E-Paper
Advertisement

Rare Discovery: అరేబియా ఎడారిలో అద్భుతం.. మమ్మీలుగా మారిన 54 చిరుతలు! వేల ఏళ్లయినా చెక్కుచెదరకుండా ఎలా ఉన్నాయంటే?

Rare Discovery: అరేబియా ఎడారిలో అద్భుతం.. మమ్మీలుగా మారిన 54 చిరుతలు! వేల ఏళ్లయినా చెక్కుచెదరకుండా ఎలా ఉన్నాయంటే?
Advertisement

Rare Discovery: నిత్యం ప్రపంచవ్యాప్తంగా ఎన్నో వింతైన సంఘటనలు జరుగుతుంటాయి. కొన్ని ఆశ్చర్యానికి గురిచేస్తే.. మరికొన్ని అద్భుతం అనేలా ఉంటాయి. అలాంటిదే తాజాగా నార్తర్న్ సౌదీ అరేబియాలోని ఉత్తర ప్రాంతంలో ఉన్న పురాతన గుహలు ఒక్కసారిగా ప్రపంచాన్ని ఆశ్చర్చానికి గురిచేశాయి. ఆ అద్భుతం ఏమిటంటే.. శతాబ్దాల క్రితం ఈ ప్రాంతంలో సంచరించిన చిరుతపులుల (Cheetahs) అవశేషాలు, మమ్మీలుగా మారి చెక్కుచెదరకుండా లభించాయి. సౌదీ ఎడారిలో ఉండే కఠినమైన వాతావరణ పరిస్థితులను తట్టుకుని ఈ భారీ జంతువులు ఎలా జీవించాయో తెలుసుకోవడానికి ఈ ఆవిష్కరణ ఒక కీలక ములుపుగా మారింది.

సహజ సిద్ధంగా భద్రపరిచిన మమ్మీలు..

సౌదీలోని అరార్ నగరం సమీపంలో జరిపిన తవ్వకాల్లో శాస్త్రవేత్తలు ఏడు చిరుతపులి మమ్మీలతో పాటు.. దాదాపు 54 చిరుతల ఎముకలను కనిపెట్టారు. తాజాగా ‘కమ్యూనికేషన్స్ ఎర్త్ అండ్ ఎన్విరాన్‌మెంట్’ జర్నల్‌లో ప్రచురితమైన ఈ అధ్యయనం ప్రకారం.. ఈ అవశేషాలు 130 ఏళ్ల నుండి 1,800 ఏళ్ల క్రితం నాటివని తెలుస్తోంది.

Advertisement

Also Read: అదో దెయ్యాల కొంప.. 1951లో మొదలైన స్టోరీ నేటీకీ ప్రజలను భయపెడుతుందంటే నమ్మగలరా?

కఠినమైన పరిస్థితుల్లోనూ..

సాధారణంగా ఈజిప్టులో మనుషులు కృత్రిమంగా మమ్మీలను తయారు చేస్తారు. కానీ, ఇక్కడ గుహల్లోని తీవ్రమైన పొడిగాలి, విపరీతమైన వేడి ఉష్ణోగ్రతల వల్ల ఈ జంతువుల శరీరాలు సహజంగానే మమ్మీలుగా మారిపోయాయి. వాటి కళ్లు, కాళ్లు వంటి భాగాలు ఎండిపోయినట్లు కనిపిస్తున్నప్పటికీ.. వాటిని చూడటానికి మాత్రం స్పష్టంగా గుర్తించేలా ఉండటం విశేషం.

చిరుతలు గుహల్లో ఎందుకు ఉన్నట్లు?

Advertisement

ఈ గుహల్లో దాదాపు 54 చిరుతలు ఎందుకు ఉన్నాయనే అంశంపై పరిశోధకులు అనేక అంచనాలు వేస్తున్నారు. చిరుత తల్లులు తమ పిల్లలను పెంచడానికి ఈ గుహలను ఆవాసాలుగా ఉపయోగించి ఉండవచ్చని ఒక వాదన. అలాగే అనారోగ్యం బారిన పడిన లేదా గాయపడిన జంతువులు రక్షణ కోసం ఇక్కడికి చేరుకుని ఉండవచ్చని భావిస్తున్నారు. సాధారణంగా చనిపోయిన జంతువుల కళేబరాలను ఇతర జంతువులు లేదా పక్షులు తినేస్తాయి. కానీ, ఈ గుహల లోపల చిరుతలు ఉండటం వల్ల బయటి నుంచి వచ్చే జంతువుల నుంచి రక్షణ పొంది, వేలఏళ్ల పాటు సురక్షితంగా ఉండిపోయినట్లు తెలుస్తోంది.

వంశపారంపర్యత, సంరక్షణ..

ఒకప్పుడు ఆసియా, ఆఫ్రికా, అరేబియా ప్రాంతాల్లో చిరుతలు విస్తృతంగా సంచరించేవి. అయితే వేటలు, నివాస ప్రాంతాలు తగ్గిపోవడం వంటి కారణాల వల్ల గతకొన్ని దశాబ్దాలుగా అరేబియాలో ఇవి కనిపించకుండా పోయాయి. ఇప్పుడు లభించిన మమ్మీల నుండి శాస్త్రవేత్తలు DNA ను సేకరించడంలో విజయం సాధించారు. ఈ జన్యు పరీక్షల్లో ఇవి ఆధునిక ఆసియా, వాయువ్య ఆఫ్రికా చిరుతలకు దగ్గరి సంబంధం కలిగి ఉన్నాయని తేలింది. ఈ సమాచారం భవిష్యత్తులో చిరుతలను తిరిగి అరేబియా అడవుల్లోకి ప్రవేశపెట్టే కార్యక్రమాలకు ఎంతో సహాయపడుతుందని పరిశోధకులు భావిస్తున్నారు.

Also Read: కొండంచున కాఫీ షాపు.. అక్కడ హెల్మెట్ తప్పనిసరి, లేకపోతే..

Related News

ట్రాయ్ దెబ్బకు దిగొచ్చిన Airtel.. కేవలం కాల్స్, ఎస్‌ఎంఎస్‌ల కోసం కొత్త రీఛార్జ్ ప్లాన్లు!

పిక్సెల్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే న్యూస్.. దీపావళి సేల్‌లో భారీ తగ్గింపులు, నవంబర్ 8 వరకే ఛాన్స్!

ఫ్లిప్‌కార్ట్‌లో iPhone 17పై ఊహించని భారీ తగ్గింపు.. ఇంత తక్కువ ధరకు ఎప్పుడూ చూడలేదు!

వెదర్ రిపోర్ట్స్ ఇకపై వంద శాతం పక్కా.. మైక్రోసాఫ్ట్ సంచలన ప్రయోగం!

ఆకాశంలో ఓ అరుదైన నక్షత్రాన్ని కనిపెట్టిన సైంటిస్టులు.. ఇది ఎరంగులో ఉందంటే..?

సెకండ్ హ్యాండ్ మొబైల్ కొంటున్నారా? మోసపోకూడదంటే ఈ 5 విషయాలు కచ్చితంగా చెక్ చేయండి!

ఓటీపీ షేర్ చేసి పొరపాటు చేశారా? మీ డబ్బు కాపాడుకోవడానికి.. వెంటనే ఈ 5 పనులు చేయండి!

స్మార్ట్‌వాచ్‌ vs ఫిట్‌నెస్ బ్యాండ్.. రెండింటిలో ఫీచర్లు ఒకటేనా? ఏది కొంటే మన డబ్బులు వృధా కావు?

Big Stories

Advertisement
×