E-Paper
Advertisement

Big tv kissik talks: అలా అనుకోవడం బిగ్ బాస్ కే అవమానం… పృథ్వీ షాకింగ్ కామెంట్స్!

Big tv kissik talks: అలా అనుకోవడం బిగ్ బాస్ కే అవమానం… పృథ్వీ షాకింగ్ కామెంట్స్!
Advertisement

Big tv kissik talks: తెలుగు బుల్లితెరపై నాగ పంచమి అనే సీరియల్ ద్వారా ఎంతో మంది తెలుగు అభిమానులను సొంతం చేసుకున్న నటుడు పృథ్విరాజ్ శెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఈయన సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. ఈయన కన్నడ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి అయినప్పటికీ తెలుగులో కూడా తన అద్భుతమైన నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇలా నాగ పంచమి సీరియల్ లో నటించిన పృథ్వి అనంతరం డాన్స్ షో కార్యక్రమాలలో పాల్గొంటూ సందడి చేశారు ఇక బిగ్ బాస్ 8 రియాలిటీ షోలో కూడా కంటెస్టెంట్ గా పాల్గొన్న సంగతి తెలిసిందే.

బిగ్ బాస్ బిగ్ ప్లస్ అయ్యింది..

ఇలా బిగ్ బాస్ రియాలిటీ షో అనంతరం పృథ్వీ పలు సినిమాలలో నటిస్తున్నట్టు తెలుస్తుంది. ఇలా కెరియర్ పరంగా బిజీగా ఉన్న  పృథ్వీ తాజాగా బిగ్ టీవీ కిస్సిక్ టాక్స్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా వర్ష తన కెరీర్ కి సంబంధించిన విషయాలతో పాటు తన వ్యక్తిగత విషయాల గురించి కూడా ప్రశ్నలు వేస్తూ సమాధానాలు రాబట్టారు. అయితే పృథ్వీ బిగ్ బాస్  షో పాల్గొనడంతో బిగ్ బాస్ కార్యక్రమం గురించి కూడా ప్రశ్నలు ఎదురయ్యాయి. మీ కెరియర్ లో బిగ్ బాస్ మీకు ప్లస్ అయ్యిందా అంటూ ప్రశ్న వేశారు.

తెలుగు మాట్లాడటం నేర్చుకున్నాను..

Advertisement

ఈ ప్రశ్నకు పృథ్వీ సమాధానం చెబుతూ.. తనకు బిగ్ బాస్ బిగ్ ప్లస్ అయిందని తెలియజేశారు. ఈ కార్యక్రమం అనంతరం తనకు కెరియర్ పరంగా మంచిగా అవకాశాలు వస్తున్నాయని తెలియజేశారు. బిగ్ బాస్ గురించి మాట్లాడుతూ తనకు బస్తా టాస్క్ అంటే చాలా ఇష్టం అని తెలిపారు. హౌస్ లో నాకు విష్ణు ప్రియ, నిఖిల్ ఇద్దరు చాలా మంచి క్లోజ్ ఫ్రెండ్స్ అని తెలిపారు. వీరిద్దరిలో ఎవరు ఎక్కువ ఇష్టం అని చెప్పడంతో విష్ణు అంటూ మరోసారి విష్ణు ప్రియ పేరును తెలియజేశారు. ఇక బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత తనకు తెలుగు బాగా మాట్లాడటం నేర్చుకున్నానని ,అలాగే ఏ విషయంలోనైనా కాస్త ఓపికగా ఎదురు చూసే అలవాటును కూడా నేర్చుకున్నానని తెలిపారు.

Advertisement

బిగ్ బాస్ షోలో విన్నర్ ఎవరవుతారని ఊహించారు అంటూ ప్రశ్న ఎదురవడంతో కచ్చితంగా నిఖిల్ విన్నర్ అవుతారని అనుకున్నాను అంటూ సమాధానం చెప్పారు. మీరు విన్నర్ అవుతారని అనుకోలేదా అంటూ వర్ష ప్రశ్న వేయడంతో నేను కనుక విన్నర్ అవుతానని అనుకుంటే అది బిగ్ బాస్ కే అవమానం అంటూ పృథ్వీ ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. మీకు బిగ్ బాస్ సీజన్ 10 లో పాల్గొనే అవకాశం వస్తే వెళ్తారా అంటూ ప్రశ్న వేయడంతో ఒక్క సీజన్ 10 లో మాత్రమే కాదు ప్రతి సీజన్ లో అవకాశం వచ్చిన బిగ్ బాస్ కార్యక్రమానికి వెళ్తాను అంటూ ఈ సందర్భంగా పృథ్వీ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Also Read: Sri Satya: పెళ్లి వద్దు.. అమ్మను కావాలంటున్న బిగ్ బాస్ బ్యూటీ…ఇదేం కోరిక తల్లి?

Related News

సింగర్ అంతడుపుల రమాదేవి ఒక్క పాటకు ఎంత తీసుకుంటారో తెలుసా?

Telugu Tv Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. ఆ ఒక్కటే మళ్లీ టాప్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి కొత్త టెన్షన్.. చింటును బాలు తెస్తాడా..? గుణ ప్లానేంటి..?

Podarillu Today Episode : నారాయణకు అడ్డంగా దొరికిన జమున.. కన్నా సీరియస్.. ఇదేం ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ మాటతో మీనాక్షి షాక్.. పల్లవికి మైండ్ బ్లాక్.. అరెస్ట్ చేస్తారా..?

Illu Illalu Pillalu Today Episodes: రెచ్చిపోయిన భాగ్యం.. రామరాజు మాస్ వార్నింగ్.. వల్లికి ఇంకో ఛాన్స్..

Sunday TV Movies : ఆదివారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. మస్ట్ వాచ్..

Nindu Noorella Saavasam Serial Today Episode October 18th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి కోల్‌ కతా వెళ్లడానికి వైజయంతి ఒప్పుకుంటుందా..?

Big Stories

Advertisement
×