E-Paper
Advertisement

Big Tv Kissik Talks: పెళ్లి తర్వాత చేయాల్సినవి పెళ్లికి ముందే అవుతున్నాయి.. లివింగ్ రిలేషన్ పై శ్రీ సత్య హాట్ కామెంట్స్!

Big Tv Kissik Talks: పెళ్లి తర్వాత చేయాల్సినవి పెళ్లికి ముందే అవుతున్నాయి.. లివింగ్ రిలేషన్ పై శ్రీ సత్య హాట్ కామెంట్స్!
Advertisement

Big Tv Kissik Talks: శ్రీ సత్య పరిచయం అవసరం లేని పేరు. బుల్లితెర నటిగా పలు సీరియల్స్ లో నటించిన ఈమె అనంతరం పలు సినిమాలలో కూడా చిన్న చిన్న పాత్రలలో నటించారు. ఇక ప్రస్తుతం బుల్లితెర కార్యక్రమాలలో సందడి చేస్తున్న సంగతి తెలిసిందే . శ్రీ సత్య(Sri Satya) ఇటీవల బిబి జోడి 2 (బి.B.Jodi 2)కార్యక్రమంలో అర్జున్ కళ్యాణ్ తో కలిసి జోడిగా సందడి చేశారు. ప్రస్తుతం కెరియర్ పరంగా పలు కార్యక్రమాలలో నటిస్తూ బిజీగా ఉన్న శ్రీ సత్య తాజాగా బిగ్ టీవీ కిస్సిక్ టాక్స్(Big TV Kissik Talks) కార్యక్రమంలో పాల్గొన్నారు. తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో వీడియో విడుదల చేశారు.

పెళ్లికి ముందే రిలేషన్..

ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీ సత్య తన కెరీర్ కి సంబంధించిన విషయాలు గురించి మాత్రమే కాకుండా వ్యక్తిగత విషయాలు తన లవ్ బ్రేకప్ తన పేరెంట్స్ గురించి కూడా ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకున్నారు. ఇకపోతే ఇటీవల కాలంలో ఎంతోమంది లివింగ్ ఇన్ రిలేషన్(living in relationship) లో ఉంటున్న సంగతి తెలిసిందే. పెళ్లికి ముందే ఇలా రిలేషన్ లో ఉండటం వల్ల ఒకరి గురించి ఒకరికి పూర్తిగా తెలుస్తుందని అప్పుడు పెళ్లి చేసుకుంటే తమ వైవాహిక జీవితంలో ఎలాంటి గొడవలు రావు అంటూ ఎంతో మంది సెలబ్రిటీలు ఇలా లివింగ్ ఇన్ రిలేషన్ లో ఉంటున్నారు.

పెళ్లికి చాలా గౌరవం ఇస్తాను..

Advertisement

ఈ నేపథ్యంలోనే శ్రీ సత్యకు లివింగ్ ఇన్ రిలేషన్ గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. మీ దృష్టిలో లివింగ్ ఇన్ రిలేషన్ అంటే ఏంటి అంటూ ప్రశ్న ఎదురు కావడంతో శ్రీ సత్య మాట్లాడుతూ పెళ్లి తర్వాత చేయాల్సినవన్నీ పెళ్లికి ముందే చేస్తున్నారు నా దృష్టిలో లివింగ్ ఇన్ రిలేషన్ అంటే అదే అని తెలిపారు. నేను పెళ్లికి చాలా గౌరవం ఇస్తాను. నువ్వు ఒకరిని పెళ్లి చేసుకున్న తర్వాత జీవితాంతం కష్టమైన నష్టమైనా వారితోనే ఉండాలి. కానీ లివింగ్ రిలేషన్ లో ఉండి వర్క్ అవుట్ అవ్వలేదు అంటూ విడిపోవడం కరెక్ట్ కాదని తెలిపారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా చాలా మంది అమ్మాయిలు బాగా లేకపోయినా అబ్బాయి బాగా లేకపోయినా జీవితంలో అడ్జస్ట్ అవుతూ ఉంటారు. ఇలా అడ్జస్ట్ అవ్వడానికి కారణం డబ్బు అని శ్రీ సత్య తెలిపారు.

Advertisement

నేను నా జీవితంలో ఇలాంటి వాటిని చాలా చూశాను. ముఖ్యంగా నా స్నేహితులు మా బంధువులు కూడా డబ్బులు ఉంటేనే మన వద్దకు వస్తారు, డబ్బు మనిషి జీవితంలో కీలక పాత్ర పోషిస్తుందని ఈ సందర్భంగా శ్రీ సత్య డబ్బు గురించి పెళ్లి గురించి అలాగే లివింగ్ రిలేషన్ గురించి చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇలా లివింగ్ రిలేషన్ గురించి శ్రీ సత్య చేసిన కామెంట్స్ పట్ల నెటిజన్లు స్పందిస్తూ శ్రీ సత్య చెప్పింది 100% నిజమని ఈమెకు మద్దతుగా కామెంట్లు తెలుపుతున్నారు.

Also Read: Jr.NTR -Neel: ఎన్టీఆర్ డ్రాగన్ సినిమాకు రోజుకు కోటిన్నర ఖర్చు…భారీ హైప్ ఇచ్చిన ప్రొడ్యూసర్!

Related News

యూట్యూబర్ నందనకి కోర్టులో భారీ ఊరట.. సంచలన పోస్ట్ వైరల్!

Telugu Tv Serials : బిగ్ బాస్ ఎఫెక్ట్.. ఆ సీరియల్స్ కు శుభం కార్డు పడినట్లే..?

ఒక్కరోజులో మారిపోయిన లెక్కలు..ఆరో వారం ఊహించని ఎలిమినేషన్ ట్విస్ట్..!

Karthika Deepam2 : సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. ఆ క్యారెక్టర్ అవుట్..

Intinti Ramayanam Today Episode: అవనిని కొట్టించిన పల్లవి.. రెచ్చిపోయిన అక్షయ్.. పల్లవికి దిమ్మతిరిగే షాక్..

Illu Illalu Pillalu Today Episodes: వల్లికి విశ్వం వార్నింగ్.. వేధవతికి సీరియస్.. భాగ్యం ప్లాన్ సక్సెస్..

Podarillu Today Episode : జమున దొరుకుతుందా..? శైలు మాటతో షాక్.. నారాయణ దెబ్బకు మైండ్ బ్లాక్..

Karthika Deepam 2 Serial Today Episode October 17th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని ఎదురుగానే జ్యోత్స్న చేయి పట్టుకున్న సూరజ్            

Big Stories

Advertisement
×