E-Paper
Advertisement

Big tv Kissik Talks: కాబోయే భార్యపై నరేష్ కామెంట్స్.. ఇన్ని క్వాలిటీస్ ఉండాలా?

Big tv Kissik Talks: కాబోయే భార్యపై నరేష్ కామెంట్స్.. ఇన్ని క్వాలిటీస్ ఉండాలా?
Advertisement

Big tv Kissik Talks: జబర్దస్త్ కార్యక్రమం ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్న కమెడియన్ పొట్టి నరేష్ (Naresh)తాజాగా కిస్సిక్ టాక్స్(Kissik Talks) కార్యక్రమంలో పాల్గొని సందడి చేశారు. ఈ కార్యక్రమం ద్వారా ఈయన తన పెళ్లి గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు నరేష్ పొట్టిగా ఉన్న నేపథ్యంలో తనకు పెళ్లి కాదంటూ జబర్దస్త్ స్కిట్ లలో తనపై పెద్ద ఎత్తున పంచ్ డైలాగులు వేస్తూ ఉంటారు. అయితే తనకు కూడా పెళ్లి వయసు వచ్చిందని త్వరలోనే పెళ్లి కూడా చేసుకుంటాను అంటు తాజాగా నరేష్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అయితే పెళ్లికి సంబంధించిన ప్రస్తావన రావడంతో నరేష్ తనని పెళ్లి చేసుకోబోయే అమ్మాయి గురించి, తనలో ఉండాల్సిన క్వాలిటీస్ గురించి ఈ సందర్భంగా తెలియజేశారు.

తనకంటే ఒక్క అడుగు ఎత్తు ఉండాలి..

చిన్నప్పటినుంచి తన తల్లిదండ్రులు ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు . ఇకపై ఆ కష్టాలు వారికి ఉండకూడదని తాను కోరుకుంటున్నట్లు నరేష్ తెలిపారు. ఈ క్రమంలోనే తాను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి తనకంటే ఒక అడుగు ఎత్తు ఉండాలని, మంచి మనసున్న అమ్మాయి అయితే చాలని తెలిపారు. అలాగే తనని పెళ్లి చేసుకున్న అమ్మాయి నా తల్లిదండ్రులను మంచిగా చూసుకోవాలని ఈయన కోరుకున్నారు. ఇక తాను పెళ్లి చేసుకోబోయే అమ్మాయికి నేనే ఎదురు కట్నం ఇచ్చి పెళ్లి చేసుకుంటానని, నాకు ఎలాంటి కట్నం కానుకలు కూడా వద్దని నరేష్ ఈ సందర్భంగా పెళ్లి గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

పెళ్లిపై ఫుల్ క్లారిటీతో ఉన్న నరేష్…

Advertisement

ఇక నరేష్ అలవాట్లు గురించి కూడా వర్ష ప్రశ్నించారు తనకు స్మోకింగ్ డ్రింకింగ్ వంటి అలవాట్లు ఏమీ లేవని క్లారిటీ ఇచ్చారు. ఒకవేళ నువ్వు చేసుకునే అమ్మాయికి ఇలాంటి అలవాట్లు ఉంటే ఏం చేస్తావ్ అంటూ ప్రశ్న రావడంతో అలాంటి అలవాట్లు మంచిది కాదని సర్ది చెప్పుకుంటానని ఈ సందర్భంగా నరేష్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. మరి పెళ్లి గురించి చేసుకోబోయే అమ్మాయి గురించి ఫుల్ క్లారిటీతో ఉన్న నరేష్ ను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎవరో తెలియాల్సి ఉంది.

Advertisement

ఇకపోతే నరేష్ కు పెళ్లి సెట్ అయింది అంటూ ఇటీవల బుల్లెట్ భాస్కర్ తెలిపారు ఈ వార్తల పట్ల కూడా నరేష్ స్పందించారు. ఆ వార్తలలో ఏ మాత్రం నిజం లేదని అవన్నీ స్కిట్ కోసం మాత్రమే చేస్తామని ప్రస్తుతం తన ఇంకా సంబంధాలు చూస్తున్నారని తెలిపారు. ఇలా ఫ్యూచర్ గురించి నరేష్ ఫుల్ క్లారిటీతో ఉన్నారని కూడా స్పష్టమవుతుంది దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అంటారు అలాగే తనకు అవకాశాలు వస్తున్నప్పుడే సంపాదించుకుంటున్నారని ఎప్పుడైతే సినిమా అవకాశాలు రాకుండా ఉంటాయో ఆ క్షణం తాను చిన్న బిజినెస్ చేసుకొని బ్రతుకుతానని లైఫ్ గురించి కూడా ఫుల్ క్లారిటీ ఇచ్చారు. ఒకప్పుడు నా కుటుంబం ఎన్నో కష్టాలను ఎదుర్కొంది తిరిగి ఆ కష్టాలలోకి నేను వెళ్లకూడదని అనుకుంటున్నాను అంటూ నరేష్ చేసిన ఈ వ్యాఖ్యలు అందరిని ఆకట్టుకుంటున్నాయి.

Also Read: Big tv kissi Talks: ప్రభాస్ హీరోయిన్ తో లిప్ కిస్…ఈ కమెడియన్ కోరికలు మామూలుగా లేవుగా!

Related News

చీరకట్టులో శివజ్యోతి..ఆ భారీ హారం చూస్తే మతిపోవాల్సిందే!

ఈశ్వర్ సాయి కేసులో కొత్త ప్రశ్న.. ‘పెళ్లైనోడిని ఎలా నమ్మావ్ మాధురి?’

స్టార్ హీరోల సినిమాల కంటే సీరియల్స్‌కే ఎక్కువ క్రేజ్.. అసలు సీక్రెట్ ఏంటి?

పిచ్చి కుక్కల్లా మొరగండి… ట్రోలర్స్ కు కౌంటర్ ఇచ్చిన శిరీష!

నాని ఫోక్ సాంగ్ తో అదరగొట్టేసిన శ్రీముఖి.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode September 2nd  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పార్థును చంపేందుకు రెడీగా ఉన్న రౌడీలు

Godavari Janu : హాట్ లుక్ లో రెచ్చగొడుతున్న నిత్య.. కుర్రాళ్ళు తట్టుకోలేరమ్మ..!

Gundeninda GudiGantalu Today episode: బాలుకు షాకిచ్చిన నీలకంఠం.. కన్నీళ్లు పెట్టుకున్న మౌనిక.. పాపం బాలు..

Big Stories

Advertisement
×