E-Paper
Advertisement

Big tv Kissik Talks: జీవితంలో అలాంటి రోజులు వద్దు.. నాన్న కోరిక అదే అంటూ ఎమోషనల్!

Big tv Kissik Talks: జీవితంలో అలాంటి రోజులు వద్దు.. నాన్న కోరిక అదే అంటూ ఎమోషనల్!
Advertisement

Big tv Kissik Talks: బిగ్ టీవీ నిర్వహిస్తున్న కిస్సిక్ టాక్స్ (Kissik Talks)కార్యక్రమానికి ఎంతో మంచి ఆదరణ లభిస్తుంది. ఇక ఈ వారం ఈ కార్యక్రమంలో భాగంగా బుల్లితెర నటి, బిగ్ బాస్ కంటెస్టెంట్ రీతు చౌదరి(Ritu Chowdary) పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా రీతు చౌదరి తనకు సంబంధించిన ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకున్నారు. ముఖ్యంగా తన ఫ్యామిలీ గురించి ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ కాస్త ఎమోషనల్ అయ్యారు. ప్రతి ఒక్కరి జీవితంలోను ఏదో ఒక సందర్భంలో ఒక చేదు సంఘటన జరుగుతుంది. అలాంటి క్షణం మళ్ళీ రాకూడదని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. అలాంటి క్షణాలు మీ జీవితంలో ఏదైనా ఉందా అంటూ ప్రశ్న ఎదురైంది.

నాన్న చనిపోవడం..

ఈ ప్రశ్నకు రీతు చౌదరి సమాధానం చెబుతూ మా నాన్న చనిపోవడం అంటూ ఎమోషనల్ అయ్యారు. నాన్న బ్రతికుండగా ఎన్నో కోరికలు కోరుకున్నారు. నేను పెద్ద ఇల్లు కట్టుకొని, కారులో తిరిగితే చూడాలని అలాగే ఇంట్లో ఓసారి బిగ్ బాస్ చూస్తూ కూర్చున్నాము. ఆ సమయంలో నాన్న అమ్ములు నువ్వు అలా బిగ్ బాస్ కార్యక్రమానికి వెళ్తే నేను హౌస్ లోకి రావాలి అంటూ మాట్లాడారు. కానీ నేను ఇప్పుడు సొంతంగా ఇల్లు కట్టుకొని కార్లలో తిరుగుతున్నాను. బిగ్ బాస్ హౌస్ లోకి కూడా వెళ్లాను కానీ వీటన్నింటిని చూడటానికి నాన్న లేరు అంటూ ఈమె ఎమోషనల్ అయ్యారు.

అమ్మకు సారీ చెప్పాలి..

Advertisement

నా జీవితంలో నాన్న లేకపోవడం తీరని లోటు అని అలాంటి క్షణాలు మళ్లీ రాకూడదని ఈ సందర్భంగా రీతు తెలిపారు. అమ్మకు ఏదైనా చెప్పాలనుకుంటే ఏం చెబుతావు అంటూ మరో ప్రశ్న ఎదురవడంతో అమ్మకు నేను సారీ చెబుతానని తెలియజేశారు అమ్మ నన్ను ఇంకా మంచి స్థాయిలో ఉండాలని కోరుకుంది. కానీ నేను ఆ స్థాయికి వెళ్లలేకపోయాను త్వరలోనే అమ్మ అనుకున్న స్థాయిలో నేనుంటాను అంటూ ఈ సందర్భంగా రీతూ తెలిపారు. ఇక తన ఫ్యామిలీ గురించి కూడా మాట్లాడుతూ కాస్త ఎమోషనల్ అయ్యారు.

Advertisement

మా ఇంట్లో నేను అన్నయ్య అమ్మ మేము ముగ్గురమే ఉంటామని మాకు సంతోషం వచ్చిన బాధ వచ్చిన మే ముగ్గురమే పంచుకోవాలి మా ఇంటికి చుట్టాలు కూడా ఎవరూ రారు. కనీసం ఫోన్లు చేసి మాట్లాడించడానికి కూడా ఎవరు లేరని, మా అమ్మ , వాళ్ల సిస్టర్స్ మాత్రమే మాతో మాట్లాడతారని రీతు చౌదరి ఫ్యామిలీ గురించి తలుచుకొని బాధపడ్డారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా తన గురించి సోషల్ మీడియాలో వచ్చిన వార్తలపై కూడా స్పందిస్తూ తన అభిప్రాయాలను తెలియజేశారు. ఇక సోషల్ మీడియా ట్రోల్స్ గురించి కూడా రీతూ మాట్లాడారు. ఏ విషయం గురించైనా కామెంట్ చేసేటప్పుడు ఒక్కసారి పూర్తి అవగాహనతో కామెంట్లు చేయాలని ఈమె తెలియజేశారు. అలాగే సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్ గురించి పెద్దగా పట్టించుకోకపోవడమే మంచిదని రీతు తెలిపారు.

Also Read: Big tv Kissik Talks: రీతూ క్యారెక్టర్ ఇదే.. లైవ్ లో గుర్తు రట్టు చేసిన డెమోన్

Related News

ఈశ్వర్ సాయి కేసులో కొత్త ప్రశ్న.. ‘పెళ్లైనోడిని ఎలా నమ్మావ్ మాధురి?’

స్టార్ హీరోల సినిమాల కంటే సీరియల్స్‌కే ఎక్కువ క్రేజ్.. అసలు సీక్రెట్ ఏంటి?

పిచ్చి కుక్కల్లా మొరగండి… ట్రోలర్స్ కు కౌంటర్ ఇచ్చిన శిరీష!

నాని ఫోక్ సాంగ్ తో అదరగొట్టేసిన శ్రీముఖి.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode September 2nd  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పార్థును చంపేందుకు రెడీగా ఉన్న రౌడీలు

Godavari Janu : హాట్ లుక్ లో రెచ్చగొడుతున్న నిత్య.. కుర్రాళ్ళు తట్టుకోలేరమ్మ..!

Gundeninda GudiGantalu Today episode: బాలుకు షాకిచ్చిన నీలకంఠం.. కన్నీళ్లు పెట్టుకున్న మౌనిక.. పాపం బాలు..

Podarillu Today Episode : మహా మాటతో ఆది షాక్.. చక్రీ ప్లాన్ సక్సెస్.. మాధవ్ నిజం చెప్తాడా..?

Big Stories

Advertisement
×