Ather March 2026 Offers: ఏథర్ కంపెనీ సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను అందుబాటులోకి తీసుకొస్తుంది. తక్కువ ధరల్లో మంచి రేంజ్ అందించే స్కూటర్లను విడుదల చేస్తుంది. అంతేకాదు, కంపెనీ అమ్మకాలను పెంచుకోవడమే లక్ష్యంగా ఏథర్ ఎనర్జీ, మార్చి 2026కు సంబంధించి ఆఫర్లు ప్రకటించింది. ముఖ్యంగా రిజ్టా, 450 సిరీస్‌పై పరిమిత కాల ఆఫర్లను ప్రకటించింది. వినియోగదారులు ఏథర్ ఎక్స్ పీరియన్స్ సెంటర్లలో 31 మార్చి 2026 వరకు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లపై రూ. 20,000 వరకు ప్రయోజనాలను అందిస్తుంది. ఈ ప్యాకేజీలో మూడు భాగాలు ఉన్నాయి. రూ. 10,000 క్రెడిట్ కార్డ్ డిస్కౌంట్, రూ. 6,500 క్యాష్ డిస్కౌంట్, రూ. 3,500 విలువైన ఎక్స్ టెండెండ్ కాంపోనెంట్స్ వారంటీ అందిస్తుంది.
రిజ్టా ఎస్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇప్పుడు రూ. 1,04,758 ధరకు అందుబాటులో ఉంది. అటు 450ఎస్ ధర రూ. 1,13,100 గా ఉంది. 31 మార్చి 2026 వరకు ఈ ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో ఈ రెండు స్కూటర్లు అమ్మకాల పరంగా మంచి సత్తా చాటుతున్నాయి. రిజ్టా ఎస్ స్కూటర్ కుటుంబ ప్రయాణాలకు అనుకూలంగా ఉండగా, 450 ఎస్ మంచి పర్ఫార్మెన్స్ తో ఆకట్టకుంటుంది.
Read Also: ఓలా క్రేజీ ఆఫర్.. ఏకంగా రూ.30 వేలు తగ్గింపు!
అటు ఈ స్కూటర్ల మీద రూ. 5,000 విలువైన పీఎం ఇ-డ్రైవ్ సబ్సిడీని 31 మార్చి 2026 నుంచి నిలిపివేయనున్నట్లు ఏథర్ ప్రకటించింది. ఈ నెలలో వినియోగదారులు బ్రాండ్ సొంత ఆఫర్లను ఉపయోగించుకుంటూనే, పీఎం ఇ-డ్రైవ్ సపోర్టును పొందవచ్చని సూచించింది. ఈ నెల చివరి వరకు ఎలక్ట్రిక్ స్కూటర్లు కొనుగోలు చేయడం ద్వారా మంచి బెనిఫిట్స్ పొందే అవకాశం ఉందన్నారు. కొనుగోలుదారులు వీలైనంత వరకు ఈ నెల చివరి వరకు ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేయాలని సూచించింది. ఏథర్ తో పాటు ఇతర ఎలక్ట్రిక్ స్కూటర్లకు ఈ నెల చివరి వరకే కేంద్ర ప్రభుత్వ బెనిఫిట్స్ అందుబాటులో ఉంటాయన్నారు.
Read Also: మూడు చక్రాలు, ఓ ఎయిర్ బ్యాగ్.. యమహా స్కూటర్ భలే ఉంది భయ్యా!