E-Paper
Advertisement

ఇంగ్లాండ్ కొంప‌ముంచిన DRS…షాబాద్ ఖాన్ సెంచ‌రీతో పాకిస్తాన్ విజ‌యం

ఇంగ్లాండ్ కొంప‌ముంచిన DRS…షాబాద్ ఖాన్ సెంచ‌రీతో పాకిస్తాన్ విజ‌యం
Advertisement

Shadab Khan LBW – DRS Controversy: పాకిస్తాన్ గడ్డపై జరుగుతున్న వన్డే ట్రై సిరీస్ చాలా ఉత్కంఠ భరితంగా సాగుతోంది. ఇప్పటికే ఈ టోర్నమెంట్ లో మూడు మ్యాచ్ లు పూర్తికాగా… లాహోర్ లోని గడాఫీ వేదికగా ఆదివారం మరో రసవత్తర పోరు జరిగింది. అయితే ఇందులో అద్భుతంగా రాణించిన పాకిస్తాన్…ఇంగ్లాండ్ పై ఒకే ఒక్క వికెట్ తేడాతో విక్టరీ నమోదు చేసుకుంది. ఎనిమిదవ వికెట్ కు బరిలోకి దిగిన ఆల్ రౌండర్ షాబాద్ ఖాన్ సూపర్ సెంచరీ చేసి ఇంగ్లాండ్ విజయానికి అడ్డుకట్ట వేశాడు. ఈ క్రమంలో ఇంగ్లాండ్ విధించిన లక్ష్యాన్ని 17 బంతులు మిగిలి ఉండగానే పాకిస్తాన్ ఛేదించింది. ఈ విజయంతో 6 పాయింట్లు సాధించిన పాక్‌, టేబుల్ లో టాప్ స్థానాన్ని నిల‌బెట్టుకుంది.

ఇంగ్లాండ్ కొంప‌ముంచిన DRS…షాబాద్ సెంచ‌రీతో పాకిస్తాన్ విజ‌యం

లాహోర్ వేదికగా పాకిస్తాన్ వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య వన్డే ట్రై సిరీస్ లో భాగంగా నాలుగవ మ్యాచ్ జరిగింది. ఇందులో ఇంగ్లాండ్ మొదట బ్యాటింగ్ చేయగా 46.4 ఓవర్లలో 241 పరుగులు సాధించింది. ఈ లక్ష్యాన్ని చేదించే క్రమంలో పాకిస్తాన్ టాపార్డ‌ర్ మొత్తం కుప్పకూలింది. కానీ ఎనిమిదవ వికెట్ కు బరిలోకి దిగిన షాబాద్ ఖాన్ మాత్రం సెంచరీతో చెలరేగాడు. ఈ క్రమంలో 47.1 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 243 పరుగులు చేసి ఇంగ్లాండ్ పై ఒకే ఒక్క వికెట్ తేడాతో విక్టరీ అందుకుంది పాకిస్తాన్.

Advertisement

Faf du Plessis talks about Suryakumar Yadav catch of David Miller in T20 World Cup final: టీమిండియా ఛీటింగ్ చేసే గెలిచింది…సూర్య‌కుమార్ క్యాచ్ పై డుప్లెసిస్ సంచ‌ల‌నం!

అయితే 97 పరుగుల వద్ద షాబాద్ ఖాన్ ఉండగా గస్ ఆట్కిన్‌సన్ బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. ఫీల్డ్ అంపైర్ వెంటనే ఔట్ ఇచ్చేసాడు. ఇక ఇంగ్లాండ్ విజయం సాధించిందని ఇరు ప్లేయర్లు షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడం కూడా జరిగింది. ఇంతలోనే డీఆర్ఎస్ తీసుకున్న పాకిస్తాన్… సక్సెస్ అయ్యింది. డీఆర్ఎస్ లో బ్యాట్ కు బంతి తగిలినట్లు తేల‌డంతో షాబాద్ ఖాన్ మ‌ళ్లీ బ్యాటింగ్ కు దిగాడు. ఈ క్ర‌మంలోనే షాబాద్ ఖాన్ సెంచరీ పూర్తి చేసుకొని మ్యాచ్ గెలిపించాడు.

అంపైర్ల‌ను కొనేసి, ఫిక్సింగ్ చేశారంటూ ఆరోప‌ణ‌లు!

Advertisement

ఎల్బీడబ్ల్యూ అయిన షాబాద్ ఖాన్ నాటౌట్ అంటూ థ‌ర్డ్ అంపైర్ ప్ర‌క‌ట‌న చేసిన సంఘ‌ట‌నపై సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది. అంపైర్లను చివరి క్షణంలో కొనుగోలు చేసి… షాబాద్ ఖాన్ నాటౌట్ అయ్యేలా సీన్ క్రియేట్ చేశారని పాకిస్తాన్ క్రికెట్ బోర్డుపై ట్రోల్స్ కూడా నడుస్తున్నాయి. ఫిక్సింగ్ చేసి ఇంగ్లాండ్ జట్టును అన్యాయం చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు క్రికెట్ ఫ్యాన్స్. పాకిస్తాన్ అంటేనే ఫిక్సింగ్ అని.. సొంత గడ్డపై ఓడిపోతే పరువు పోతుందని ఇలాంటి కుట్రలు తెర‌దించార‌ని ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. అస‌లు ఫామ్ లో లేని షాబాద్ ఖాన్ 8వ స్థానంలో వ‌చ్చి, సెంచ‌రీ చేస్తాడా ? అని మ‌రికొంద‌రు అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నారు.

Tilak Varma and Nitish Kumar Reddy Telugu conversation: తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీష్ రెడ్డి, షాకింగ్ వీడియో వైర‌ల్

 

 

 

 

Related News

బాబ‌ర్ ఆజం పెద్ద జోక‌ర్…పాకిస్తాన్ జ‌ట్టు నుంచి త‌రిమేయండి

అర్ధ‌రాత్రి 2 గంట‌ల‌కు ద్రవిడ్ కు ఫోన్ చేసి, బూతులు తిట్టిన క్రికెట‌ర్!

మీరు మగాళ్లయితే, ఫ‌స్ట్ బ్యాటింగ్ చేసి 250 ప‌రుగులు చేయండి!

న్యూజిలాండ్ లో టీమిండియా క్రికెట‌ర్ల‌కు ఫుడ్ క‌ష్టాలు…పాములు, తేళ్లు, గ‌బ్బిపాలు!

వాంఖ‌డే స్టేడియంలో ముంబై జెర్సీలే క‌న‌బ‌డాలి…కీరన్ పొలార్డ్ హుకుం

30 ప‌రుగుల‌తో టీమిండియా ఓడిపోయేది…కానీ బీసీసీఐ కుట్ర‌ల‌తోనే గెలిచారు!

ఇది రా తెలుగోడి బ్రాండ్.. తిల‌క్ వ‌ర్మపై ఈగ కూడా వాల‌నివ్వ‌కుండా సెక్యూరిటీ?

Big Stories

Advertisement
×