E-Paper
Advertisement

నీ సినిమా ఎలా ఆడుతుందో చూస్తాం? లిటిల్ హార్ట్ మౌళికి వార్నింగ్!

నీ సినిమా ఎలా ఆడుతుందో చూస్తాం? లిటిల్ హార్ట్ మౌళికి వార్నింగ్!
Advertisement

Actor Mouli: యూట్యూబర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకొని అనంతరం 90s బయోపిక్, లిటిల్ హార్ట్స్ వంటి సినిమాలు ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న మౌళి (Mouli)త్వరలోనే దొంగ నా కొడుకు (Donganakoduku) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా నవంబర్ 13వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టారు. తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ వీడియో విడుదల చేశారు. ఈ టీజర్ వీడియో లాంచ్ కార్యక్రమంలో భాగంగా చిత్ర బృందం పాల్గొని సందడి చేశారు.

టీవీ ఛానల్ నుంచి వార్నింగ్..

ఇకపోతే ఈ టీజర్ లంచ్ కార్యక్రమంలో భాగంగా మౌళి ఒక ఆసక్తికరమైన విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు. ఒక టీవీ ఛానల్ నుంచి తన సినిమాలను నెగిటివిటీ ఎదుర్కొనేలా చేస్తాము అంటూ తనకు వార్నింగ్ వచ్చిందని మౌళి ఈ సందర్భంగా బయటపెట్టారు. లిటిల్ హార్ట్స్ సినిమా మంచి సక్సెస్ అందుకున్న తర్వాత తనకు ఒక టీవీ ఛానల్ నుంచి ఒక ఫోన్ కాల్ వచ్చిందని మౌళి తెలిపారు. అయితే ఆ టీవీ ఛానల్ లో ప్రసారమయ్యే ఒక కార్యక్రమంలో పాల్గొనాలని తనను ఆహ్వానించారని మౌళి తెలిపారు.

నీ సినిమాకు నెగిటివిటీ వస్తుంది..

Advertisement

ఇలా ఆ టీవీ ఛానల్ నుంచి ఫోన్ కాల్ వచ్చిన సమయంలో నాకు నిజంగానే ఒంట్లో బాలేదు. ఇలా తన పరిస్థితి బాలేదని తర్వాత ఎప్పుడైనా వస్తానని వాళ్లకు చెప్పాను దీంతో వాళ్ళు తనకు గట్టిగా వార్నింగ్ ఇచ్చారని తెలిపారు. అవునా? రావా? నీ నెక్స్ట్ సినిమా ఎలా ఆడుతుందో చూస్తాము.. బాగా నెగిటివిటీ అవుతుంది చూడు అంటూ తనకు వార్నింగ్ ఇచ్చారని మౌళి ఈ సందర్భంగా తెలిపారు. ఈడు బచ్చాగాడు.. భయపెడితే భయపడతారు అని కూడా అన్నారని మౌళి తెలిపారు. ఇలా వాళ్లు భయపెట్టడంతో తాను కూడా నిజంగానే భయపడి తనకు బాగా లేకపోయినా ఆ టీవీ ఛానల్ లో జరుగుతున్న కార్యక్రమానికి హాజరయ్యారని మౌళి తెలిపారు.

బ్యాక్ గ్రౌండ్ ఉంటే అనేవారా..

నాకు ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేదు కాబట్టి వాళ్లు నన్ను చాలా తొందరగా భయపెట్టగలిగారు అదే ఒక బ్యాక్ గ్రౌండ్ ఉన్న పెద్ద హీరోని అయితే ఇలా అనగలరా? అంటూ మౌళి ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. తాను సినిమాలలో నటించడమే ధ్యేయంగా పెట్టుకున్నాను తన సినిమాలు మంచి సక్సెస్ కావాలి అంటే ఇలాంటి బెదిరింపులకు తాను భయపడాల్సిందేనని, మౌళి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా తన టాలెంట్ తో ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటున్న మౌలికి ఇలాంటి వార్నింగ్ ఇచ్చిన ఆ టీవీ ఛానల్ ఏంటి అంటూ ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు మొదలయ్యాయి.

Advertisement

Also Read: అగ్ని పరీక్ష పై మిథిలేష్ కామెంట్స్.. బిగ్ బాస్ తరువాతే టెలికాస్ట్ చేయాలంటూ!

Related News

నాన్నతో కోల్డ్ వార్.. పెళ్లికి ముందే విభేదాలు.. ఉత్తేజ్ కూతురు చేతన షాకింగ్ కామెంట్స్!

ఉత్తేజ్ కూతురు చేతన జీవితంలో ఇన్ని కష్టాలా?

సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న రామాయణ.. భారీ రన్ టైం లాక్!

జైలర్ 2 కోసం రజినీ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా? కోలీవుడ్ లోనే హైయెస్ట్!

జీరోతో మొదలై వందల కోట్ల ఆస్తి వరకు.. విజయ్ సేతుపతి ఆస్తుల చిట్టా!

పెళ్లయినా.. విజయ్ రష్మిక కోరిక తీర్చలేదా?

జైలర్ 2 విలన్ భార్య ఎవరో తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×