E-Paper
Advertisement

ఆ అడవిలో చీకటి పడితే చాలు వింత శబ్దాలు… ట్రిప్ అంటేనే జడుసుకునే సైకలాజికల్ హార్రర్ థ్రిల్లర్

ఆ అడవిలో చీకటి పడితే చాలు వింత శబ్దాలు… ట్రిప్ అంటేనే జడుసుకునే సైకలాజికల్ హార్రర్ థ్రిల్లర్
Advertisement

Horror Mystery Thriller: లండన్‌ లోని హడావుడికి దూరంగా ప్రశాంతంగా బతకాలని ఓ జంట నిర్ణయించుకుంటుంది. కొత్త ప్రదేశం కోసం వెతుకుతూ వేల్స్‌ లోని ఓ మారుమూల ఇంటికి వెళ్లి ఉంటారు. అక్కడ ప్రకృతి శబ్దాలను రికార్డ్ చేస్తూ కొత్త ప్రయోగాలు చేస్తుంటారు. కానీ అడవిలో వాళ్లకు ఎదురైన ఓ వింత అనుభవం… ఆ తర్వాత వాళ్ల ఇంట్లోకి వచ్చిన ఓ పిల్లాడు వారి జీవితాలనే మార్చేస్తారు. అసలు ఆ పిల్లాడు ఎవరు ? అతని రాక వెనుక ఉన్న రహస్యం ఏంటి ? ఇదే 2025లో వచ్చిన హారర్ మిస్టరీ థ్రిల్లర్ ‘రాబిట్ ట్రాప్’ (Rabbit Trap) కథ. మరి ఈ సైకలాజికల్ థ్రిల్లర్ ను ఎక్కడ చూడొచ్చు ? అనే వివరాల్లోకి వెళ్తే…

కథలోకి వెళ్తే…

డార్సీ, డాఫ్నే భార్యాభర్తలు. ఇద్దరూ సంగీతానికి సంబంధించిన ప్రయోగాలు చేస్తుంటారు. కొత్త శబ్దాలను రికార్డ్ చేసి తమ సంగీతంలో ఉపయోగించాలనే ఉద్దేశంతో వేల్స్‌ లోని ఓ మారుమూల ఇంటికి మారతారు. చుట్టూ దట్టమైన అడవి, కొండలు, ప్రకృతి శబ్దాలు… వాళ్లకు కావాల్సిన వాతావరణం అక్కడ ఉంటుంది.

Advertisement

ఓ రోజు అడవిలో తిరుగుతున్న డార్సీకి వింతగా కనిపించే ఓ ప్రదేశం ఎదురవుతుంది. అది సాధారణ ప్రదేశంలా ఉండదు. అక్కడి నుంచి వినిపించే విచిత్రమైన శబ్దం అతడిని ఆకర్షిస్తుంది. దాన్ని రికార్డ్ చేసే క్రమంలో అతడికి వింత అనుభవం ఎదురవుతుంది. ఆ తర్వాత నుంచి వాళ్ల చుట్టూ జరిగే సంఘటనలు కూడా సాధారణంగా ఉండవు.

కొంతకాలానికి తమ ఇంటి దగ్గరే ఉంటానంటూ ఓ పిల్లాడు ఆ జంటకు పరిచయమవుతాడు. మొదట్లో అతడి మాటలు, ప్రవర్తన సాధారణంగానే అనిపిస్తాయి. క్రమంగా ఆ పిల్లాడు వాళ్ల జీవితాల్లో ఎక్కువగా కలిసిపోతాడు. కానీ అతడి గురించి పూర్తిగా తెలుసుకునే కొద్దీ డార్సీ, డాఫ్నేకు అనుమానాలు మొదలవుతాయి. అతడు చెప్పే మాటల్లో ఏదో తేడా కనిపిస్తుంది. అతడి రాకతో ఇంట్లో వాతావరణం కూడా మారిపోతుంది.

Advertisement

ఆ పిల్లాడికి, అడవిలో డార్సీ గుర్తించిన వింత శబ్దానికి ఏదైనా సంబంధం ఉందా ? వేల్స్ ప్రాంతానికి చెందిన పాత జానపద నమ్మకాల వెనుక నిజంగా ఏదైనా శక్తి ఉందా ? ఆ జంటకు ఎదురవుతున్న అనుభవాలు అతీంద్రియ శక్తుల వల్ల జరుగుతున్నాయా, లేక వాళ్ల మనసుల్లో దాగున్న భయాలు బయట పడుతున్నాయా ? ఈ సందేహాల చుట్టూ కథ సాగుతుంది. సినిమా భయపెట్టే సంఘటనలతో పాటు, ఆ జంట మధ్య ఉన్న భావోద్వేగ సమస్యలను కూడా తెరపై ఆవిష్కరించారు మేకర్స్.

తెలుగులో ఉందా లేదా ?

‘రాబిట్ ట్రాప్’ చిత్రానికి బ్రైన్ చైనీ దర్శకత్వం వహించారు. దేవ్ పటేల్, రోసీ మెక్‌యువెన్, జేడ్ క్రూట్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా జియో హాట్‌స్టార్‌ (Jio Hotstar)లో ఇంగ్లీష్ ఆడియోతో అందుబాటులో ఉన్నట్లు స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు డబ్బింగ్ అందుబాటులో లేదు. సాధారణ హారర్ సినిమాల కంటే భిన్నంగా, అడవి వాతావరణం, వింత శబ్దాలు, అనుమానాస్పద పిల్లాడి చుట్టూ నెమ్మదిగా పెరిగే ఉత్కంఠను ఇష్టపడే వారికి ఈ సినిమా నచ్చవచ్చు.

Read Also: ఆ పాత పెట్టె తెరిస్తే పాతాళానికే… ఇంట్లోనే నరకం చూపించిన దుష్టశక్తి… తెలుగులోనే ఈ హారర్ థ్రిల్లర్

Tags

Related News

హైటెక్ పారిస్‌లో ఊహకందని హత్యలు… ఏఐ టెక్నాలజీతో ఆడుకుంటున్న సైకో కిల్లర్

కూతురి ప్రాణాలు కాపాడుకోవడానికి లండన్‌ వెళ్తే ఊహించని షాక్… తండ్రికి నరకం… మస్ట్ వాచ్ థ్రిల్లర్

పెళ్లి, ప్రేమంటేనే గిట్టదు.. ఏకంగా ఆ బొమ్మల కంపెనీ ఓనర్‌తోనే… ట్రెండింగ్ కొరియన్‌ సిరీస్‌ తెలుగులో

కూతురిని కాపాడాలంటే భార్యను పంపమనే మాఫియా డాన్… 8.8 రేటింగ్‌తో దూసుకెళ్తున్న తెలుగు థ్రిల్లర్

పూజారి అంటే పూజలే అనుకుంటున్నారా ? విలన్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించే ఫైటర్… కొరియన్ యాక్షన్ థ్రిల్లర్

దుల్కర్‌ సినిమా స్ట్రీమింగ్ విషయంలో గందరగోళం… స్ట్రీమింగ్ ఏ ఓటీటీలో ? ఎప్పటి నుంచి ?

అపార్ట్‌మెంట్‌లో వరుస మిస్సింగ్స్.. ఆ బిల్డింగ్ కేర్‌టేకర్‌ వెనుక దాగిన భయంకర నిజం… హాలీవుడ్ హారర్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×