E-Paper
Advertisement

సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న రామాయణ.. భారీ రన్ టైం లాక్!

సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న రామాయణ.. భారీ రన్ టైం లాక్!
Advertisement

Ramayana Movie: బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ నితీష్ తివారి(Nitesh Tiwari) దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం రామాయణ (Ramayana). ఇదివరకే రామాయణం ఆధారంగా ఎన్నో సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా రామాయణ సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా దీపావళి పండుగను పురస్కరించుకొని నవంబర్ 5వ తేదీ అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

భారీ రన్ టైం లాక్..

ఈ సినిమా విడుదల తేది దగ్గర పడుతున్న నేపథ్యంలో విడుదలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి అవుతున్నాయి. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుందని తెలుస్తుంది. ఇండస్ట్రీ సమాచారం ప్రకారం ఈ సినిమా చూసిన సెన్సార్ సభ్యులు ఈ సినిమాకు U సర్టిఫికెట్(U certificate) జారీ చేశారని తెలుస్తుంది. అదేవిధంగా ఈ సినిమా రన్ టైమ్ (Run time) డీటెయిల్స్ వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాకు ఏకంగా 3:15 నిమిషాల రన్ టైం లాక్ చేయడం గమనార్హం.

సీతమ్మగా సాయి పల్లవి..

Advertisement

ఇలా ఈ సినిమా రన్ టైమ్ చూస్తుంటే మాత్రం చాలా లెంతీగా ఉందని చెప్పాలి. అయితే ఈ విధమైనటువంటి మైథలాజికల్ సినిమాలకు ఈ మాత్రం రన్ టైం ఉండటం సర్వసాధారణం అయితే సినిమా బాగుంటే పర్లేదు కానీ ఏమాత్రం తేడా కొట్టిన మొదటికే మోసం వస్తుందంటూ ఈ సినిమా రన్ టైం పై సోషల్ మీడియా వేదికగా చర్చలు మొదలయ్యాయి. ఇక ఈ సినిమాలో రణబీర్ కపూర్ (Ranbir Kapoor)రాముడి పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. ఇక సీతమ్మ పాత్రలో నేచురల్ బ్యూటీ సాయి పల్లవి (Sai Pallavi) నటించబోతున్నారు. ఇక రావణాసురుడి పాత్రలో కన్నడ స్టార్ హీరో యశ్ నటిస్తున్న విషయం తెలిసిందే.

ఏక్ దిన్ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ..

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ మాత్రం సినిమా పట్ల మంచి అంచనాలను పెంచేశాయి .త్వరలోనే ఈ సినిమా నుంచి ట్రైలర్ వీడియో రాబోతుందని తెలుస్తుంది. ఇక సాయి పల్లవి హిందీలో ఇదివరకు ఏక్ దిన్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఈ సినిమా పూర్తిగా నిరాశపరిచింది. అయితే రామాయణ సినిమా పై మాత్రం భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. మరి ఎన్నో అంచనాలు నడుమ అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న రామాయణ సినిమా ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమా తెలుగు రాష్ట్రాలలో కూడా భారీ స్థాయిలో విడుదల కాబోతోంది. ఈ సినిమా తెలుగు రిలీజ్ హక్కులను ప్రముఖ నిర్మాత దిల్ రాజు కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.

Advertisement

Also Read: జైలర్ 2 కోసం రజినీ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా? కోలీవుడ్ లోనే హైయెస్ట్!

Related News

జైలర్ 2 కోసం రజినీ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా? కోలీవుడ్ లోనే హైయెస్ట్!

జీరోతో మొదలై వందల కోట్ల ఆస్తి వరకు.. విజయ్ సేతుపతి ఆస్తుల చిట్టా!

పెళ్లయినా.. విజయ్ రష్మిక కోరిక తీర్చలేదా?

జైలర్ 2 విలన్ భార్య ఎవరో తెలిస్తే షాక్!

రావు రమేష్ కి సినిమా అవకాశాలు తగ్గడానికి గల కారణం ఏంటంటే?

అనడానికి ఏం అర్హత ఉంది.. బాడీ షేమింగ్ ట్రోల్స్ పై పాయల్ స్ట్రాంగ్ కౌంటర్!

ఆదర్శ కుటుంబం ట్రైలర్, ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ లాక్..ఎప్పుడు? ఎక్కడంటే?

Big Stories

Advertisement
×