E-Paper
Advertisement

బిగ్ బాస్ హౌస్ లో లవ్ ట్రాక్.. గుట్టు రట్టు చేసిన మిథిలేష్!

బిగ్ బాస్ హౌస్ లో లవ్ ట్రాక్.. గుట్టు రట్టు చేసిన మిథిలేష్!
Advertisement

Big Tv Kissik Talks: బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా ఎంతో మంది మంచి గుర్తింపు సంపాదించుకొని ప్రస్తుతం ఇండస్ట్రీలో సెలబ్రిటీలుగా కొనసాగుతున్నారు. ఇక బిగ్ బాస్ కార్యక్రమంలో గత కొన్ని సీజన్లుగా కామన్ మ్యాన్ క్యాటగిరిలో భాగంగా కొంతమంది కామనర్స్ హౌస్ లోకి వెళ్లి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇలా కామన్ మ్యాన్ క్యాటగిరిలో భాగంగా బిగ్ బాస్ ద్వారా గుర్తింపు సంపాదించుకున్న వారిలో మిథిలేష్ రెడ్డి(Mithilesh Reddy) ఒకరు . బిగ్ బాస్ 10 తెలుగు (Bigg Boss 10 Telugu)కార్యక్రమంలో అగ్నిపరీక్ష ద్వారా ఎంపిక అయిన మిథిలేష్ వైల్డ్ కార్డు ద్వారా హౌస్ లోకి అడుగు పెట్టారు.

బిగ్ బాస్ లవ్ ట్రాక్స్..

ఈయన హౌస్ లో ఉన్నది కేవలం రెండు రోజులు అయినప్పటికీ ఏకంగా 15 లక్షల రూపాయల క్యాష్ తో హౌస్ నుంచి బయటకు రావడంతో మిథిలేష్ పేరు మారుమోగి పోవడమే కాకుండా ఈయనకు విపరీతమైన క్రేజ్ లభించింది. ఇలా బిగ్ బాస్ 10 కార్యక్రమంలో ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్న మిథిలేష్ తాజాగా కిస్సిక్ టాక్స్ (Kissik Talks)కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈనెల బిగ్ బాస్ కార్యక్రమం గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను తెలియచేశారు. ఈ నేపథ్యంలోనే హౌస్ లో ఉన్నటువంటి లవ్ ట్రాక్స్ (Love Tracks)గురించి వర్ష ప్రశ్నించడంతో మిథిలేష్ బిగ్ బాస్ లవ్ ట్రాక్స్ గురించి ఎవరికీ తెలియని విషయాలను బయటపెట్టారు.

ఎలాంటి ఒత్తిడి ఉండదు..

Advertisement

బిగ్ బాస్ హౌస్లో లవ్ ట్రాక్స్ అనేది ముందుగానే మనం అప్లికేషన్ ఫామ్ ఫీల్ చేసే సమయంలోనే పొందుపరచాలని తెలిపారు. మనం ఎవరితోనైనా కమిట్మెంట్ అయ్యామా లేకుంటే బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లిన తర్వాత ఇలాంటి కమిట్మెంట్స్ పెట్టుకుంటామా అనే విషయాల గురించి ముందుగానే మనం అప్లికేషన్ లో పొందుపరచాలి. అయితే ఈ లవ్ ట్రాక్స్ కచ్చితంగా ఉండాలి అంటూ బిగ్ బాస్ నిర్వాహకులు ఫోర్స్ చేయరని అది పూర్తిగా మన ఇష్టమని మిథిలేష్ తెలిపారు. అయితే ఇలా హౌస్ లోకి వెళ్ళిన తర్వాత లవ్ ట్రాక్స్ పెట్టుకోవడం వల్ల కొంతమంది మంచి ఫేమస్ అవుతూ ఉంటారు అలాగే మరికొందరు విన్నర్ కూడా అవుతారని, మరికొందరు ఇలాంటి ట్రాక్స్ ఏవి లేకపోయినా సక్సెస్ అవుతారు అంటూ మిథిలేష్ తెలిపారు.

Advertisement

ఇక ఈయన తన లవ్ బ్రేకప్ గురించి కూడా ఈ సందర్భంగా తెలిపారు. కాలేజీ చదువుతున్న సమయంలో తాను ఒక అమ్మాయిని ప్రేమించానని అయితే ఇదొక నిబ్బా, నిబ్బి లవ్ స్టోరీ అంటూ తెలిపారు. ఒక మిస్ అండర్స్టాండింగ్ వల్ల తనకు బ్రేకప్ జరిగిందని తనకు అర్థం అయ్యేలా చెప్పిన తను వినలేదని అందుకే బ్రేకప్ చెప్పుకున్నామని తెలిపారు. ఇప్పుడు కనుక అమ్మాయి వస్తే తిరిగి యాక్సెప్ట్ చేస్తారా అంటూ ప్రశ్న ఎదురవడంతో తాను అసలు యాక్సెప్ట్ చేయనని మిథిలేష్ తెలిపారు. ఇప్పుడు తనకంటూ ఒక మంచి ప్లాట్ ఫామ్ దొరికింది, ఫేమ్ వచ్చింది కాబట్టి తను నన్ను నమ్ముతుంది కానీ నేను మాత్రం యాక్సెప్ట్ చేయనని మిథిలేష్ తెలిపారు.

Also Read: నీ సినిమా ఎలా ఆడుతుందో చూస్తాం? లిటిల్ హార్ట్ మౌళికి వార్నింగ్!

Related News

మధురి రాథోడ్ దెబ్బకు సోషల్ మీడియా షేక్..కమ్‌బ్యాక్ అదిరిపోయిందిగా!

బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున పై మిథిలేష్ కామెంట్స్.. లెజెండ్స్ అని ఊరికే అనరుగా?

ప్రేమ, పెళ్లిపై మిథిలేష్ కామెంట్స్.. బాబుకి పెద్ద కోరికలే!

అగ్ని పరీక్ష పై మిథిలేష్ కామెంట్స్.. బిగ్ బాస్ తరువాతే టెలికాస్ట్ చేయాలంటూ!

డబ్బులిచ్చి మరీ పక్కోడ్ని తొక్కేస్తున్నారా.. పీఆర్ టీమ్స్ పై మిథిలేష్ రియాక్షన్!

మీ ఇంట్లో డబ్బు తీసుకెళ్లానా?రూ.15 లక్షల ట్రోల్స్ పై మిథిలేష్ షాకింగ్ రియాక్షన్!

ఎవరీ మిథిలేష్.. బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే?

Big Stories

Advertisement
×