E-Paper
Advertisement

కాబోయే భార్య ఇలాగే ఉండాలి…ఆ హీరోయిన్ లాగా ఉండాలంటూ!

కాబోయే భార్య ఇలాగే ఉండాలి…ఆ హీరోయిన్ లాగా ఉండాలంటూ!
Advertisement

Big Tv Kissik Talks: ఇటీవల కాలంలో ఫోక్ సాంగ్స్ చాలా మంచి ఆదరణ సొంతం చేసుకుంటున్నాయి. సోషల్ మీడియాలో కూడా ఫోక్ సాంగ్స్ కు విపరీతమైన ఆదరణ లభించడంతో ఎంతోమంది ఫోక్ సింగర్స్, డాన్సర్స్ సెలబ్రిటీలుగా కొనసాగుతూ ఇండస్ట్రీలో బిజీ అవుతున్నారు. ఇలా ఫోక్ సింగర్ డాన్సర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో రాము రాథోడ్ (Ramu Rathod) ఒకరు. రాము రాథోడ్ అనడం కంటే కూడా రాను బొంబాయికి రాను పాట సింగర్ కం డాన్సర్ అంటే టక్కున అందరికీ గుర్తుకొస్తారు. ఈ ఒక్క పాటతో సెన్సేషనల్ గా నిలిచిన రాము రాథోడ్ తాజాగా కిస్సిక్ టాక్స్(Kissik Talks) కార్యక్రమంలో పాల్గొన్నారు.

అమ్మాయిలో ఈక్వాలిటీస్ ఉండాల్సిందే..

ఈ కార్యక్రమంలో భాగంగా రాము రాథోడ్ తన వ్యక్తిగత విషయాలతో పాటు వృత్తిపరమైన విషయాల గురించి కూడా అభిమానులతో పంచుకున్నారు. ఈ నేపథ్యంలోనే తన ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ గురించి మాట్లాడుతూ తాను మహబూబ్ నగర్ జిల్లాలో జన్మించానని అయితే తాము ఐదుగురు సంతానం అని తెలిపారు. ఇప్పటికే మిగిలిన నలుగురికి పెళ్లిళ్లు జరిగాయని తాను ఒక్కడే ఉన్నానని తెలిపారు.. ఇలా పెళ్లిళ్ల గురించి ప్రస్తావనకు రావడంతో రాము రాథోడ్ కి కాబోయే భార్య ఎలా ఉండాలి తనలో ఎలాంటి క్వాలిటీ ఉండాలి అనే ప్రశ్న ఎదురైంది. ఈ ప్రశ్నకు రాము రాథోడ్ సమాధానం చెబుతూ తన భార్యలో ఉన్న క్వాలిటీస్ బయట పెట్టారు.

ఐశ్వర్య రాయి లాంటి అమ్మాయి…

Advertisement

తనకు భార్యగా వచ్చే అమ్మాయి కచ్చితంగా నాతోపాటు మా అమ్మ నాన్నలను కూడా బాగా చేసుకోవాలి. పరిస్థితులను, మనల్ని మంచిగా అర్థం చేసుకోవాలని తెలిపారు. మనం సినిమా ఇండస్ట్రీలో ఉన్నాం కాబట్టి బయట వాళ్లతో మనల్ని కంపారిజన్ చేయకుండా మనల్ని అర్థం చేసుకొనే అమ్మాయి అయితే చాలు అంటూ తనకు కాబోయే భార్యలో ఉండాల్సిన క్వాలిటీస్ గురించి రాము తెలిపారు. ఇక ఆ అమ్మాయి ఎలా ఉండాలని అనుకుంటున్నారు అని చెప్పడంతో నాకు ఐశ్వర్య రాయ్(Aishwarya Rai) అంటే చాలా ఇష్టం అని చెప్పడంతో వెంటనే వర్షా రాము రాథోడ్ కు ఐశ్వర్య రాయ్ లాంటి అమ్మాయి కావాలంట అని మాట్లాడటంతో  నేను కావాలి అనట్లేదని రాము తెలిపారు.

Advertisement

ఇలా తనకు కాబోయే భార్యలో ఉండాల్సిన క్వాలిటీస్ గురించి బయట పెట్టడంతో వెంటనే వర్ష మరి లవ్ స్టోరీ(Love story)లు ఏవైనా ఉన్నాయా? అంటూ అడగడంతో ఈ జనరేషన్లో లవర్ లేని వాళ్ళు ఎవరు ఉండరు తనకు కూడా గర్ల్ ఫ్రెండ్ ఉందని చెప్పడంతో వెంటనే వర్ష ఐశ్వర్యరాయ్ లాగా అందంగా ఉందా? అంటూ ప్రశ్నించారు. ప్రతి ఒక్కరి జీవితంలోనూ ప్రేమ అనేది ఉంటుంది కానీ లైఫ్ లాంగ్ ఆ ప్రేమ ఉండాలి అంటే మన మైండ్ సెట్ సరిగా ఉండాలి అంటూ ప్రేమ గురించి అలాగే ఇటీవల కాలంలో జరుగుతున్న బ్రేకప్స్ గురించి కూడా మాట్లాడారు. ప్రేమలో ఉన్నప్పుడు గొడవ పడటాలు అలగడాలు కూడా చాలా సరదాగా, క్యూట్ గా ఉంటాయి అంటూ రాము రాథోడ్ లవ్ స్టోరీ గురించి అలాగే పెళ్లి గురించి చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Also Read: ఫేమస్ అవ్వాలంటే తోకలుండాల్సిందే.. రాము రాథోడ్ కామెంట్స్ వైరల్!

Related News

ఇదేక్కడి లాజిక్ రా మామా.. బ్రేకప్ అయితే కంగ్రాట్స్ అంటున్న రాము రాథోడ్!

ఫేమస్ అవ్వాలంటే తోకలుండాల్సిందే.. రాము రాథోడ్ కామెంట్స్ వైరల్!

రాను బొంబైకి రాను పాటను మించే సాంగ్ వస్తుందా? రాము రాథోడ్ ఏమన్నాడంటే!

నమ్మిన వాళ్లే నట్టేట ముంచారు.. ఫోక్ సింగర్ రాము రాథోడ్ షాకింగ్ కామెంట్స్!

ఇదెక్కడి క్రేజ్ రా మామా.. గోరటి వెంకన్న పాటకు అప్పట్లో అంత డబ్బా?

బండారి పూజిత క్రేజ్ మామూలుగా లేదుగా.. నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా?

బిగ్ బాస్ 10 సర్ప్రైజ్ ఎలిమినేషన్.. షాలిని అవుట్!

Big Stories

Advertisement
×