుకోలేదని అందుకే ఈ షోని నిలిపి వేస్తున్నారు అంటూ వార్తలు వచ్చాయి. ఈ వార్తలు పై కూడా నరేష్ స్పందించారు. జబర్దస్త్ ఆగిపోతుంది అంటూ వచ్చే వార్తలలో నిజం లేదని జబర్దస్త్ కొనసాగుతూనే ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెబుతావు నరేష్ అంటూ వర్షా ప్రశ్నించారు.

కొత్త టాలెంట్ ను ప్రోత్సహిస్తుంది..

Advertisement

ఈ ప్రశ్నకు నరేష్ సమాధానం చెబుతూ మల్లెమాల అమ్మ లాంటిది. ఎంతోమంది కొత్తవారికి మంచి జీవితాన్ని అందించింది. ఒకవేళ మల్లెమాల కంపెనీ నుంచి ఎవరైనా బయటికి వెళ్లిపోయిన వారిని పిలిపించుకొని మరి తిరిగి అవకాశాలు ఇస్తుందని, కొత్త టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తుందని, నిజంగానే ఒక అమ్మ లాంటిది అంటూ నరేష్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.. అయితే చాలామంది జబర్దస్త్ ద్వారా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకొని బయటకు వెళ్లి ఈ కార్యక్రమం పై విమర్శలు చేస్తుంటారు అలాంటి వారిపై నీ అభిప్రాయం ఏంటి అంటూ వర్షా ప్రశ్నించారు.

Advertisement

జబర్దస్త్ ద్వారా మంచి పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకొని ఇప్పుడు బయటకు వెళ్లి ఈ షో గురించి మాట్లాడే హక్కు లేదని,అయిన మాట్లాడుతున్నారు అంటే అది పూర్తిగా వారి విజ్ఞతకే వదిలేస్తున్నాను అంటూ నరేష్ పరోక్షంగా ఈ కార్యక్రమాన్ని విమర్శించిన వారికి పుట్టగతులు ఉండవని చెప్పకనే చెప్పేశారు. అయితే జబర్దస్త్ ద్వారా సక్సెస్ అందుకొని బయటకు వచ్చి ఈ కార్యక్రమం పై విమర్శలు చేసిన వారిలో కిరాక్ ఆర్పీ ముందు వరుసలో ఉంటారు. ఈయన జబర్దస్త్ షో గురించి మల్లెమాల ఎంటర్టైన్మెంట్ గురించి చాలా దారుణంగా మాట్లాడుతూ గతంలో రచ్చ చేశారు. ఇక నరేష్ కూడా పరోక్షంగా ఆర్పీ గురించే ఈ వ్యాఖ్యలు చేశారని స్పష్టమవుతుంది.

Also Read: Big tv Kissik Talks: కాబోయే భార్యపై నరేష్ కామెంట్స్.. ఇన్ని క్వాలిటీస్ ఉండాలా?

Related News

చీరకట్టులో శివజ్యోతి..ఆ భారీ హారం చూస్తే మతిపోవాల్సిందే!

ఈశ్వర్ సాయి కేసులో కొత్త ప్రశ్న.. ‘పెళ్లైనోడిని ఎలా నమ్మావ్ మాధురి?’

స్టార్ హీరోల సినిమాల కంటే సీరియల్స్‌కే ఎక్కువ క్రేజ్.. అసలు సీక్రెట్ ఏంటి?

పిచ్చి కుక్కల్లా మొరగండి… ట్రోలర్స్ కు కౌంటర్ ఇచ్చిన శిరీష!

నాని ఫోక్ సాంగ్ తో అదరగొట్టేసిన శ్రీముఖి.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode September 2nd  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పార్థును చంపేందుకు రెడీగా ఉన్న రౌడీలు

Godavari Janu : హాట్ లుక్ లో రెచ్చగొడుతున్న నిత్య.. కుర్రాళ్ళు తట్టుకోలేరమ్మ..!

Gundeninda GudiGantalu Today episode: బాలుకు షాకిచ్చిన నీలకంఠం.. కన్నీళ్లు పెట్టుకున్న మౌనిక.. పాపం బాలు..

Big Stories

Advertisement
×