Big Tv Kissik Talks: బిగ్ టీవీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కిస్సిక్ టాక్స్ (Kissik Talks)కార్యక్రమంలో భాగంగా ప్రతివారం సెలబ్రిటీలు పాల్గొంటూ సందడి చేస్తుంటారు. ఈ నేపథ్యంలోనే ఈ వారం ఈ కార్యక్రమంలో భాగంగా బిగ్ బాస్ సీజన్ 10 (Bigg Boss 10)కంటెస్టెంట్ మిథిలేష్ రెడ్డి (Mithilesh Reddy)పాల్గొన్నారు . ఈయన బిగ్ బాస్ కార్యక్రమంలో కేవలం రెండు రోజులు మాత్రమే పాల్గొన్నారు. ఈయన హౌస్ లో ఉన్నది కేవలం రెండు రోజులు అయినప్పటికీ విపరీతమైన సొంతం చేసుకున్నారు. ఇలా మిథిలేష్ ఈ స్థాయిలో సొంతం చేసుకోవడానికి కారణం ఈయన 15 లక్షల రూపాయల క్యాష్ తో బయటకు రావడమే కారణమని చెప్పాలి.
బిగ్ బాస్ 10 హౌస్ లోకి వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చిన మిథిలేష్ రెండు రోజులపాటు హౌస్ లో ఉన్నారు అయితే బిగ్ బాస్ మాత్రం 15 లక్షల రూపాయల(Rs. 15 Lakhs ) సూట్ కేస్ ముందు పెట్టి ఈ డబ్బు తీసుకొని ఇప్పుడే బయటకు రావాలనుకున్నవారు ఎలిమినేట్ అవ్వచ్చు అంటూ ఆఫర్ ఇవ్వడంతో మిథిలేష్ ఏమాత్రం ఆలోచించకుండా 15 లక్షల రూపాయల సూట్ కేస్ తో హౌస్ నుంచి బయటకు వచ్చారు. ఇలా రెండు రోజులకు ఈయన 15 లక్షల రూపాయలు తీసుకోవడంతో సోషల్ మీడియాలో ఎన్నో రకాల కామెంట్లు వచ్చాయి.
ఈ నేపథ్యంలోనే తాజాగా మిథిలేష్ రెడ్డి కిస్సిక్ టాక్స్ కార్యక్రమంలో పాల్గొనడంతో వర్ష ఇదే విషయం గురించి మాట్లాడుతూ.. మీరు ఇలా 15 లక్షల రూపాయలు తీసుకురావడంతో మీరు బయట ఎలాంటి సిచువేషన్ ఫేస్ చేశారు అలాగే సోషల్ మీడియాలో వచ్చిన ట్రోల్స్ పై రియాక్షన్ ఏంటి అంటూ ప్రశ్న వేశారు. ఈ ప్రశ్నకు మిథిలేష్ సమాధానం చెబుతూ.. తాను 15 లక్షల రూపాయలు తీసుకోవడంతో సోషల్ మీడియాలో చాలా ఫన్నీ రీల్స్ వచ్చాయని తెలిపారు. తాను ఒక రీల్ చూసానని అందులో ఆయన నా గుండు మీద ఒట్టేసి చెబుతున్న మిథిలేష్ బిగ్ బాస్ కి బాస్ అంటూ కామెంట్ చేయడం చూసి తను చాలా నవ్వుకున్నానని తెలిపారు.
ఇక ఇంకొక వీడియోలో ఒక మహిళ తాను 15 లక్షలు తీసుకోవడం గురించి మాట్లాడుతూ బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చాడు..చొక్కా విప్పాడు.. 15 లక్షలు పట్టుకెళ్లాడు అంటూ రీల్స్ చేశారు. నేను ఏంటో తన ఇంట్లో డబ్బులు తీసుకెళ్లినట్టు ఆమె మాట్లాడింది అంటూ మిథిలేష్ తెలిపారు. ఇక బిగ్ బాస్ నుంచి బయటకు వెళ్లిన తర్వాత ఒక వ్యక్తి తనతో మాట్లాడుతూ తాను ఇన్ని సీజన్లు చూశాను బ్రో ఎవరూ కూడా ఇలా చేయలేదు బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన వారిలో స్మార్ట్ టెస్ట్ కంటెస్ట్ అంటూ తనతో మాట్లాడారని తెలిపారు. చాలామంది చాలా ఫన్నీ గానే ఈ విషయాన్ని తీసుకున్నారు కాని కొంతమంది మాత్రం ట్రోల్స్ చేస్తున్నారని అలాంటి వాటిని తాను పట్టించుకోనని మిథిలేష్ తెలిపారు.
Also Read: సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న రామాయణ.. భారీ రన్ టైం లాక్!