Big Tv Kissik Talks: బిగ్ టీవీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కార్యక్రమాలలో కిస్సిక్ టాక్స్(Kissik Talks) కార్యక్రమంలో ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకుని ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి వారం సెలబ్రిటీలు హాజరవుతూ అభిమానుల కోసం ఎన్నో ఆసక్తికరమైన విషయాలను తెలియచేస్తూ ఉంటారు. ప్రతి వారం లాగే ఈ వారం ఈ కార్యక్రమంలో భాగంగా ఫోక్ సింగర్, డాన్సర్ రాము రాథోడ్ (Ramu Rathod)పాల్గొన్నారు. రాము రాథోడ్ రాను ముంబైకి రాను అనే పాటతో ఎంతో ఫేమస్ అయిన సంగతి తెలిసిందే. ఈ ఒక్క పాటతో సెన్సేషనల్ గా నిలిచిన రాము రాథోడ్ తాజాగా కిస్సిక్ టాక్స్ కార్యక్రమంలో భాగంగా తన జర్నీ గురించి ఆసక్తికరమైన విషయాలు తెలిపారు.
ఫోక్ సింగర్ గా తన ప్రయాణం ఎప్పుడు మొదలైంది అంటూ ప్రశ్న ఎదురైంది. ఈ ప్రశ్నకు రాము రాథోడ్ సమాధానం చెబుతూ తాము బంజారా ఫ్యామిలీలో పుట్టాను కాబట్టి మాకు పుట్టుకతోనే వచ్చిందని తెలిపారు. మా బంజారా ఇళ్లలో డప్పు సౌండ్ వస్తే మాకు తెలియకుండానే మేము డాన్స్ చేస్తాము. ఇక మా తాత, నాన్న భజనలు చేసేవారు పౌరాణిక నాటకాలు వేసేవారు చిన్నప్పటి నుంచి వారిని చూస్తూ తనకు కూడా సింగర్ గా పాటలు పాడటం డాన్సులు వేయటం అలవాటుగా మారిపోయిందని తెలిపారు.
సోషల్ మీడియాలో తన యూట్యూబ్ ప్రయాణం గురించి మాట్లాడుతూ తాను కూడా యూట్యూబ్ ఛానల్ ప్రారంభించాలి అనుకున్నాను అయితే ఏ పేరు పెట్టాలనే ఆలోచిస్తున్న సమయంలో రాము అని పెడితే పెద్దగా కిక్ ఉండదు. మనం సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలి అంటే మన పేరు పక్కన ఏదో ఒక తోక కచ్చితంగా ఉండాలని తోకలు ఉంటేనే ఫేమస్ అవుతామని రాము పక్కన రాథోడ్ అని చేర్చుకున్నాను. ఎలాగూ మేము కూడా రాథోడ్స్ కాబట్టి రాము రాథోడ్ అని పేరు పెట్టుకున్నానని, ఆ పేరు బాగా క్లిక్ అయింది అంటూ రాము రాథోడ్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
తాను స్కూల్ సమయం నుంచి పాటలు పాడుతూ స్కూల్ ఫంక్షన్లలో డాన్స్ లు కూడా వేసే వాడిని. ఇక స్కూల్ సమయంలోనే తాను ఎంతోమందికి డాన్స్ కూడా నేర్పించానని తెలిపారు. కాలేజీకి వెళ్లగానే డాన్స్ పై ఎక్కువ మక్కువ రావడంతో తాను కాలేజీ పక్కన పెట్టి డాన్స్ పై పూర్తిగా ఫోకస్ చేస్తూ ఇలా ఫోక్ డాన్సర్ గా మారిపోయాను అంటూ రాము రాథోడ్ ఈ సందర్భంగా తన జర్నీ గురించి మాట్లాడుతూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక ఈయన రాను బొంబాయికి రాను పాట ఇప్పటికీ యూట్యూబ్లో ట్రెండింగ్ లో ఉంది. ఈ సాంగ్ దాదాపు 925 ప్లస్ మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుంది. ఇక ఈ పాట సక్సెస్ కావడంతో రాము రాథోడ్ ఏకంగా బిగ్ బాస్ సీజన్ 9 కార్యక్రమంలో కంటెస్టెంట్ గా కూడా అవకాశం అందుకున్న సంగతి తెలిసిందే.
Also Read: ఇంస్టాగ్రామ్ నుంచి తప్పుకున్న పవన్ వైఫ్ అన్నా ..కారణం అదేనా?